రాజశేఖర్ రెడ్డి పాదయత్ర చూసాం... చంద్రబాబు పాదయాత్ర చూసాం.. చివరకు షర్మిల పాదయత్ర కూడా చూసాం... ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సరి కొత్త పాదయాత్ర చూడబోతున్నాం... వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు పాదయాత్రకు బ్రేక్ లేకుండా నిరాటంకంగా నడిచారు... కాని మన జగన్, 4:1:2 పాదయాత్ర చేస్తున్నారు... అంటే 4 రోజులు నడక... 1 రోజు కోర్ట్... 2 రోజులు లోటస్ పాండ్ లో రెస్ట్... ఇది జగన్ నయా ట్రెండ్... ఇప్పటికే పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది... ఇప్పుడు పాదయాత్ర విషయంలో రోజులు కూడా లిమిట్ చేసుకుంటే ఎలా అని పార్టీ వర్గాలు అంటున్నాయి..
నాలుగు రోజుల నిర్ణయం వెనుక చాలా కసరత్తు జరిగింది అంటున్నారు... ప్రతి శుక్రువారం కోర్ట్ కి వెళ్ళాలి... ఇది అయితే పక్కా... సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళినా, దీని నుంచి మినహాయింపు ఉండదు... ముందుగా గాలి జనార్ధన్ రెడ్డి ద్వారా ఒక హెలికాప్టర్ ఎప్పుడూ జగన్ తిరగే ప్రదేశంలో ఉంచుదాం అనుకున్నారు... తద్వారా శుక్రవారం పొద్దున్నే అయినా కోర్ట్ కి వెళ్లి రావచ్చు అని ప్లాన్ చేశారు... మరి జనాలు ఆ విచ్చలవిడి తనం చూసి నవ్వుతారానో ఏమో, ఆ నిర్ణయం ఉపసంహరించుకున్నారు... ప్రతి వారం రెండు సార్లు హెలికాప్టర్ వెళ్ళాలి అంటే, దానికి ఎయిర్పోర్ట్ ఆధారటీ పర్మిషన్ కావలి... ఇవన్నీ రిస్క్ అనుకున్నారో ఏమో, హెలికాప్టర్ నిర్ణయం మానుకున్నారు...
మరి బై రోడ్ కాని, బై ఎయిర్ కాని వస్తే, దానికి చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు... పాదయాత్ర రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నా ప్రతి గురువారం సాయంత్రం విరామమిచ్చి హైదరాబాద్కు హడావుడిగా బయల్దేరాల్సి ఉంటుందని.. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గంలో లేదా విమానంలో చేరుకోవడం సాధ్యపడుతుందని.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల్లో యాత్రలో ఉంటే మాత్రం గురువారం మధ్యాహ్ననికే యాత్రకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందని సన్నిహితులు పేర్కొన్నారు.. అలాగే రిటర్న్ జర్నీ కూడా కొన్ని సార్లు వచ్చే సరికి శనివారం అయిపోతుంది... ఒక్కోసారి, ఒక్కో విధంగా పాదయాత్ర చేస్తే, ప్రజల్లో చులకన అవుతామని, అందుకే గురు, శుక్ర, శనివారాల్లో విరామం ప్రకటించి, ఆదివారం నుంచి బుధవారం వరకు పాదయాత్ర చెయ్యాలని జగన్ డిసైడ్ అయ్యారు. బుధవారం రాత్రికే యాత్రను ఆపేసి.. గురువారం హైదరాబాద్ చేరి.. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరై.. శనివారం పార్టీ పరమైన సమీక్షలు నిర్వహించి.. మళ్లీ ఆదివారం యాత్రను పునఃప్రారంభించాలని, దీనికి సంభందించి రేపు వైసీపీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం...