ముఖ్యమంత్రి కుర్చీనే ధ్యేయంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చెపట్టదలచిన పాదయాత్ర భవిష్యత్తు వచ్చే శుక్రువారం తేలనుంది...

ప్రతి శుక్రువారం జగన్ కోర్ట్ కి వచ్చి హాజరవ్వాల్సి ఉండగా, పాదయత్ర పై క్లారిటీ లేదు.. అయినా సరే, జగన్ పాదయాత్ర ప్రకటన చేసేశారు... ఇప్పుడు పాదయాత్ర టైం దగ్గర పడుతున్న నేపధ్యంలో, 6 నెలల పాటు శుక్రువారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్నందున... 6 నెలల పాటు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొనారు. తదుపరి విచారణ సీబీఐ కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.

ముందుగా పాదయత్ర అక్టోబర్ 27 నుంచి చేస్తాను అని, జగన్ ఘనంగా ప్రకటించారు... అయితే అక్టోబర్ 27 కలిసి రాదని, కోర్ట్ కూడా బెయిల్ అవ్వదు అని, ముఖ్యమంత్రి అవ్వలేవు అని సాములోరు చెప్పటంతో, జగన్ నవంబర్‌ 2కు మార్చుకున్నారు...

మరి కోర్ట్ పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి...

సాంకేతిక బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో, సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యలో నేరాలను అరికట్టడానికి విశాఖలో సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ.కోటి కేటాయిస్తూ శాశ్వత భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

నూతన భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్ కు ప్రభుత్వం సూచించింది. దీంతో ఆయన వుడా కాంప్లెక్స్ లోని రెండో అంతస్తులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని వుడా విసికి లేఖ రాశారు. స్థలం కేటాయిస్తే మరో నెల రోజుల్లో సైబర్ ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం చేస్తామన్నారు.

దీంతో రాష్ట్రంలోనే తొలి సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ విశాఖలో ఏర్పాటు కానుంది. సైబర్ కేసుల్లో నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, సాఫ్ట్ వేర్ కలిగిన ల్యాబ్ నగర పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ల్యాబ్ లేకపోవడంతో హైదరాబాద్లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి వస్తోంది. ఫలితంగా తీవ్రమైన కాలయాపన చోటుచేసుకోవడం, కేసు విచారణ సమయంలో అవసరమైన ఆధారాలను సమర్పించ లేకపోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారు.

వుడా కాంప్లెక్స్ లో అనుమతి వచ్చిన వెంటనే, సీ-డాక్ సంస్థకు చెందిన నిపుణులు అక్కడకు చేరుకుని ల్యాబ్ పరికరాలను అమర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత సైబర్ ల్యాబ్ నిర్వహణ పై పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. ల్యాబ్ అందుబాటులోకి వస్తే బాధితులకు ఎక్కడి నుంచి మెయిల్స్ వచ్చాయి. వారెక్కడ నుంచి ఆపరేట్ చేశారు. ఐపీ నంబరు ఆధారంగా వాళ్లు ఏ కంప్యూటర్, ఏ ల్యాప్టాప్ వాడారు? అనే విషయాలు సులభంగా తెలిసిపోవడంతో కేసు చేధించడం మరింత సులువయ్యే అవకాశముంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీనుండి 26వ తేదీ వరకూ విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 17వ తేదీన బయల్దేరి అమెరికా పర్యటనకు వెత్తారు. అక్కడి 18-20 తేదీల మధ్య అయోవా అంతర్జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ ఆహార ధరల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం అయోవా విశ్వవిద్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొల్పనున్న అయోవా అంతర్జాతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రానికి 9న శంకుస్థాపన చేయనున్న సిఎం చంద్రబాబు, అనంతరం అక్కడి వ్యవసాయ విధానం, అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో సాధిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల పై అధ్యయనం చేయనున్నారు.

అనంతరం సిఎం అరబ్ దేశాలలోనూ పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాజధాని అమరావతిలో నిర్మించబోయే పరిపాలన, అసెంబ్లీ హైకోర్టు భవనాల ఆకృతులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే వీలుంది. అలాగే సీఆర్డిఏ ఉన్నతాధికారుతులతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయనణతో కలిసి లండన్లో 24-25 తేదీల్లో పర్యటించి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వీరితోపాటు ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట విదేశీ పర్యటకు వెళ్లే వారిలో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస సిఈఓ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి లేదా వ్యక్తి గత సహాయకుడు ఉండే అవకాశాలున్నాయి. సిఎం తిరిగి రాష్ట్రానికి ఈ నెల 27వ తేదీ వచ్చే అవకాశాలున్నాయి.

జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించింది... చంద్రాబాబు వినూత్న పద్ధతులతో పరిపాలన చేస్తూ, దేశంలోనే మొదటి రాష్ట్రంగా పేరు తెచ్చుకుంటుంటే, జగన్ కూడా ఆ దిశగా ఆలోచించారు...

దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, నాయకులతో, కార్యకర్తలతో ప్రజల్లోకి వెళ్తుంది... వాళ్ళ ఎజెండా చెప్తుంది... కాని, మొదటి సారిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త పంధా ఎంచుకుంది.. పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పనిని, కన్సల్టెంట్ కు అప్ప చెప్పింది... ఈ బాధ్యత కూడా జగన్, ప్రశాంత్ కిషోర్ మీదే పెట్టాడు...

అంటే ఇప్పటి వరకు, ఫేక్ ఎకౌంట్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ప్రశాంత్ కిషోర్ టీం, ఇప్పుడు జగన్ తరుపున ప్రజల్లోకి వెళ్లనుంది.. ఇది రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్... వీరంతా మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ లుగా పని చెయ్యనున్నారు... ఇప్పుడు కొత్తగా వెయ్యి మందిని ప్రశాంత్ కిషోర్ తన టీంలోకి నియామకాలు చేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నుంచి వీరి నియామకాలు జరుగుతున్నాయి. నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం తమ సొంత మీడియా సంస్థ కార్యాలయాన్ని వాడుకుంటున్నారు.

గడప గడపకు వైసీపీ... వైఎస్ఆర్ కుటుంబం... నవరత్నాల సభలు... ఇలా అన్ని ప్రోగ్రామ్లు నిర్వహించటంలో నాయకులు కాని, కార్యకర్తలు కాని ఫెయిల్ అవ్వటంతో, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు...

అంటే ఇక పార్టీ నాయకులతో, కార్యకర్తలతో పని లేదు... ఈ జీతానికి పెట్టుకున్న వారే, పార్టీ కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్తారు.. అలాగే, పోల్ మేనేజ్మెంట్ బాధ్యతను కూడా వీరే నిర్వహిస్తారు...

రేపటి నుంచి జై జగన్ తో పాటు... జై ప్రశాంత్ కిషోర్ అనే స్లోగన్ కూడా వాడతారేమో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read