రాజశేఖర్ రెడ్డి పాదయత్ర చూసాం... చంద్రబాబు పాదయాత్ర చూసాం.. చివరకు షర్మిల పాదయత్ర కూడా చూసాం... ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సరి కొత్త పాదయాత్ర చూడబోతున్నాం... వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు పాదయాత్రకు బ్రేక్ లేకుండా నిరాటంకంగా నడిచారు... కాని మన జగన్, 4:1:2 పాదయాత్ర చేస్తున్నారు... అంటే 4 రోజులు నడక... 1 రోజు కోర్ట్... 2 రోజులు లోటస్ పాండ్ లో రెస్ట్... ఇది జగన్ నయా ట్రెండ్... ఇప్పటికే పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది... ఇప్పుడు పాదయాత్ర విషయంలో రోజులు కూడా లిమిట్ చేసుకుంటే ఎలా అని పార్టీ వర్గాలు అంటున్నాయి..

jagan 25102017 2

నాలుగు రోజుల నిర్ణయం వెనుక చాలా కసరత్తు జరిగింది అంటున్నారు... ప్రతి శుక్రువారం కోర్ట్ కి వెళ్ళాలి... ఇది అయితే పక్కా... సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళినా, దీని నుంచి మినహాయింపు ఉండదు... ముందుగా గాలి జనార్ధన్ రెడ్డి ద్వారా ఒక హెలికాప్టర్ ఎప్పుడూ జగన్ తిరగే ప్రదేశంలో ఉంచుదాం అనుకున్నారు... తద్వారా శుక్రవారం పొద్దున్నే అయినా కోర్ట్ కి వెళ్లి రావచ్చు అని ప్లాన్ చేశారు... మరి జనాలు ఆ విచ్చలవిడి తనం చూసి నవ్వుతారానో ఏమో, ఆ నిర్ణయం ఉపసంహరించుకున్నారు... ప్రతి వారం రెండు సార్లు హెలికాప్టర్ వెళ్ళాలి అంటే, దానికి ఎయిర్పోర్ట్ ఆధారటీ పర్మిషన్ కావలి... ఇవన్నీ రిస్క్ అనుకున్నారో ఏమో, హెలికాప్టర్ నిర్ణయం మానుకున్నారు...

jagan 25102017 3

మరి బై రోడ్ కాని, బై ఎయిర్ కాని వస్తే, దానికి చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు... పాదయాత్ర రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నా ప్రతి గురువారం సాయంత్రం విరామమిచ్చి హైదరాబాద్‌కు హడావుడిగా బయల్దేరాల్సి ఉంటుందని.. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో లేదా విమానంలో చేరుకోవడం సాధ్యపడుతుందని.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల్లో యాత్రలో ఉంటే మాత్రం గురువారం మధ్యాహ్ననికే యాత్రకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందని సన్నిహితులు పేర్కొన్నారు.. అలాగే రిటర్న్ జర్నీ కూడా కొన్ని సార్లు వచ్చే సరికి శనివారం అయిపోతుంది... ఒక్కోసారి, ఒక్కో విధంగా పాదయాత్ర చేస్తే, ప్రజల్లో చులకన అవుతామని, అందుకే గురు, శుక్ర, శనివారాల్లో విరామం ప్రకటించి, ఆదివారం నుంచి బుధవారం వరకు పాదయాత్ర చెయ్యాలని జగన్ డిసైడ్ అయ్యారు. బుధవారం రాత్రికే యాత్రను ఆపేసి.. గురువారం హైదరాబాద్‌ చేరి.. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరై.. శనివారం పార్టీ పరమైన సమీక్షలు నిర్వహించి.. మళ్లీ ఆదివారం యాత్రను పునఃప్రారంభించాలని, దీనికి సంభందించి రేపు వైసీపీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం...

