అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్‌ ‘ఎమిరేట్స్’ గ్రూపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమిరేట్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్–దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు ‘ఎమిరేట్స్’ గ్రూప్ ఎయిరోపొలిటికల్ ఎఫైర్స్ డివిజినల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ ఖాజిమ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపి పెట్టుబడులకు వున్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.

ఈనెల 22న తన యూఏఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్థూమ్‌ భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్ రాజవంశీకునికి సమీప బంధువైన మక్థూమ్ ఎమిరేట్స్ సంస్థకు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎమిరేట్స్ తుది నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రంలో విమానయానరంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు వున్నాయని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తుండటం ఈ రంగం ఎదుగుదలను సూచిస్తోందని ‘ఎమిరేట్స్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చెప్పారు. విమాన ప్రయాణికుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని అన్నారు. భారత ప్రభుత్వం ‘ఎయిర్ ఇండియా’లో పెట్టుబడులను ఉపసంహరించుకునే యత్నాల్లో వుండటం ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు సువర్ణావకాశమని చెప్పారు.

దుబాయ్ ప్రభుత్వంతో తమకు గత 20 ఏళ్లుగా మంచి సంబంధాలు వున్నాయని, హైదరాబాద్ అభివృద్ధిలో దుబాయ్ భాగస్వామి అయ్యేలా స్నేహసంబంధాలు కొనసాగించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణంలోనూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కార్యదర్శి ఎం. గిరిజా శంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి పాల్గొన్నారు.

కరువుకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్... వరుణ దేవుడు మా పార్టీ అన్నాడు ఒక పెద్దాయన... ఆయన మన మధ్య లేడు కాని, ఉంటే ఇప్పుడు ఏమనేవాడో... ఇంకో మహా తల్లి ఉంది.. ఈవిడంటే రాష్ట్రంలో భయపడని వాడే ఉండదు.... ఈవిడ అంటుంది, కరువుకు ఫాంట్ షర్టు వేస్తే అది చంద్రబాబు అంట... మహా తల్లి, ఆవిడ జిల్లలో కురుస్తున్న వర్షాలు చూడలేక, ఎక్కడకి పోయిందో పాపం...

వీరి మాటలు పక్కన పెడితే, ఆ వరుణ దేవుడు చంద్రబాబు పార్టీలో కాదు, ఏకంగా చంద్రబాబు ఇంట్లోనే చేరాడు... ఆయన ఇంటి మనిషి అయిపోయాడు... జల సిరికి హారతి నచ్చిందో ఏమో, ఆయన్ని విడిచి వెళ్ళటం లేదు... అంత ఆత్మీయుడు అయిపోయాడు... చంద్రబాబు సంకల్పం ఫలించి వరుణ దేవుడు ఆంధ్ర రాష్ట్ర నేలను నీటితో నింపేసాడు... రైతుల మొఖంలో చెరగని దరహాసం చిగురించింది....మాకు ఇంత కంటే ఏలాంటి హోదా, హామీలు అవసరం లేదు అంటూ రైతులు ధీరత్వ ధైర్యాన్ని చూపుతున్నారు..... ఒక పక్క చంద్రబాబు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతుంటే, ఆ వరుణ దేవుడు కూడా చంద్రబాబుకి తోడయ్యారు...

42 ఏళ్ళ తరువాత అనంతపురం లాంటి జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు, నదులు నిండి, పొంగి పొర్లుతున్నాయి... రిజర్వాయార్ లు నిండిపోయాయి... దేశంలోనే అత్యల్ప తక్కువ వర్ష పాతం నమోదు అయ్యే సీమలో, ఏకంగా వరదలు వచ్చాయి...

మొత్తం మీద, ఈ ఏడు రాష్ట్రంలో వర్షాలు ఇరగ కుమ్మాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 577 మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. 13 జిల్లాల్లో 670 మండలాలకు గాను, 212 మండలాల్లో అధిక వర్షాలు కురవగా, 365 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడ్డాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు 612.8 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 633 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది.

రాష్ట్రంలో 12.34 మీటర్లు లోతున్న భూగర్బజలాలు, తాజాగా 2.24 మీటర్లు పెరిగి 10.1 మీటర్లకు చేరుకున్నాయి.

ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరి పార్టీలో చేరారో ?

మూడేళ్ల నుంచి వరదన్నదేలేక, గేట్ల కంటే కిందికి పడిపోయి... అట్టడుగు స్థాయికి చేరుకున్న నీటి మట్టంతో వెలవెలపోయిన శ్రీశైలం జలాశయం! ఇప్పుడు, ఇన్నాళ్లకు... మళ్లీ నీళ్లతో తుళ్లి పడనుంది. ఎగువనున్న ప్రాజెక్టుల ‘అడ్డుగోడల’ను దాటి బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది...

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గురువారం ఉదయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రెండు గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఒక్కొ గేటును 10 అడుగుల మేర ఎత్తారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 884.80 అడుగులతో 214.8450 టీఎంసీలుగా ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,878 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

కేవలం రాజకీయం కోసం, చంద్రబాబుని సాధించటం కోసం, కూలి పని చేసుకునే వాళ్ళ నోట్లో వైసీపీ ఎంపీలు మట్టి కొట్టిన సంగతి తెలిసిందే... ఉపాధి కూలీలకి డబ్బులు ఇవ్వద్దు అంటూ, ఏకంగా కేంద్రానికే లేఖలు రాపించాడు జగన్...

గురువారం వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు మండలం ఈతముక్కల గ్రామంలో జరుగుతున్న హస్తకళల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో, అక్కడే ఉన్న ఉపాధి హామీ పథకం కూలీలు వైవీ సుబ్బారెడ్డిని అడ్డుకున్నారు. తప్పుడు ఫిర్యాదులతో కూలీ రాకుండా చేశారని ఆందోళన చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నేలకున్నాయి..

పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై జగన్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు అవినాశ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ఆ నిధులు రాకుండా నిలిపివేయించారు. జులై 20న వైవీ సుబ్బారెడ్డి, మే 11న అవినాష్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు... దీంతో రూ. 11 వంద‌ల కోట్ల ఉపాధి హామీ బిల్లులు ఆగిపోయిన సంగతి తెలిసిందే...

మొన్నా మధ్య రోజాను కూడా నంద్యాల ప్రజలు ఇలాగే తరిమి కొట్టారు... శిల్పా సోదరులుని, రెండు రోజులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆందోళన చేశారు.. ఎక్కడైనా ప్రభుత్వంలో ఉన్నవారి మీద వ్యతిరేకత ఉంటుంది కాని, మనం చేసుకున్న పనుల వల్ల, ప్రతిపక్షంలో ఉన్న మనకు ప్రజల వ్యతిరేకత తగులుతుంది అని జగన్ పార్టీ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read