ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కంటే, పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మన రాష్ట్రానికి అవసరం లేదు.... గ్లోబల్ గా ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటింది... అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు... మన రాష్ట్రానికి సంబంధించి, ప్రజెంటేషన్ ఇచ్చారు... భారత్ లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. మీరు పెట్టుబడులతో రండి, పరిశ్రమల స్థాపనకు నాది భరోసా అని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత బిజినెస్స్ ఫ్రెండ్లీగా ఉంటుందో, పెట్టుబడి పెట్టిన వారు ఎంత సంతోషంగా ఉన్నారోనన్న విషయం, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి ప్రత్యక్షంగా చూస్తే మీకే అర్ధం అవుతుంది’ అని ముఖ్యమంత్రి సదస్యులను ఉద్దేశంచి అన్నారు.

cbn ap 20102017 1 2

పాలనలో పారదర్శకత కోసం పరిపాలనకు సంబంధించి ఫైళ్లను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్లో పెట్టామని, సాంకేతితను మేళవించి సమర్ధమైన రియల్ టైం పరిపాలన అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రానున్న ఒకటిన్నర, రెండు దశాబ్దాల వరకు 15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం భారత దేశ సగటు వృద్ధి రేటు కంటే రెట్టింపుగా 11.72% శాతం వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు.
పరిశ్రమలు నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైనదని, పారిశ్రామిక శాంతి ఉంటుందని, అత్యున్నతమైన మానవ వనరులు తమ సొంతమని, స్నేహపూర్వక వాతావరణం కల్పించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వివరించారు. తమ రాష్ట్రానికి వచ్చి ప్రత్యక్షంగా ఈ విషయాలను పరిశీలించవచ్చని అన్నారు. ప్రపంచంలో తాను ఎక్కడ ఉన్నా సీఎం కోర్ డాష్ బోర్డ్ ద్వారా తమ రాష్ట్రంలోని అన్ని శాఖల, అన్ని రంగాల కార్యకలాపాలను పర్యవేక్షించగలనని, ఐటి, ఐఓటీని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శక, జవాబుదారీ పాలన అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

cbn ap 20102017 1 3

సమావేశంలో డో కెమికల్ ప్రతినిధులు రామనాథ్ సుబ్రహ్మణియన్, మేసీ మెర్రిమేన్ (Macy Merriman), డ్యూపాంట్ పయనీర్ వైస్ ప్రెసిడెంట్ జెర్రి ఫ్లింట్, ఫారిన్ ఎగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ విమల్ శరణ్, గ్లోబల్ ఫుడ్ బ్యాంకింగ్ నెట్ వర్క్ ప్రెసిడెంట్ లిసా మూన్, ప్రొబీర్ ఘోష్, గ్రెయిన్ ప్రొ కంపెనీ ప్రెసిడెంట్ ఫిలిప్ విల్లర్స్, ఐయోవా ఎకనమిక్ డెవలప్‌మెంట్ అథారిటీ బృంద నేత బ్రియాన్ సెలింజర్, సంస్థ ప్రాజెక్టు మేనేజన్ ర్యాన్ యంగ్, జాన్ డీరే ఫైనాన్సియల్స్ డైరెక్టర్ స్టేసీ జాన్సన్, మెక్ లార్టీ అండ్ అసోసియేట్స్ డైరెక్టర్ ఎరిక్ ట్రాషెన్ బర్గ్, నిఫా డైరెక్టర్ సోనీ రామస్వామి, పెప్సికో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ రిలేషన్స్ డ్యాన్ క్రిస్టెన్‌సన్, పయనీర్ సంస్థ ప్రతినిధి టామ్ అర్బన్, యుఎస్-ఇండియా ఫౌండేషన్ ప్రసిడెంట్ సీఓ కేవీ కుమార్, యుఎస్ ఐ ఎస్ పిఎఫ్ ప్రెసిడెంట్ డా.ముఖేష్ ఆఘి, డైరెక్టర్ జాసన్ స్టార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, అర్థికాభివృద్ది మండలి కార్యనిర్వాహకాధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు, దీపావళి పండుగ రోజు, తన మనవడిని గుర్తు చేసుకున్నారు.. అమెరికాలో, డె మోయిన్స్ తెలుగుదేశం ఫోరం సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు... ఇవాళ పండగ, మీరందరూ ఇంటిదగ్గర దీపావళి చేసుకోవలసిన వాళ్ళు, ఇవాళ నాతో గడపడానికి వచ్చారు. నేనూ ఇంటిదగ్గర, నా మనవడితో దీపావళి చేసుకోకుండా ప్రజలకోసం ఇక్కడికి వచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యారు...

cbn usa 20102017 3

68 ఏళ్ళ వయసులో, మనవిడితో పండగ జరుపుకోవాలని, ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి.... కాని అవన్నీ షడ్యుల్ మీటింగ్స్... మన కోసం, అవతలి వాళ్ళు టైం మార్చుకోరు కదా... కోటి రూపాయల పెట్టుబడి వచ్చినా, నవ్యాంధ్రకు ఎంతో ఊతం ఇస్తుంది... అందుకే పండగ అయినా సరే, ఇలాంటి ఎమోషన్స్ పక్కన పెట్టి, రాష్ట్రం కోసం వెళ్లారు ముఖ్యమంత్రి... కాని, మనుసులో ఆ బాధ ఉన్నట్టు ఉంది, అందుకే మన తెలుగు వారు కనపడగానే, తన మనుసులో ఉన్నది చెప్పేశారు...