దేశంలో పేరుకుపోయిన అవినీతి కేసుల్లో న్యాయపరమైన ముగింపునకు మితిమీరిన ఆలస్యం అవుతుంది అంటూ బిజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఈ విషయంలో సిబిఐ బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఈ లేఖ హాట్ టాపిక్ అయ్యింది... జగన్ 11 కేసుల్లో A1 గా ఉన్నారు... ఒక పక్క సిబిఐ 43 వేల కోట్లు స్కాం జరిగింది అని తెలిపింది కూడా.. మరో పక్క జగన్ వారం వారం కోర్ట్ కి హాజరు అవుతూనే ఉన్నారు... 3 కేసుల విచారణ చివరి దశకు చేరుకుంది... అయితే జగన్, బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు అని, అందుకే ఈ మధ్య జగన్ కేసుల్లో పురోగతి లేదు అనే వార్తలు కూడా వచ్చాయి...

subramanya swamy 24102017 2

ఈ తరుణంలోనే సుప్రీం కోర్ట్, హై కోర్ట్కూడా ఇలాంటి అవినీతి కేసులు జాప్యం చెయ్యకుండా త్వరగా తెల్చేమని కూడా చెప్పింది... ఇప్పుడు సుబ్రమణ్య స్వామి, ఇలాంటి రాజకీయ అవినీతి కేసుల పై ప్రధానికి లేఖ రాయటం చర్చనీయంసం అయ్యింది... ఆయన టార్గెట్ సోనియా గాంధీ అయినా, జగన్ కేసుల విషయం కూడా పలు మార్లు ప్రస్తావించారు... సుబ్రమణ్య స్వామి ఏదైనా పట్టుకున్నారు అంటే, అది తేల్చే దాకా నిద్రపోరు అంటారు... మన కళ్ళ ముందే జయలలిత కేసు చూశాం... 100 కోట్ల లోపు అవినీతి ఆరోపణలు రుజువై శసికళ జైలు జీవితం అనుభవిస్తున్నారు...

subramanya swamy 24102017 3

సుబ్రమణ్య స్వామి ప్రధానికి రాసిన లేఖలో ఏముంది అంటే,... "అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనే మీ పునఃనిర్ణయంతో దేశం కృతజ్ఞత భావంతో ఉందని లేఖలో పేర్కొన్నారు. విచారణకు ముందే సిబిఐ నిగుతేల్చిన అవినీతి కేసుల్లో కూడా మితిమీరిన ఆలస్యంపై ప్రాసిక్యూషన్ చేయించాలన్నారు... అదే విధంగా న్యాయపరమైన ముగింపు పై కూడా మోడీ దృష్టిసారిస్తారని ఆశిస్తున్నా" అని లేఖలో తెలిపారు. శారద చిట్ఫండ్ కుంభకోణం, అగస్టా వెస్ట్ల్యాండ్ ఒప్పందం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ ఒప్పందాలకు సంబంధించిన పలు కేసులతో పాటు, ఇంకా కొన్ని కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి అని సుబ్రమణ్య స్వామి లేఖలో ప్రస్తావించారు. ఈ కేసులు అన్నీ మన జగన్ కేసులతో పోల్చుకుంటే చాలా చిన్నవి, ఆ ఇంకా కొన్ని కేసుల్లో ప్రధాన మైనది జగన్ కేసు అయ్యి ఉంటుంది అని, రాజకీయ వర్గాలు అంటున్నాయి...

