జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో సమగ్ర పర్యాటకాభివృద్ధి సాధించిన రాష్ట్రంగా అవార్డు దక్కింది.
బుధవారం పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏవీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ అందుకున్నారు.
ఈ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో రాజస్తాన్, తృతీయ స్థానంలో గోవా, కేరళ రాష్ట్రాలు నిలిచాయి.
నూతనంగా ఏర్పాటైన రాష్ట్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకోవటం ప్రభుత్వ సత్తాను చాటిందని, సీఎం చంద్రబాబు నుంచి తమకు లభిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఈ విజయాలు సాదించగలుగుతున్నామని మీనా తెలిపారు.
పర్యాటకుల సంఖ్యలో ఏవీ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. గత 15 ఏళ్లగా ఇదే స్థానాన్ని ఏపీ పదిలపరుచుకుంటుందని పేర్కొంది.