ముఖ్యమంత్రి కుర్చీనే ధ్యేయంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చెపట్టదలచిన పాదయాత్ర భవిష్యత్తు వచ్చే శుక్రువారం తేలనుంది...
ప్రతి శుక్రువారం జగన్ కోర్ట్ కి వచ్చి హాజరవ్వాల్సి ఉండగా, పాదయత్ర పై క్లారిటీ లేదు.. అయినా సరే, జగన్ పాదయాత్ర ప్రకటన చేసేశారు... ఇప్పుడు పాదయాత్ర టైం దగ్గర పడుతున్న నేపధ్యంలో, 6 నెలల పాటు శుక్రువారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్నందున... 6 నెలల పాటు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొనారు. తదుపరి విచారణ సీబీఐ కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.
ముందుగా పాదయత్ర అక్టోబర్ 27 నుంచి చేస్తాను అని, జగన్ ఘనంగా ప్రకటించారు... అయితే అక్టోబర్ 27 కలిసి రాదని, కోర్ట్ కూడా బెయిల్ అవ్వదు అని, ముఖ్యమంత్రి అవ్వలేవు అని సాములోరు చెప్పటంతో, జగన్ నవంబర్ 2కు మార్చుకున్నారు...
మరి కోర్ట్ పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి...