జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే... ఇందులో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చేస్తూ, అక్కడ పార్టిసిపెంట్స్ ఆ షో లో పాల్గునే వారు... జగన్ విషయానికి వస్తే, వైసిపి పార్టీకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బిగ్ బాస్... ఈయన ఇచ్చే టాస్క్ లు చెయ్యటం జగన్ పని...

ప్రశాంత్ కిషోర్ జగన్ కి ఇచ్చిన మొదటి టాస్క్, వైఎస్ఆర్ కుటుంబం... మిస్ కాల్ ఇచ్చి, ప్రజల సమస్యలు తెలుసుకుని, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆ సమస్యలు తీర్చటం దీని ఉద్దేశం... మొదటి ప్రశాంత్ కిషోర్ టాస్క్ చెప్పగానే, జగన్ ఉత్సాహంగా "ఇది నాకు చాలా చిన్న విషయం.. నేను ఈ టాస్క్ ఎలా కంప్లీట్ చేస్తాను చూడు" అని ప్రశాంత్ కిషోర్ కి ఛాలెంజ్ చేశాడు జగన్...

కట్ చేస్తే, ఈ ప్రోగ్రాం అట్టర్ ఫ్లోప్ అయ్యింది... ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన టార్గెట్ ఏమాత్రం చేరుకోలేదు.. జగన్ 20 రోజులు లండన్ లో కూర్చోవటంతో, ఇక్కడ కూడా నాయకులు హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోయారు... ఆ ప్రోగ్రాం లీడ్ చేసే వారే లేరు... ఆశించిన మేర స్పందన లభించకపోవడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలని జగన్ లెఫ్ట్, రైట్ వాయించారు...

ఉత్తరకోస్తా జిల్లాల్లో ఘోరంగా ఉంది...విజయనగరం జిల్లాలో 1.9 శాతం, శ్రీకాకుళం జిల్లాల్లో 5 శాతం మాత్రమే ఈ కార్యక్రమం కింద తమ పేర్లు నమోదు చేసుకొన్నారు.

జగన్ కు బాగా బలం ఉంది అనుకున్న రాయలసీమలో కూడా అంతఅంత మాత్రంగానే ఉంది...చిత్తూరులో 8 శాతం, కడపలో 4 శాతమే నమోదు అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో 9.9 శాతంగా, కర్నూల్ లో 4.4 శాతం, నెల్లూరులో 7.2 శాతంగా నమోదు చేసుకొన్నట్టు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఇచ్చిన లెక్కల ప్రకారం తేలింది.

దీంతో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన మొదటి టాస్క్ జగన్ ఫెయిల్ అయ్యారు... మరి ప్రశాంత్ కిషోర్ జగన్ ని ఎలిమినేట్ చేస్తారో లేదో చూడాలి...

"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తక వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా, క్రింది విధంగా స్పందించారు...
"కుల మతాలను కించ పరిచే విధంగా పుస్తకాలు రాయడం సరికాదని, ప్రజలందరూ ఒకే కుటుంబంలా సామరస్యంతో కలసి మెలసి ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు."

మంగళవారం ఢిల్లీ పర్యటనలో కూడా విలేకరులతో మాట్లాడుతూ ఇదే విషయం పై చంద్రబాబు స్పందించారు... ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పుస్తకాలు రాయడం సరికాదు అని చంద్రబాబు పేర్కొన్నారు... ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

కంచ ఐలయ్య రచించిన ఈ పుస్తకంపై ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే...

కియా కార్ల పరిశ్రమ స్థాపనతో అనంతపురం రూపురేఖలు మార్చనుంది. కియా పరిశ్రమతో పాటు, అనుబంధంగా కొరియాకే చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలు 6500 పెట్టుబడితో తమ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ ఏర్పాటు చేసే కార్ల ప్లాంట్ సమగ్ర ప్లాంట్ కానుంది.

ఈ విడి బాగాల తయారీ కంపెనీలన్నీ తమ యూనిట్లను రెండు దశల్లో ఏర్పాటు చేయబోతున్నాయి. కార్ల ప్లాంట్ ఏర్పాటు కోసం కియా మోటార్స్ ఒక్కటే 110 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇప్పటికే 600 ఎకరాల్లో చదును కార్యక్రమం జరుగుతోంది.

అనంతపూర్ జిల్లాలో ఏర్పాటు చేసే తన ప్లాంట్ కు అవసరమైన విడిభాగాల్లో ఎక్కువ బాగాన్ని స్థానికంగానే సేకరించాలని కియా మోటార్స్ బావిస్తోంది. అలా చేయడం వలన ఖర్చులు తగ్గించుకుని భారత మార్కెట్లో మారుతితో పాటు ఇతర కంపెనీలతో దీటుగా పోటీ పడొచ్చని కంపెనీ అంచనా.

నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో నేషనల్ మీడియాతో మాట్లాడారు.. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహాక కమిటీ ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబును చైర్మన్ అయినందున, నేషనల్ మీడియా దానికి సంభందించిన ప్రశ్నలు చంద్రబాబుని అడిగింది.

నోట్ల రద్దు మంచిదే అని, అయితే డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేసి, ఆన్లైన్ చార్జీలు తగ్గించి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే, నగదు రహితం వైపు ప్రజలు ఆకర్షితులు అవుతారని చంద్రబాబు అన్నారు...

నోట్ల రద్దు తర్వాత రెండు వేల నోటును ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ తప్పు చేశారా అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ, పెద్ద ఎత్తున నోట్ల రద్దు చేసినప్పుడు, భారీ స్థాయిలో డబ్బు చలామణిలో నుంచి వెళ్లిపోయిందని, అందుకే ఆ సమయంలో రెండు వేల నోటు అవసరమైందని చెప్పారు.. అయితే ఇప్పుడు డిజిటల్ వైపు ప్రజలను సన్నద్ధం చేసి, అవసరమైన ఇంటర్నెట్ సామర్ధ్యం పెంచి, చార్జీలు తగ్గించి, కొత్తగా ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోట్లు రద్దు చెయ్యాలని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద నోట్లు రద్దు చెయ్యమంటూ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు.. అయితే పెద్ద నోట్లు రద్దు తరువాత, వచ్చిన 2 వేల రూపాయల నోటు కూడా అవసరం లేదు అని చంద్రబాబు ముందు నుంచి చెప్తున్నారు.

ఏదైనా సంస్కరణ చేసినప్పుడు, ఫలితాలు రావాలంటే కొంత సమయం పడుతుందని, పెద్ద నోట్ల వల్ల అవినీతి ఎక్కువవుతుందని, దాన్ని నేను గట్టిగా నమ్ముతానని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read