ఆంధ్రప్రదేశ్‌ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌- జ్ఞాన వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గున్నారు.

అయితే వివాహ వేడుకలో పాల్గుని వెళ్తూ వెళ్తూ, తెదేపా నేత పయ్యావుల కేశవ్‌తో ఏకాంత సంభాషణ సాగించారు. హెలిప్యాడ్ వద్ద హెలిక్యాప్టర్ ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్లి వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ సమయంలో ఎర్రబల్లి, తెలంగాణా చీఫ్ సెక్రటరీ దగ్గరకు వస్తున్నా, రావద్దు అని సైగ చేసి, కేశవ్‌తో ఏకాంత సంభాషణ కొనసాగించారు.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, జగన్ బీజేపితో కలవటం, కాకినాడ, నంద్యాల ఫలితాలు పై పయ్యావులతో కేసీఆర్‌ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నంద్యాలలో టిడిపి మంచి మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో అంతటి మెజార్టీ ఎలా సాధ్యమైంది, జగన్ చేసిన పొరపాట్లు, తెలుగుదేశం వ్యూహాలు గురించి మాట్లడుకున్నారని చెబుతున్నారు.

అంతే కాదు అనంతపురంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పై కూడా కేసిఆర్ అరా తీసారు... కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు, చంద్రబాబు కేబినేట్ లో మంత్రిగా పని చేసిన సమయంలో, అనంతపురం జిల్లాకి ఇంచార్జ్ మంత్రిగా ఉండేవారు.... ఆ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, అప్పుడు నీళ్ళు ఉండేవి కాదని, ఇప్పుడు ఎక్కడ చూసిన నీళ్ళు కన్పిస్తున్నాయని, 30 ఏళ్ళ తరువాత ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద చేరువైన బుక్కపట్నం చెరువు నీతితో కళకళ లాడటం చూసి, సంతోషంగా ఉంది అన్నారు... జిల్లలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఎంత వరకు వచ్చాయి... కృష్ణా నీరు ఎంత వస్తుంది, ఎంత అవసరం ఉంటుంది లాంటి విషయాలు కూడా చర్చించారు...

మొత్తానికి కేసిఆర్, పయ్యవులతో ఏకాంత భేటి హాట్ టాపిక్ అయ్యింది...

గుంటూరులో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియానికి మంత్రి లోకేశ్ ప్రారంభోత్సవం చేశారు. ఆలిండియా బాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. అక్టోబర్ ఒకటి నుంచి ఆరవ తేది వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

మొత్తం 550 ఆటగాళ్ళు ఈ పోటీల్లో పాల్గుంటారు... దాదాపు 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా పోటీల్లో పాల్గునన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ కొంచెం సేపు బ్యాడ్మింటన్ ఆడారు... బాడ్మింటన్ మన తెలుగువారి బ్లడ్ లోనే ఉందని, చంద్రబాబు తొలి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

ఆఫ్టర్ టూ ఇయర్స్ కింగ్ అంటివి.... చంద్రబాబుని బంగాళాఖాతంలో కలుపుతా అంటివి... సినిమాలో హీరోని అంటివి... ఇన్ని ఆశలు ఉన్న నీవు యాడికి పోయావ్ జగనన్నా... మా ఆంద్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు కనిపించి సరిగ్గా ఇవాల్టికి నెల రోజులు అవుతుంది...

అప్పుడెప్పుడో "కొట్య్నాడు.. కొట్టించుకున్యాం.." అన్నావు... మళ్ళీ సోయ లేదు... సెప్టెంబర్ ఒకటవ తారీఖు నంద్యాల ప్రజలు నీ పార్టీని ఛీ కొట్టిన రోజు, హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు కొట్టాడు అన్నావ్... అంతే అప్పటి నుంచి అడ్రస్ లేదు... 15 రోజులు కూతురిని కాలేజీలో చేర్పించటానికి వెళ్ళావ్... వచ్చి 15 రోజులు అయ్యింది... ఒకసారి కోర్ట్ కి వెళ్ళావ్... ఒక సారి బీజేపితో చర్చలకి వెళ్ళావ్...

మరి మా ఆంధ్ర రాష్ట్రం రావటానికి ఏమి బాధ ? ఆ హైదరాబాద్ వదిలి, మా రాష్ట్రంలో జనం ఎలా ఉన్నారో చూడాలని లేదా ? నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడివేనా ? లేకపోతే ఈ రాష్ట్రంలో ఏమి ప్రజా సమస్యలు లేవు అని డిసైడ్ అయ్యి, మా రాష్ట్రం గురించి పట్టించుకోవటం మానేశావా ? నీ ఓదార్పు యాత్రలకి, పాదయాత్రలకి, నీ రాజకీయాలకి తప్ప, మా రాష్ట్ర ప్రజలు గురించి నీకు పట్టదా ?

ఒకసారి ఆలోచించు జగనన్నా... అయినా మా పిచ్చ గాని, నువ్వు ఒకళ్ళు చెప్పిన మాట ఇంటావా ఏంటి ? ఆ ప్రశాంత్ కిషోర్ మాట ఇంటావు కాని...

ఇట్లు,
విజ్ఞతతో ఆలోచించే నవ్యాంధ్ర ప్రజానీకం....

ఎవరైనా పెద్ద హోదా ఉన్నవారు ఎదురు పడినప్పుడో, లేక వయసులో పెద్దవారు ఎదురు పడినప్పుడో, గౌరవ సూచికంగా కొంచెం ముందుకు వంగి అభివాదం చేస్తూ ఉంటాం.... చాలా సందర్భాల్లో ప్రధాని, రాష్ట్రపతి, అద్వాని లాంటి పెద్దవాళ్ళని కలిసినప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇలానే అభివాదం చేసేవారు...

అయితే రాష్ట్రంలో ప్రజా సమస్యలు మీద పోరాడటం చేత కాని జగన్ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్, నెల జీతానికి పని చేసే జీతగాళ్ళు, అద్దె మైక్ పట్టుకుని, చంద్రబాబు లొంగిపోయాడు అని, కేసులు మాఫీ చేపించుకుంటున్నాడు అని, భయపడి పోతున్నాడని, ఇలా సునకనందం పొందుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు తీసే పనిలో ఉండేవారు... కెసిఆర్ అంటే చంద్రబాబుకి భయం అని, గ్రాఫిక్స్ పోస్ట్ లు పెట్టుకుని, సోషల్ మీడియాలో పిచ్చి ప్రపంచంలో ఉండేవారు...

అయితే ఇవాళ, పరిటాల రవి కుమారుడు, శ్రీరాం పెళ్ళికి, కెసిఆర్ అనంతపురం వచ్చారు... ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, పెళ్ళికి హాజరయ్యారు... ఇద్దరు ఎదురు పడినప్పుడు, కెసిఆర్ ముందుకు వంగి, గౌరవ సూచికంగా చంద్రబాబుకి అభివాదం చేశారు... చంద్రబాబు కూడా కెసిఆర్ చెయ్య పట్టుకుని పలకరించారు...

మరి జగన్ బ్యాచ్, అలాగే కొంత మంది తెలంగాణా మేధావాలు ప్రకారం, కెసిఆర్, చంద్రబాబుని చూసి భయపడుతున్నారా ? గౌరవ సూచికంగా అభివాదం చేసే దాన్ని కూడా, సునకానందం పొందే మీకు ఇలాంటివి కనిపించవా ?

గౌరవం అంటే ఏంటో తెలుసుకోండి... అయినా మనం ఇంట్లో తండ్రినే కొట్టిన మహానుభావుడి ఫాలోవర్స్ కదా, ఇలాంటివి తెలియవులే ...

Advertisements

Latest Articles

Most Read