పెట్టుబడులను ఆకర్షించి నవ్యాంధ్ర ప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం విదేశీ పర్యటన సోమవారం ఆరవ రోజుకు చేరింది. యుఏఈ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అల్ నహ్యాన్ ముఖ్యమంత్రి గౌరవార్ధం విందు ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి పెట్టుబడుల కంపెనీ ‘ముబదాల (Mubadala ’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సంస్థ డిప్యూటీ గ్రూపు సీఈవో హోమిత్ అల్ షిమ్మరీ మాట్లాడుతూ ఇంధన నిల్వ వ్యవస్థ (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌) లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు. సెమీ కండక్టర్స్, మినరల్స్, ఏరో స్పేస్, పునరుత్పాదక ఇంధన రంగం, స్థిరాస్థులు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, యుటిలిటీస్, రక్షణ సర్వీసులు, స్థిరాస్థులు, వైద్య ఆరోగ్యం, పెట్టుబడుల రంగాల్లో తమకున్న అనుభవాన్ని షిమ్మరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఆయారంగాలలో తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని భారత్‌లో విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు. రెండంకెల వృద్ధి రేటు దిశగా పయనిస్తోందని, తమ దేశంలో యువజనాభా అధికమని చెప్పారు. భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ‘హ్యాపెనింగ్ స్టేట్’ గా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం వివరించారు. ప్రపంచ ప్రమాణాలనే తాము గీటురాళ్లుగా నిర్దేశించుకున్నామని, సరళతర వ్యాపారంలో మేము అగ్రగామిగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. దేశంలో మొదటిస్థానంలో, ప్రపంచంలో తొలి 5 స్థానాలలో ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో ఆగ్నేయాసియాకు ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంగా ఉందని, రోడ్లు, రైల్వే, అంతర్గత జల రవాణాతో మంచి కనెక్టివిటీ కలిగి వున్నట్లు వివరించారు. వ్యవసాయ శుద్ధి పరిశ్రమల్లో ప్రబల శక్తిగా నిలిచామని, సేంద్రీయ వ్యవసాయంలో ముందున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ‘రాజధాని అమరావతి నిర్మాణంలో మీకు అపార అవకాశాలు ఉన్నాయి. 9 నగరాలు, 27 టౌన్‌షిప్పులతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నాం. అమరావతి వచ్చి అక్కడ మీ పెట్టుబడులను పెట్టే అవకాశాన్ని పరిశీలించండి.

ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాలలో ఒకటిగా నిలిచేలా అమరావతిని నిర్మిస్తున్నాం. మీ సారధ్యంలో యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా మీరు బాధ్యత తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హోమిత్ అల్ షిమ్మరీతో అన్నారు. ఈ అంశంపై సంయుక్త కార్య బృందాన్ని (working group) ఏర్పాటు చేద్దామని షిమ్మరీ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. వర్కింగ్ గ్రూపులో ముబదాల గ్రూపు నుంచి ముగ్గురు పేర్లను షిమ్మరి సూచించగా, ఏపీ తరఫు నుంచి అజయ్‌జైన్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాస్తి కృష్ణకిశోర్, భారత రాయబార కార్యాలయం నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాగా పెట్టుబడులకు అవసరమైన రెగ్యులేటరీ, లీగల్ వ్యవహారాలను వర్కింగ్ గ్ర్రూపు పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సందర్శనకు రావాలని మన:స్ఫూర్తిగా మిమ్మల్పి ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు షిమ్మరీని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపారు. భారత రాయబారి నవదీప్ సూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు దుబాయ్ పర్యటన ముగిసింది.. ముఖ్యమంత్రి బృందం లండన్ బయలుదేరి వెళ్ళింది...

శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ, సికింద్రాబాద్ ల మధ్య నడిచే సూపర్ఫాస్ట్ ట్రైన్ ఇది... 351 కిమీ దూరం, 5 గంటల 35 నిమిషాలతో చేరుకుంటుంది ఇది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మరియు మధిరల మీదుగా సికింద్రాబద్ నుండి విజయవాడకు వెళుతుంది. విజయవాడ నుండి సికింద్రాబద్ కు పొద్దున్నే మొదలయ్యే రైళ్ళలో ఇదొకటి. శాతవాహన ఎక్స్‌ప్రెస్ లో మొత్తం 20 బోగీలు ఉంటాయి. అయితే, శాతవాహన ఎక్స్‌ప్రెస్ నవంబర్ ఒకటి నుంచి, గుంటూరు దాకా వెళ్లనుంది..

satavahana express 24102017 2

విజయవాడ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ గుంటూరు వరకు పొడిగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు (నెంబర్ 12713) గుంటూరులో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు 11.55 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (నెంబర్ 12714) సికింద్రాబాద్ లో సాయంత్రం 4.15 కి బయలుదేరి విజయవాడ మీదుగా గుంటూరుకు రాత్రి 11.15 గంటలకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.

satavahana express 24102017 3

నవంబరు ఒకటి నుంచి అమలయ్యే కొత్త టైం టేబుల్ లో ఈ రైలు గురించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే గుంటూరు నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు బయలుదేరి నడికుడి మీదుగా వికారాబాద్ వెళ్తుంది. అదే విధంగా ఉదయం 6.00కి గోల్కొండ ఎక్స్‌ప్రెస్ విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు వెళ్తుంది.

Advertisements

Latest Articles

Most Read