పూర్వ కాలంలో వరుణ యాగాలు చేస్తే వర్షాలు పడేవి అని మన పెద్దలు చెప్తే విన్నాం.... మనం కొన్ని పుస్తకాల్లో చదువుకున్నాం... ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం.... చెరువులు,కుంటలు,వాగులు,వంకలు అన్నీ పొంగి పోర్లుతున్నాయి.... బూజు పట్టిన ప్రాజెక్ట ల గోడలు నీటి తాకిడితో పులకరిస్తున్నాయ్.... ఎండిన చెరువులు నిండుగా, రైతు గుండెని తాకుతున్నాయ్..... ఒట్టి పోయిన నేల బావులు, నిండుగా నిండి కనిపిస్తున్నాయి... కరువుసీమలో రైతుల కళ్ళల్లో ఆనందం....

దృఢ సంకల్పానికి, దేవుడి బలం తోడైతే విజయం వీరవిహారం చేస్తూ మన దరి చేరుతుందని, నిరూపించిన అలుపెరుగని పోరాట యోధుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు ..... జలసిరికి హారతి అన్నాడు నేడు రాష్ట్రంలో ఎటు చూసిన జలమే... ఎగతాళి చేసినవారి నోర్లు మూత పడేలా... కరువు కాటకాటకాలతో విరాజిల్లిన సీమ నేడు నిండుకుండలా, ఎటుచూసిన నీరే.. రైతు కళ్ళలో ఆనందమే ఆనందం....

చంద్రబాబు ప్రభుత్వం నీరుకి ఎంత ప్రాదాన్యత ఇస్తుందో తెలిసిందే.. ఒక పక్క రాష్ట్రాన్ని కురువురహితం చేస్తూ, ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్న చంద్రబాబు, జలసిరికి హారితి అంటూ, నీటిని పూజించమంటున్నారు. ముఖ్యమంత్రి మంచి మనసుతో చేసిన జలసిరికి హారతి కార్యక్రమం వల్ల ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉండి వరుణ దేవుడు కరుణించి రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. రాష్ట్రం మొత్తం మీద చూసినప్పుడు 12.34 మీ లోతులో ఉన్న భూగర్భ జలాలు 2.24 మీ పెరిగి 10.1మీ లోతుకు చేరుకున్నాయి. గత సంవత్సరాలుగా నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల రాష్ట్రంలో నీటి కొరతను అధిగమించడానికి అవకాశంతో పాటు పడిన ప్రతి వర్షపు బొట్టును కపాడుకోగలుగుతున్నాము.

పంచె కట్టుకొని నడుస్తూ వస్తే, వెనుక కనిపించిన గ్రాఫిక్ పచ్చదనం కాదు... పుడమి తల్లి పరవశాన్ని.. పచ్చని కోక కట్టుకున్న తన అందాన్ని మనం చూస్తున్నాం.... వరుణుడు కరుణించాడు.... కాదు.... చంద్రన్న వరుణుడిని మెప్పించాడు... నీ సంకల్పం గొప్పది చంద్రన్న...

ఎప్పుడో మర్చిపోయిన ప్రత్యేక హోదా మరోసారి జగన్ మోహన్ రెడ్డికి గుర్తుకువచ్చింది.. ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఒక్క పెద్ద సమస్య కూడా లేదు... అందుకే మళ్ళీ ప్రత్యేక హోదా అని, అనంతపురంలో యువభేరీ సభ నిర్వహించారు....

ఈ సభలో జగన్ చేసిన పలు మాటలు, మరీ కామెడీగా ఉన్నాయి... అవి ఎలా ఉన్నాయి అంటే, నేను ఇప్పుడు మాట్లాడక పొతే, ఆశలు పెట్టుకున్న ముఖ్యమంత్రి కుర్చీ సంగతి తరువాత, ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అనే విధంగా మాట్లాడారు... నేను ఇప్పుడు ప్రత్యేక హోదా అనకపోతే, పవన్ కళ్యాణ్ నా హోదా కొట్టేస్తాడు అనే విధంగా జగన్ ప్రసంగం ఉంది...

జగన్ మాట్లాడుతూ, నేను ఎప్పుడో ప్రత్యేక హోదా అన్నా, మళ్ళీ ఇప్పుడు అంటున్నా, ఈ ఏడెనిమిది నెలల కాలంలో, ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా అని నిలదీశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్, జగన్ మాత్రమే.. ఈ కామెంట్, పవన్ కళ్యాణ్ గురించే జగన్ చేశారు అని అర్ధమవుతుంది...

తన చివరి యువభేరీ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా మాట్లాడలేదని జగన్ వాపోయారు. ఆ పరిస్థితి మారాలన్నారు..

ఇక్కడ జగన్ క్లియర్ గా, పవన్ కళ్యాణ్ విషయంలో ఇన్ సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు... పవన్ తనకు ఈ ప్రతి పక్ష హోదా కూడా ఇవ్వడు అని భయపడుతున్నాడు... అందుకే, పవన్ కళ్యాణ్ ను ప్రజల ముందు దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.... ఒక వేల పవన్ స్ట్రాంగ్ అయితే, తన హోదా కూడా లాక్కుంటాడు అని, అందుకే ఈ ప్రత్యేక హోదా ఉద్యమం అని జగన్ చెప్పకనే చెప్పారు...

"ప్రత్యేక హోదా", కొన్నాళ్ళ క్రిత్రం రాజకీయాలు అన్నీ దీని చుట్టుతా నడిచాయి.... ఒక పక్క పవన్, ఒక పక్క జగన్ హడావిడి చేశారు... ఏమైందో ఏమో కాని, సడన్ గా ఆ "ప్రత్యేక హోదా" విషయం మరుగున పడిపోయింది. ప్రజలు కూడా మర్చిపోయారు... ఇది ప్రజా ఉద్యమం కాదు, ఇది కేవలం రాజకీయ ఉద్యమమే అని అర్ధమైపోతుంది...

ఇక ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ అయితే, యువభేరీ అంటూ జిల్లాల్లో సభలు కూడా పెట్టారు... జూన్ తరువాత MPలు అందరూ రాజీనామా చేసేస్తారు అన్నారు... ఏమైందో ఏమో తెలీదు కాని, ప్రధాని మోడీని కలిసిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు. తరువాత బీజేపితో చర్చులు, స్వామీజీలతో చర్చలు, ఇలా అన్నీ సాగాయి...

బీజేపితో, పొత్తు, విలీనం అనే వార్తలు వచ్చాయి.. తన కేసులు మాఫీ కోసం, బీజేపితో చర్చలు జరిపారు... పాదయాత్రకు లైన్ క్లియర్ చెయ్యమని అడిగారు అనే వార్తలు వచ్చాయి... చివరకు కోర్ట్ లో, శుక్రువారం మినహియింపు కావలి అని కూడా పిటిషన్ వేశారు... మరో పక్క, ఏ వ్యుహ్యం తీసుకున్నా పారటం లేదు... అన్నీ ఫ్లోప్ అవుతున్నాయి... మరో పక్క బీజేపి పొత్తు అని కాని, విలీనం అని కాని క్లారిటీ ఇవ్వటం లేదు... ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి...

దీంతో జగన్, మరో సారి "ప్రత్యేక హోదా" ఎత్తుకున్నారు.. రేపు అనంతపురంలో సభ పెడుతున్నారు... అయితే ఎప్పటిలాగే, హోదా ఇచ్చే అవకాశం ఉన్న, మోడీని ఏమి అనకుండా, చంద్రబాబుని తిట్టటమే ఎజెండా... ఒకవేళ బీజేపితో క్లారిటీ లేకపోతే, "ప్రత్యేక హోదా" ఎజెండాతో ఉన్న పవన్ తో అయినా పొత్తు కోసం అడగవచ్చు అనేది ప్రశాంత్ కిషోర్, జగన్ వ్యుహ్యంగా ఉంది... అందుకే, ఇటు బీజేపి క్లారిటీ ఇవ్వకపోవటంతో, ఈ సభలు ఒక నాలుగు పెట్టి, పవన్ తో పొత్తు ప్రయత్నాలు చేద్దామని జగన్ ఆలోచన...

నంద్యాల, కాకినాడ తీర్పుతో, చంద్రబాబు కొట్టాడు, కొట్టించుకున్నాను అన్నాడు.. కొట్టించుకున్నాడు కదా, బుద్ధి వస్తుంది అనుకున్నారు ప్రజలు... 40 రోజులు దాక్కుని, ఆ స్వామీజీ కాళ్ళు, ఇంకో పెద్దాయన కాళ్ళు పట్టుకుంటే, పాపం బిడ్డకు మంచి బుద్ధులు వచ్చాయి అనుకున్నారు... 40 రోజులు ఏమన్నా మానసిక పరిపక్తత కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాడేమో, ఇక నుంచి కొత్త అన్నాను చూస్తాం అని సంబర పడ్డారు వారి అనుచరులు... కాని పెద్దలు అన్నట్టు, పుట్టుకుతో వచ్చింది, చచ్చే దాకా పోదు అన్న మాటలు నిజం అని మరో సారి తేలింది...

ప్రత్యేక హోదా తెస్తాను అని ఈ పోటుగాడు అనంతపురంలో ఒక ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టాడు... పోటుగాడు కదా, ప్రత్యేక హోదా ఇవాల్సిన మోడీని నిలదీస్తారు అని ఎదురు చూసారు అందరూ... కాని యధావిధంగా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబ....

సరే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రత్యర్థి కాబట్టి చంద్రబాబుని విమర్శించాలి... కాని దానికి హద్దు ఉండాలా వద్దా ? చంద్రబాబు సుందర ముఖం చూసి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ రావట్లేదు అంటాడు ఈ పోటుగాడు... ఈ పిచ్చి మాటలు మాట్లాడినందుకే, నంద్యాల ప్రజలు చావు దెబ్బ కొట్టారు... అయినా సిగ్గు లేదు...

ఆయన మొఖం చూసే ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చింది.... ఈ రోజు కియా మోటార్స్ వచ్చింది... 5 రాష్ట్రాల పోటీ పడితే, ఈయన మొఖం చూసే అనంతపురం వచ్చింది కియా... ఒకసారి శ్రీ సిటీ వెళ్లి చూడు, ఆయన మొఖం చూసి ఎన్ని దిగ్గజ కంపెనీలు వచ్చాయో... ఇక్కడ నుంచి ప్రపంచానికి మొబైల్ ఫోనులు, కార్లు, టీవీలు తయారు చేసి కంపెనీలు ఉన్నాయి... అవన్నీ ప్రత్యేక హోదాతో రాలేదు... చంద్రబాబు మొఖం చూసే వచ్చాయి...

మీ మొఖాలు, మీ అయ్య మొఖాలు చూసి, జైళ్ళుకి వెళ్ళిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు... అయినా మొహం చూసి పెట్టటానికి, అవి ఏమన్నా ముద్దులు అనుకున్నావా? కంపెనీ లు.. ..తల నిమిరి, నుదిటి మీద ముద్దు పెట్టి, చెంపలు నిమిరితే కంపెనీలు రావు...

ఈయన మారతాడు అనుకోవటం మన భ్రమ... మారడు కాక మారడు... ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలి...

Advertisements

Latest Articles

Most Read