జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో సమగ్ర పర్యాటకాభివృద్ధి సాధించిన రాష్ట్రంగా అవార్డు దక్కింది.

బుధవారం పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏవీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ అందుకున్నారు.

ఈ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో రాజస్తాన్, తృతీయ స్థానంలో గోవా, కేరళ రాష్ట్రాలు నిలిచాయి.

నూతనంగా ఏర్పాటైన రాష్ట్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకోవటం ప్రభుత్వ సత్తాను చాటిందని, సీఎం చంద్రబాబు నుంచి తమకు లభిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఈ విజయాలు సాదించగలుగుతున్నామని మీనా తెలిపారు.

పర్యాటకుల సంఖ్యలో ఏవీ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. గత 15 ఏళ్లగా ఇదే స్థానాన్ని ఏపీ పదిలపరుచుకుంటుందని పేర్కొంది.

రాజధాని రైతులు ఎప్పడా అని ఎదురుచూస్తున్న సింగపూర్ పర్యటన ఖరారైంది. రైతులే ప్రధమం (పార్మర్స్ ఫస్ట్) కార్యక్రమంలో భాగంగా అమరావతి రాజధానికి భూమిలిచ్చిన రైతులు సింగపూర్లో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలను సందర్శించటానికి సీఆర్డీఏ అవకాశం కల్పిస్తోంది.

సింగపూర్ పర్యటనకు ఆసక్తి ఉన్న రైతులు నుంచి సీఆర్డీఏ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పర్యటనలో భాగంగా 100 మంది భూములిచ్చిన రైతులను మూడు దఫాలుగా సింగపూర్ తీసుకెళ్లడానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి జట్టును ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 26 వరకు, రెండవ జట్టును నవంబర్ 5 తేదీ నుంచి నవంబర్ 9 వరకు, మూడో జట్టుని నవంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 28 తేదీలుగా ఖరారు చేశారు.

ఈ పర్యటనలో భూసమీకరణ పథకం కింద అమరావతి రాజధాని నిర్మాణం కొరకు భూములు ఇచ్చినవారు తిరిగి పొందిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఏ విధంగా అభివృద్ది పరుచుకోవచ్చనే అంశం పై అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా సింగపూర్ ప్రభుత్వం అభివృద్ధి పరిచిన అనేక పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలను పరిశీలించటం ద్వారా అవగాహన కలిగించడానికి ఈ పర్యటన తోడ్పడుతుందని సీఆర్డీఏ భావిస్తోంది.

ఈ పర్యటనకు ఎంపికైన వారికి సింగపూర్లో 3 రాత్రులు, 4 పగళ్లు వసతి, స్థానిక రవాణా సదుపాయాలను సీఆర్డీఏ కల్పించనుంది. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్దతి ద్వారా ఎంపికచేయనున్నారు. దీనికి అర్హతగా 08.12.2014 తేదీ నాటికి రాజదానిలో భూయజమానిగా గుర్తించబడి నివాసం కలిగి ఉండాలి. అదే విధంగా భూసమీకరణ పథకం కింద రాజధాని నిర్మాణానికి భూమిలిచ్చి 9.14 అగ్రిమెంట్ పొందిన వారైవుండాలి. భారత ప్రభుత్వం జారీచేసిన పాస్ పోర్ట్ కలిగి ఉండాలి.

పర్యటనకు ఎంపికైన వారు రాను పోను విమానయాన టికెట్ ఖర్చులు, వీసా ఫీజు, ఆరోగ్య బీమా రైతులే భరించవలసి ఉంటుంది. సింగపూర్ పర్యటనకు ఆసక్తి ఉన్నవారు రాజధాని గ్రామాలలో ఉన్న కాంపిటెంట్ అధారిటీల వద్ద నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవచ్చుని, నమూన ఫారాలను కాంపిటెంట్ అధారిటీల వారి కార్యాలయంలో ఉంటాయని సీఆర్డీఏ తెలిపింది.

విభజన తరువాత పెట్టుబడులను ఆకర్షిస్తానికి చంద్రబాబు అనేక కష్టాలు పడ్డారు... ఇప్పుడిప్పుడే అవి ఫలితాలను ఇస్తున్నాయి... చిన్న తరహా ప్రాజెక్ట్ లను ఆకర్షించటం కోసం, ప్రతి జిల్లలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేశారు... అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, చిన్న తరహా పరిశ్రమలకి అక్కడ కంపెనీ పెట్టటానికి తగిన భూమి ఇవ్వనున్నారు...

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా, ముందుగా కృష్ణా జిల్లాలోని వీరపనేనిగూడెం దగ్గర ఏర్పాటు చేసిన ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రెడీ అయ్యింది... హైదరాబాద్ లో ఇప్పటికే ప్లాంట్లు కలిగి, విస్తరణ కోసం అమరావతి వైపు చూస్తున్న 75 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లో తమ కార్యకలాపాలు జరపనున్నాయి.

ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తయ్యి, అక్కడ ప్లాంట్లు కూడా నెలకొల్పారు... ఈ విజయదశమి రోజు, వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లో 75 పరిశ్రమలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రరంభించనున్నారు. ఈ 75 కంపెనీల ద్వారా, దాదాపు 2,600 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ పరిశ్రమల్లో ఎరోస్పేస్‌ పరికరాలు, మిషనరీ విడిభాగాలు, ప్రెస్‌ టూల్స్‌, కాప్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌, గృహోపకరణాలు, ఇంజనీరింగ్‌ సేవలు లభిస్తాయి.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి అధికారులని ఆదేశించి, ఆ దిశగా అడుగులు వెయ్యమన్నారు.

మహర్నవమిని స్త్రీశక్తి విజయం సాధించిన రోజుగా గుర్తించి స్ఫూర్తిపొందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్త్రీలలో అమ్మవారి చైతన్యాన్ని గుర్తించడమే ఈ పండుగ పరమార్ధమని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి ఆయన మహర్నవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులోగిళ్లు పండుగ వాతావరణంతో కళకళలాడాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.

దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో మహర్నవమి నాడు అమ్మవారు లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించి మహిషాసురమర్దనిగా, జగజ్జననిగా అవతరించారని చెప్పారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణతో దుర్గాదేవి ఆదిపరాశక్తి అయ్యారని చంద్రబాబు వివరించారు. మహర్నవమినాడు సకల దేవతల అంశగా అమ్మవారు మహాశక్తి రూపంలో దర్శనమిస్తారని, స్త్రీలు అబలలు కారు అని చాటిచెప్పే అలంకారం మహిషాసుర మర్దని అలంకారం అన్నారు.

మహిళలను గౌరవించడంతోనే సరిపెట్టకుండా వారికి సాధికారత కల్పించిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. మహానాయకుడు ఎన్టీరామారావు దేశంలో తొలిసారిగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారని, ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారన్నారు. తమ హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.

తల్లిని పూజించినట్లే ప్రతి మహిళను గౌరవించాలంటూ ఉద్బోధించారు. డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతూ సాధికారత కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక మహిళల నుంచి స్వయం వ్యాపార మహిళలుగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళా పార్లమెంటు సదస్సు మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read