వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ... ఈ పార్టీ అధినేత జగన్ దగ్గర నుంచి, కింద స్థాయి కార్యకర్తలు దాకా, అందరికీ ఒక క్వలిఫికేషన్ ఉంటుంది... అదే కేసులు, బెయిలు, జైళ్ళు... ఇవి లేకుండా ఆ పార్టీలో ఉండటం కష్టం... బలాబలాలు బేరీజు వేసుకునేప్పుడు, ఎన్ని కేసులు ఉన్నాయి అని చూసుకుని గుర్తింపు ఇస్తారని కాబోలు, ఆ పార్టీలో అందరూ, ఎదో ఒక పిచ్చి పని చేసి, కేసుల్లో ఉంటూ ఉంటారు, అధినేత మన్ననలు పొందుతారు.. తాజాగా, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి నెంబర్ వన్ 420 అని, అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, కుట్రపూరితంగా వ్యవహరించారు అని, సాక్షాత్తు ఇమిగ్రేషన్, ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు.
ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ, కొన్ని డాకుమెంట్లు బయట పెట్టారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియాకు వెళ్లినట్లు, అక్కడ ఆయనకు స్థిరాస్తులు, బ్యాంకుల్లో నగదు ఉన్నాయని, థాయ్‌లాండ్‌లో సోమిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు పవర్ప్రాజెక్టు ఉందని ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. 2016 డిసెంబరులో ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను అందించారు. దీని పై సోమిరెడ్డి డిసెంబరు 28న నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవన్నీ నకిలీ పత్రాలని, తనకు విదేశాల్లో ఆస్తులు లేవని, దీనిపై విచారణ జరపాలని కోరారు.
పోలీసు విచారణలో, కాకాణి చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని తేల్చారు. ఆయన బయటపెట్టిన పత్రాలన్నీ నకిలీవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణను జత చేసి, నెల్లూరు మొదటి తరగతి నాల్గో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియా వెళ్లినట్లు ఆధారాల్లేవని.. అసలు ఆయన పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయనేలేదని ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. చిరంజీవి అనే వ్యక్తితో కలిసి, లక్ష రూపాయలు ఇచ్చి, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు తాయారు చేసారని, చిరంజీవితో పలు సార్లు ఫోన్లో మాట్లాడడం, మెసేజ్‌లు ఇవ్వడం వంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించి చార్జిషీటులో పొందుపరిచారు.