cbn usa 20102017 2

ఆ ఎమోషన్ పక్కన పెట్టి, ఆయన ఫ్లోలో మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టారు... అక్కడ తెలుగువారిని ఉద్దేశిస్తూ, నేను గతంలో చేసిన చిరు ప్రయత్నం వల్ల మీరంతా ఇక్కడికి వచ్చారు. ఎంతో ఉన్నతస్థాయికి వచ్చారు. ఆనాడు 30 ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యను మూడువందలకు పెంచాను. దాంతో అందరూ ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్నారు. మీరిప్పుడు మంచి స్థాయిలో ఉన్నరు. మీరు పుట్టిన నేలను, మీ జన్మభూమిని మరువకండి. అలాగే, మీ అందర్నీ పైకి తెచ్చిన ఈ నేలను కూడా మరచిపోవద్దు. ఇక్కడి ప్రజల మన్నన పొందండి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలతో మీరు తృప్తి పడకండి. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. మీలో కొంతమంది ఇప్పటికే ఆ స్థాయికి ఎదిగారు. ఇది చాలదు, ఇంకా కావాలి. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. అదే సమయంలో మన రాష్ట్రం కోసం కూడా ఎదో ఒకటి చెయ్యండి అంటూ అక్కడ తెలుగువారిని ఉత్తేజ పరిచారు.

యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ బయోపిక్ తీస్తాను అని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీ పార్వతి వచ్చిన తరువాత నుంచి సినిమా తీస్తాను అని, "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమా టైటిల్ కూడా పెట్టేసాడు... ప్రతి రోజు ఆ సినిమా మీద తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలకు, తన ఫేస్బుక్ ద్వారా కౌంటర్ ఇస్తున్నారు... ప్రతి సినిమా లాగానే వివాదాలతో, వార్తల్లో ఉంచుతున్నారు. చివరకి ముఖ్యమంత్రి చంద్రబాబు కలగ చేసుకుని, ఆ సినిమా గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు అని చెప్పారు కూడా...

ntr biopic 19102017 2

ఈ చిత్రానికి సమంధించి ఇంకో వివాదం, వైసిపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండటం, అలాగే జగన్ బావ బ్రదర్ అనిల్ తో, వర్మ రహస్యంగా భేటి కావటం కూడా సంచలనం అయ్యాయి... జగన్ స్వయంగా, ఈ చిత్రానికి ఫండింగ్ ఇస్తున్నారు అనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా, అసలు ఈ సినిమా షూటింగ్ దాకా వెళ్తుందా ? సిల్వర్ స్క్రీన్ దాకా వస్తుందా, లేక ఈ సినిమాను వర్మ పక్కన పెట్టేస్తాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం, సినీ హీరో అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు...

ntr biopic 19102017 3

‘రాజు గారి గది 2’సినిమా సక్సెస్ లో భాగంగా, నాగార్జన మాట్లాడుతూ, కొన్ని రోజులు అమెరికా పర్యటనకు వెళ్తున్నా అని, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత, రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ యాక్షన్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లుగా నాగార్జున స్పష్టం చేసారు... నాగార్జున చెప్పిన దాని ప్రకారం, మరో నెల 20-30 రోజుల్లో వర్మ-నాగార్జున సినిమా షూటింగ్ కి వెళ్ళబోతుంది... మరి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పరిస్థితి ఏంటి అని ఫిలిం నగర్ వర్గాలు అనుకుంటున్నాయి... ఈ నెల రోజుల్లో సినిమా షూటింగ్ అవ్వదు.. నాగార్జున సినిమా అయిన తరువాత ఈ సినిమా తీస్తే, ఈ లోపు ఎలక్షన్స్ వచ్చేస్తాయి...మరి ఎప్పుడూ తీస్తాడు ? రాజశేఖర్ రెడ్డి మీద ఇది వరకు రెడ్డి గారు పోయారు అనే టైటిల్ తో ఇలాగే హడావిడి చేసి, చివరకి ఆ సినిమా మర్చిపోయారు... అలాగే, వర్మ ఈ సినిమాని కూడా పక్కన పెట్టేస్తాడేమో అని ఫిలిం నగర్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఒక పక్క రేవంత్ ఇష్యూ జరుగుతూ ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్న వేళ, తెలంగాణా బీజేపీ ఎమ్మల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి... అయితే కాంగ్రెస్, లేకపోతే తెరాస అనే ఊపులో తెలంగాణా రాజకీయం ఉంది... తెలుగుదేశంలో ఉన్న రేవంత్, కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అనే ప్రచారం ఉండటంతో, టిడిపి పార్టీ తెలంగాణాలో కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. అయితే, తెలంగాణా బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ మాత్రం, తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

bjp mla 19102017 2

బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు, తెలంగాణా బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్. దైవ దర్శనం కోసం విజయవాడ వచ్చిన రాజా సింగ్, మిత్రుడు అయిన లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ, తాత్కాలికంగానే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని, అసెంబ్లీని అద్భుతంగా నిర్మించారని ఇది చంద్రబాబు పని తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబునాయడు నాయకత్వంలో తెలంగాణ మించి అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు.

bjp mla 19102017 3

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి, తిరిగి తెలంగాణను కూడా ప్రగతిపథంలో పయనింప చేయడానికి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 2019 లేదా 2024లో తెలంగాణ రాప్రానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వమే శరణ్యమ,ని ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఎంతో ముందు చూపుతో ఆర్ధిక, పారిశ్రామిక, రాజధాని పరంగా పారిశ్రామిక రవాణా, ఐటీ వంటి అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి జరగనున్నదని తెలిపారు. చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త అని, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎంతో అనుభవం కలిగిన వారని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read