అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మరో దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ, సర్వీసులు నడపటానికి సిద్ధమైంది. దేశంలోనే అతి పెద్ద చౌక ధరలు విమాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడంతో నవ్యాంధ్ర ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసులు నడపటమే కాదు, ఇక్కడ నుంచే దశల వారీగా మెగా ఆపరేషన్స్‌కు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది.

ఈ భారీ విస్తరణలో భాగంగా, ఇండిగో రికార్డు స్థాయిలో 50 ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు ఆ సంస్థ ఇటీవల ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో ఎక్కవ విమానాలు గన్నవరం నుంచే నడవనున్నాయి.. తొలి దశలో, జనవరి నెల నుంచి ఆరు విమాన సర్వీసులను నడపటానికి ఇండిగో సంస్థ నిర్ణయించింది. గన్నవరం నుంచి, వివిధ నగరాలకి 12 ట్రిప్పులు వెయ్యనుంది... పూర్తి షడ్యుల్ తెలియాల్సి ఉంది..

ఇండిగో, కొన్ని నెలల క్రిందటే ఇక్కడ అవకాశాల పై అధ్యయనం చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఇవ్వటంతో, ఇక్కడ నుంచి సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించుకుని, భారీ సంఖ్యలో ఇండిగో సంస్థ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట జరిపింది. మూతపడిన ‘ఎయిర్‌కోస్టా’ సిబ్బందిని కూడా ఇండిగో సంస్థ రిక్రూట్‌ చేసుకుని హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చింది.

ఇండిగో ఎయిర్ లైన్స్ కు, చౌక ధరలు విమాన సంస్థగా పేరు ఉంది... దీంతో, గన్నవరం నుంచి వివిధ నగరాలకు చార్జీలు మరింత తగ్గనున్నాయి..

సైబర్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకొచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం (ఇన్నోవేటీవ్ డెవలప్‌మెంట్ సెంటర్) ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేసింది.

ఢిల్లీలో, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మాస్టర్ కార్డ్ సంస్థ ఒప్పంద పత్రాలు మార్చుకున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "విశాఖలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్ టెక్) తో అద్భుతాలు చేయవచ్చు. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరిని ఫిన్టెక్ వాలీకి ఆహ్వానించాలని మేము కోరుతున్నాం. డిజిటల్ ఎకానమీ అవినీతి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది. భవిష్యత్ మొత్తం నాలెడ్జ్ ఆర్థికవ్యవస్థకు మాత్రమే ఉంటుంది." అన్నారు...

మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ భంగ మాట్లాడుతూ, "టెక్నాలజీని అమలు చేయాలన్న ముఖ్యమంత్రి ముందుచూపు రాష్ట్రాన్ని నూతన స్థాయికి తీసుకోవడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో మాస్టర్ కార్డ్ వ్యాపార సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది. రాష్ట్రంలో సైబర్ భద్రత మరియు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పనిచేయడానికి మాస్టర్ కార్డ్ ముందుకు వచ్చింది." అన్నారు...

చంద్రబాబు ప్రయత్నాలు ఒక్కోటి ఫలిస్తున్నాయి... వడివడిగా అడుగులు వేస్తూ, ముందుకు సాగుతున్న రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్... నవ్యాంధ్రలో దేశంలోనే తొలి గూగుల్‌ కోడ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకానుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజినీరింగ్‌ కళాశాలలో గూగుల్‌ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది.

గూగుల్‌తో కలిసి నిర్వహిస్తున్న, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు సక్సెస్ కావటంతో, దేశంలోనే తొలి కోడ్‌ల్యాబ్‌ ను, గూగుల్ మన రాష్ట్రంలో ఏర్పాటుకు గూగుల్‌ ముందుకు వచ్చింది..

గూగుల్ కోడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు అయితే, ఇంజినీరింగ్‌లో అండ్రాయిడ్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేవారికి యాప్‌ల తయారీపై ఏకథాన్‌, కోడ్‌ కాన్‌టెస్ట్‌లను నిర్వహిస్తారు.

ఇప్పటి వరకు గూగుల్ శిక్షణ ఇచ్చిన వివరాలు...
ఆంధ్రప్రదేశ్ లోని 82 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 17,425 మంది విద్యార్థులు గూగుల్‌ అండ్రాయిడ్‌ శిక్షణ పూర్తి చేసింది. ప్రస్తుతం మరో 2,498 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ పూర్తి చేస్తే, గూగుల్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉంటే, ఉపాధి అవకాశాలు తేలికగా దొరకుతాయి... ఈ శిక్షణకు 6500 రూపాయిలు ఖర్చు అవుతుండగా, 50 శాతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సబ్సిడీ ఇస్తుంది. అలాగే స్కూల్ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఐదు నుంచి పదో తరగతి వరకు, 1,24,768 మంది పిల్లకు గూగుల్ శిక్షణ ఇచ్చింది.

మన దేశంలో రెండు మిలియన్ మొబైల్ డెవలపర్స్ తయారు చేయాలనే టార్గెట్ గూగుల్ పెట్టుకుంది. అందులో, ఆంధ్రప్రదేశ్ నుంచి 25 శాతం ముంది ఉండాలనే టార్గెట్ తో, దేశంలోనే మొదటి గూగుల్ కోడ్ ల్యాబ్, మన రాష్ట్రంలో నెలకొల్పుతుంది...

రాజకీయం ఎప్పుడు చెయ్యాలి ? ఎవరితో చెయ్యాలి ? పొట్ట కూటి కోసం, కూలి పని చేసుకుంటూ, వాళ్ళ కడుపు కొట్టి ఎవరైనా రాజకీయం చేస్తారా ? మన ఇళ్ళల్లో ఎవరన్న కూలి పనికి వస్తే, వాళ్ళ కష్టం చూసి, శారీరక శ్రమ చూసి జాలి పడి, ఒక పది రూపాయలు ఎక్కువ ఇస్తాం... కాని, మన ప్రతి పక్ష నాయకుడు, కేవలం రాజకీయం కోసం, చంద్రబాబుని సాధించటం కోసం, ఆ కూలి పని చేసుకునే వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నాడు... వాళ్లకి డబ్బులు ఇవ్వద్దు అంటూ, ఏకంగా కేంద్రానికే లేఖలు రాపించాడు..

ఒక పక్క , కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వీలైనన్ని పథకాల ద్వారా నిధులు తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, జగన్ తన ఎంపీల చేత కుట్రపూరితంగా ఫిర్యాదులు చేసి ఆ నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు...

పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై జగన్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు అవినాశ్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ఆ నిధులు రాకుండా నిలిపివేయించారు. జులై 20న వైవీ సుబ్బారెడ్డి, మే 11న అవినాష్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

రూ. 11 వంద‌ల కోట్ల ఉపాధి హామీ బిల్లులు అడ్డుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు... పేదలకు కూలీ డబ్బులు అందడం కూడా వీరికి ఇష్టం లేదు... ఆ లేఖలు మీరూ చూడండి....

 

Advertisements

Latest Articles

Most Read