వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ... ఈ పార్టీ అధినేత జగన్ దగ్గర నుంచి, కింద స్థాయి కార్యకర్తలు దాకా, అందరికీ ఒక క్వలిఫికేషన్ ఉంటుంది... అదే కేసులు, బెయిలు, జైళ్ళు... ఇవి లేకుండా ఆ పార్టీలో ఉండటం కష్టం... బలాబలాలు బేరీజు వేసుకునేప్పుడు, ఎన్ని కేసులు ఉన్నాయి అని చూసుకుని గుర్తింపు ఇస్తారని కాబోలు, ఆ పార్టీలో అందరూ, ఎదో ఒక పిచ్చి పని చేసి, కేసుల్లో ఉంటూ ఉంటారు, అధినేత మన్ననలు పొందుతారు.. తాజాగా, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి నెంబర్ వన్ 420 అని, అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, కుట్రపూరితంగా వ్యవహరించారు అని, సాక్షాత్తు ఇమిగ్రేషన్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు.

ysrcp 22102017 2

ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి , మంత్రి సోమిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ, కొన్ని డాకుమెంట్లు బయట పెట్టారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియాకు వెళ్లినట్లు, అక్కడ ఆయనకు స్థిరాస్తులు, బ్యాంకుల్లో నగదు ఉన్నాయని, థాయ్‌లాండ్‌లో సోమిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు పవర్‌ప్రాజెక్టు ఉందని ఎమ్మెల్యే కాకాణి ఆరోపించారు. 2016 డిసెంబరులో ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను అందించారు. దీని పై సోమిరెడ్డి డిసెంబరు 28న నెల్లూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవన్నీ నకిలీ పత్రాలని, తనకు విదేశాల్లో ఆస్తులు లేవని, దీనిపై విచారణ జరపాలని కోరారు.

ysrcp 22102017 3

పోలీసు విచారణలో, కాకాణి చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని తేల్చారు. ఆయన బయటపెట్టిన పత్రాలన్నీ నకిలీవేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన ధ్రువీకరణను జత చేసి, నెల్లూరు మొదటి తరగతి నాల్గో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. 2003 సెప్టెంబరు 13న సోమిరెడ్డి మలేసియా వెళ్లినట్లు ఆధారాల్లేవని.. అసలు ఆయన పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయనేలేదని ఇమిగ్రేషన్‌ అధికారులు వెల్లడించారు. చిరంజీవి అనే వ్యక్తితో కలిసి, లక్ష రూపాయలు ఇచ్చి, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు తాయారు చేసారని, చిరంజీవితో పలు సార్లు ఫోన్‌లో మాట్లాడడం, మెసేజ్‌లు ఇవ్వడం వంటి సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించి చార్జిషీటులో పొందుపరిచారు.

అనంతపురం జిల్లా సోమందేపల్లిలో అనుకోని అతిధి సందడి చేసింది... అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రానికి చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న సినీనటి పూనం కౌర్‌ సందడి చేశారు. ఈ రోజు పూనం పుట్టినరోజు సందర్భంగా సామాన్య ప్రజల మధ్య, చేనేత కార్మికుల మధ్య స్వయంగా ఉండి, వారి బాగోగులను ప్రత్యక్షంగా చూశారు. రెండు నెలల క్రితం వైజాగ్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ముఖ్యమంత్రి పూనం కౌర్‌ తో మాట్లాడి, ఆమెను రాష్ట్రానికి చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసడర్ గా నియమించారు... అయితే, అందరిలా కాకుండా, ఆమెకు అప్పగించిన బాధ్యత కోసం, ఏకంగా ఆమె పుట్టిన రోజు నాడే రంగలోకి దిగారు.

punam kaur 21102017 2

అనంతపురం జిల్లా సోమందేపల్లి వచ్చిన ఆమె చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు, పూనం కౌర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి సినీనటి పూనం కౌర్‌ ను, రాష్ట్రానికి చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసడర్ గా నియమించిన సందర్భంలో చాలా విమర్శలు వచ్చాయి... మన తెలుగు వారిని పెట్టకుండా, ఎక్కడ నుంచో వచ్చిన వారిని పెట్టుకోవటం ఏంటి అనే విమర్శలు వచ్చాయి. నిజానికి, మన హైదరాబాద్ సినీ హీరోలకు, మిగతా నటులకు మన రాష్ట్రం అంటే చిన్న చూపు.. ఆంధ్రప్రదేశ్ లో మొక్కలు నాటండి అంటే ఒక్కరు కూడా రాలేదు.. 

punam kaur 21102017 3

అదే తెలంగాణా ప్రభుత్వం హరిత హారం అంటే, షూటింగ్ లు ఆపుకుని మరీ ఎగబడ్డారు... రాజధాని శంకుస్థాపనకి ఒక్కరు రాలేదు... అక్కడ సియం మనవాడి పుట్టిన రోజు అయినా, సెలెబ్రేట్ చేసుకుంటారు... మన ముఖ్యమంత్రి ఎన్ని మంచి పనులు చేసినా, ఒక్కరు కూడా ఏనాడు మెచ్చుకోలేదు... అక్కడ మంత్రిగారు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ కూర్చున్నా, అహా ఓహో అంటూ, రోజుకి ఒకరు పొగుడుతారు.. మరి అలాంటి వాళ్ళకి, మన రాష్ట్రం అంటే కనీసం ప్రేమ లేని వారికి, మన రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ అంబాసడర్ హోదా ఎందుకు ఇవ్వాలి ? అందుకే ఎక్కడ నుంచో వచ్చిన పూనం కౌర్ ని చేనేత బ్రాండ్ అంబాసడర్ చేశారు చంద్రబాబు... తప్పేముంది, దీంట్లో... ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన పూనం కౌర్‌, మన రాష్ట్రంలోని ఒక మారు మూల ఊరిలో తన పుట్టిన రోజు వేడుకులు, చేనేత కార్మికలు కష్టాలు తెలుసుకుంటూ జరుపుకున్నారు... మరి మాన హైదరాబాద్ సినిమా బ్యాచ్ కంటే, ఈవిడ చాలా నయం కదా...

శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ ఎర్రంనాయుడు తనయుడు, రామ్మోహ‌న్‌నాయుడు ఎంపీగా చుర‌గ్గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగతి తెలిసిందే... స్వర్గీయ ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీకి, ఢిల్లీలో అన్నీ తానై చూసుకునేవారు... ఢిల్లీలో రాష్ట్రానికి ఏ పనులు కావలి అన్నా, చంద్రబాబు ఆయనకే బాధ్యతను అప్పచేప్పవారు... ఇక స్వర్గీయ ఎర్రంనాయుడు వాక్ చాతుర్యం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు... ఆయన ఆ శ్రీకాకుళ యాసలో మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వాడు అయిన కన్విన్స్ అవ్వాల్సిందే... అయితే, తండ్రి చనిపోయిన తరువాత, చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకున్నారు...

ram mohan 21102017 2

రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్ లో ఏంతో చక్కగా మాట్లాడుతూ, అన్ని డిబేట్స్ లో పాల్గుంటూ, అందరి మన్ననలు పొందుతున్నారు... తండ్రిలాగానే, ప్రతి విషయం మీద అవగాహనతో, తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టి పడేస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్రం, రామ్మోహన్ నాయుడి ప్రతిభ గుర్తించి, ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరగనున్న ఐక్యరాజ్యసమితి (ఐరాస) సమావేశాలకు టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుని, కేంద్రం సెలెక్ట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ram mohan 21102017 3

అయితే ఈ అరుదైన గౌరవం, గతంలో ఆయన తండ్రి ఎర్రంనాయుడుకి కూడా దక్కింది కూడా. ఎర్రంనాయుడు కూడా ఇది వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తన కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా, ఐరాస సమావేశాలకు వెళ్లడానికి ఎంపిక కావడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తన తండ్రి లాగానే, ఈ యువ ఎంపీ కూడా మంచి పేరు తెస్తాడు అని, మన రాష్ట్రం పేరు నిలబెడతారు అని చెప్తున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనానికి సంబంధించి, లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన 11 రకాల డిజైన్ లను సీఆర్‌డీఏ బుధవారం తమ వెబ్‌సైట్‌లోను, సోషల్ మీడియాలోనూ ఉంచింది. వాటిపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కోరింది. శాసనసభ భవన తుది ఆకృతుల్ని ఖరారు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు వాటిని పరిశీలన కోసం ఉంచినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో లండన్‌లో ఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. అంతకంటే ముందే, ఈ డిజైన్ లపై, ప్రజల నాడి ఎలా ఉందో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, సీఆర్‌డీఏ ప్రజల ముందు ఉంచుంది.

amaravati design 21102017 2

గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఏపీసీఆర్డీయే వెబ్‌సైట్‌లో ఉంచిన మొత్తం 11 ఆప్షన్ల పై తమ అభిప్రాయాలు తెలిపిన వారిలో అత్యధికులు, ఆప్షన్ 1 అయిన, వాచ్‌ టవర్‌ ని ఎన్నుకున్నారు. బుధవారం నుంచి, శుక్రవారం సాయంత్రం వరకు అన్నింట్లో కలిపి మొత్తం 3,999 మంది స్పందించారు. వీరిలో 1500 మంది ఆప్షన్‌ 1 సెలెక్ట్ చెయ్యగా, మిగిలిన 2,499 మంది ఇతర 10 ఆప్షన్లు సెలెక్ట్ చేశారు. మరికొన్ని రోజులపాటు ఈ డిజైన్ల పై ప్రజాభిప్రాయం తీసుకోనున్నారు. ఫైనల్ గా ముఖ్యమంత్రి ఆమోదం మేరకు, సెలెక్ట్ చెయ్యనున్నారు.

amaravati design 21102017 3

అయితే పది రోజులు క్రిందట, అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్ల పై దర్శకుడు రాజమౌళి, మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, మాజీ కమిషనర్‌ శ్రీకాంత్‌, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు నార్మన్‌ ఫోస్టర్‌తో జరిపిన భేటీలో... ఆ సంస్థ ఇప్పటికే రూపొందించిన డిజైన్లలోని లోటుపాట్లను రాజమౌళి సునిశితంగా విశ్లేషించారని సమాచారం. ప్రస్తుతం, దుబాయి పర్యటనలో ఉన్న చంద్రబాబు, అమరావతి డిజైన్ల పై లండన్‌లో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు.

Advertisements

Latest Articles

Most Read