అక్టోబర్ 1 వ తేదీన జగన్ తను ఎంతగానో ఇష్టపడి నిర్మించుకున్న ప్యాలస్ లో అత్యంత ముఖ్య నాయకులు, ముఖ్య స్నేహితులతో భేటీ అయ్యారు. అసలు హైదరాబాద్ లో కాకుండా యలహంక ప్యాలస్ లో మీటింగ్ ఎందుకు అనే అందరి మదిలోనూ మెదిలింది. అంతలోనే జగన్ సమావేశ మందిరానికి విచ్చేసారు. తన మనస్సులో ఉన్న మాట మెల్లగా బయట పెట్టారు. క్రైస్తవ మతస్తుడిని అనే మచ్చ చేరుపుకోవాలనుకుంటున్నాను అంటూ జగన్ మొదలు పెట్టాడు... ఇన్నాళ్ళు బావ అనిల్ చెప్పిన విధంగా నడుచుకున్నా అయినా ఉపయోగం లేకుండా పోయింది. రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి.ఎన్నికల్లో ఒడిపోతున్నాం,కేసులు చుట్టుముడుతున్నాయి. హిందువులు నన్ను నమ్మేలా లేరు... ఇక నుంచి నా మెజారిటీ కార్యక్రమాలు గుడులు, స్వాములు చుట్టూ తిరుగుతాయి... నా పర్యటనలు మీ జిల్లాల్లో జరిగితే, ఇక నుంచి ఆ విధంగా ప్లాన్ చెయ్యండి అని జగన్ చెప్పారు....
సమావేశంలో ఉన్న అత్యంత ముఖ్యలు ఇది మంచి నిర్ణయం కాదు, ఇలా చెయ్యటం వలన ఓట్లు పడే అవకాశాలు ఉండవు, ఇది మరో సెల్ఫ్ గోల్ అవుతుంది, మన బలం క్రీస్టియన్ వోటింగ్, అని చెప్పారు ఆట. అప్పుడు జగన్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకి ముందు నేను ఓడిపోవటానికి ఇదే మెయిన్ కారణం అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు... అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఫైనల్ అనేసారు ఆట.
ఎలా అయినా నేను ముఖ్యమంత్రి అవ్వాలి, దాని కోసం మనం ఈ మచ్చ చేరుపుకోవాలి... క్రీస్టియన్ వోటింగ్ కంటే నాకు హిందూ వోటింగ్ ముఖ్యం... రేపు నాకు ఒక ముఖ్యమైన వ్యక్తితో మీటింగ్ ఉంది అని జగన్ చెప్పారు.
అదేంటి రేపు గాంధి జయంతి కదా హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కు వెళ్లి గాంధీ కి నివాళులు అర్పించాలి కదా, అని ముఖ్యనాయకులు అనగానే కోపంగా జగన్, నన్ను ముఖ్యమంత్రిని చేసే సలహాలు ఇవ్వండి అని చెప్పి, రేపు నేను జీయర్ ను కలుస్తున్నాను అని మనసులో మాట బయట పెట్టారు అట. అదేంటి దాని వలన క్రైస్తవ మతస్తులు మనకు దూరం అవుతారు అనగానే, జగన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు...
అదేంటి గాంధీకి నివాళులు వద్దు అంటున్నాడు. ఉదయానికి మనస్సు మారుతుందిలే అని నాయకులు అనుకున్నా, జగన్ జీయర్ స్వామి కాళ్ళు పట్టుకోవటం, అది అన్ని చానెల్స్,పేపర్స్ లో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ చుసిన పార్టీ సీనియర్లు, మరో సెల్ఫ్ గోల్ కి రెడీ అవ్వటం మినహా మనం చేసేది ఏమి లేదు... ఈయన ఇదే ఫ్లో లో ఉంటే, మతం కూడా మార్చేసుకుని, కాషాయం ధరిస్తాదేమో అని గుసగుస లాడుకున్నారు...