అప్పుడెప్పుడో 1995లో బెజవాడలో రౌడీయిజం అనే మాటకు పెట్టింది పేరు... 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, రౌడీయిజం చేసిన వాడి తాట తీసి ఎండేశారు... సురేంద్ర బాబు లాంటి పవర్ ఫుల్ ఆఫీసర్ లని పెట్టి, తోలు వలిచారు...
అయితే, ఇవాళ ఆకస్మిక తనిఖీలలో భాగంగా, వాంబే కాలనీకు వెళ్ళగా, అక్కడ మహిళలు, కొంత మంది కొత్తగా పుట్టుకువచ్చిన రౌడీల ఆగడాలపై ఫిర్యాదు చేశారు.
దీంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహంతో హెచ్చరించారు... వెంటనే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాలని పోలీసు కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ రౌడీయిజం అనే మాట వినబడకూడదని, రౌడీ ఇజం చేసే వారిని గుర్తించి బహిష్కరించాలని చెప్పారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఉంటే రాష్ట్రం వదిలి పెట్టి వెళ్ళండి.నన్ను తక్కువ అంచనా వేయద్దు.రౌడీ ఇజం చేయాలని చూస్తే నేను సహించను, అంటూ రౌడీలకు చంద్ర బాబు గట్టి వార్నంగ్ ఇచ్చారు. దీనితో పోలీసు వారు రౌడీలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. రౌడీల ఆగడాలు కట్టి పెట్టాలని సీఎం, పోలీసులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతం లో నేరాల సంఖ్య పెరగరాదని నేరస్తుల ఆగడాలు ఇకపై విజయవాడ లో సాగరాదని వారి ఉనికి పై కఠినం గా వ్యవహరించాలి అని బాబు పోలీసులకు స్వయం గా ఆకస్మిక తనికీల్లో భాగంగా తెలియజేసారు.