ప్రజాసంకల్పం పేరుతో నేను ముఖ్యమంత్రిని కావలి అంటూ, పాదయాత్ర చెయ్యనున్న జగన్, దాని మీద నిన్న పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు... ఎప్పుడు ఏమి చెయ్యాలి, ఎవరు ఏమి చెయ్యాలి, పేపర్ లో ఎలా రాయాలి, టీవీలో ఎలా రావాలి, సోషల్ మీడియాలో ఎలా రావాలి, ఇలా అన్నీ ప్లాన్ చేసుకుంటానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు... ఈ మీటింగ్ లో, పాదయాత్రకు సంబంధించి కొంత మెటీరియల్ ఇచ్చారు... అవి చూసిన నాయకులు అవాక్కయ్యారు...
మొత్తంగా పాదయాత్ర నాలుగు రోజులు, రోజుకి రెండు షిఫ్ట్ లుగా చేస్తారు అంట... పొద్దున్న నాలుగు గంటల నడక, మధ్యానం రెస్ట్, సాయంత్రం ఇంకో నాలుగు గంటలు, 7:30 గంటలకి ప్యాక్ అప్... ఇంత వరకు బాగానే ఉంది కాని, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. ప్రతి రోజు, ఒక విచ్ఛిన్నకరమైన కార్యక్రమం చేస్తారంట... ఇది హైలైట్ చేసి మరీ పెట్టటంతో, నాయకులు అది చూసి అవాక్కయ్యారు... ఈ విచ్ఛిన్నకరమైన కార్యక్రమం ఏమై ఉంటుంది అని ఆరా తీసారు.. జగన్ ను అడిగే ధైర్యం లేదు కాబట్టి, వాళ్ళలో వాళ్ళే చర్చించుకున్నారు....
నిజానికి జగన్ పాదయత్ర మీద అధికార పక్షం విమర్శలు గుప్పిస్తునే ఉంది... జగన్ పార్టీ చరిత్ర చూసి, ఈ యాత్రలు అన్నీ, రాష్ట్రంలో అలజడి సృస్టించటానికి అని అంటూ వస్తుంది... ఈ "విచ్ఛిన్నకరమైన కార్యక్రమం " జగన్ బ్రోచర్ లో పెట్టి అండర్ లైన్ చేసిన తరువాత, అధికార పక్షం చెప్పింది నిజమేనా అని మీడియా వర్గాలు అనుకుంటున్నాయి... రోజుకి ఒక "విచ్ఛిన్నకరమైన కార్యక్రమం " అంటే, రాష్ట్రం ఏమై పోవాలి ? అసలు ఈ "విచ్ఛిన్నకరమైన కార్యక్రమం " అంటే ఏంటో, వైఎస్ఆర్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది... పోలీసులు కూడా, ఇదెంతో ఒకసారి ఆలోచించాలి...