ఎంతటి వారైనా క్రమశిక్షణతో ఉండాలి... ఇది ఎప్పుడూ చంద్రబాబు చెప్పే మాట... పార్టీ పరంగా కూడా, ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా, ముందు చంద్రబాబు చెప్పే మాట ఇదే... క్రమశిక్షణ...

కాని ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో, నేతలు క్రమశిక్షణ తప్పారు.. పార్టీ నిర్ణయాలని దిక్కరించారు... కొంత మంది అధినేత మాట కూడా లెక్క చెయ్యకుండా ప్రవర్తించారు...కొంత మంది, విమర్శలు చేశారు కూడా... కాని, చంద్రబాబు చర్యలు తీసుకోలేదు... వార్నింగ్ లు తోనే సరి పెట్టారు... మారటానికి టైం ఇచ్చారు.. ఇదే చాలా మంది నాయకులకి అలుసు అయ్యింది... మనం ఏమి చేసినా, చంద్రబాబు ఏమి చెయ్యడు లే అనే ధీమా వచ్చేసింది...

ఇవన్నీ గమనిస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క‌మిటీల‌ పేరుతో చిన్న శాంపిల్ చూపించారు... మీ వైఖరి ఇలాగే కొనసాగితే, పార్టీ తరుపున 2019 టికెట్ ఇచ్చేది లేదు, అనే సంకేతం పంపించారు... క్రమశిక్షణ తప్పితే, తోక కత్తిరిస్తాను అనే పరోక్ష సంకేతాలు పంపారు...

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క‌మిటీల‌ విషయంలో సీనియర్లు అని చూడలేదు, తనకు కావాల్సిన వారు అని చూడలేదు... ఎవరైతే తోక జాడించారో వాళ్ళకి చెక్ పెట్టారు చంద్రబాబు...

చంద్రబాబు ప్రాణ స్నేహితుడు బొజ్జ‌ల‌, అలాగే చంద్రబాబుకి బాగా దగ్గరగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి సీనియర్ నేతలకి కూడా రాష్ట్ర కమిటీలో చోటు ఇవ్వలేదు... అలాగే, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా తప్పించారు... మంత్రి పదవి ఇవ్వలేదు అని, కాపులు గొంతు కోశారు అంటూ హడావిడి చేసిన బొండా ఉమాని కూడా రాష్ట్ర కమిటీ నుంచి తప్పించారు... అలాగే విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి కూడా మంత్రి పదివి ఇవ్వలేదు అని, కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ కి వెళ్లి హంగామా చేసి, హడావిడి చేసినందుకు, ఆయన కూడా రాష్ట్ర కమిటీ నుంచి అవుట్ అయ్యారు...

మొత్తానికి ఈ చర్యతో, చంద్రబాబు తన దగ్గర తోక జాడిస్తే, ఊరుకునేది లేదు అని గెట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది... దీంతో ఎమ్మల్యేలు కూడా అలెర్ట్ అయ్యారు... 2019 సీటు రావాలి అంటే, క్రమశిక్షణతో మెలగాలి అని, చంద్రబాబు చెప్పినవి అని చెయ్యాలి అని, ఆయన దృష్టిలో మార్కులు కొట్టేయేక పొతే, సీటు కూడా రాదు అని డిసైడ్ అయ్యి, పని చేస్తున్నారు...

ముచ్చట పడి నాన్నగారు దగ్గర పాకెట్ మనీ తీసుకుని కట్టిన హైదరాబాద్ లోటస్ పాండ్ విడిచి, మన రాష్ట్రం రావాలి అంటే జగన్ కు మహా చెడ్డ చిరాకు... అందుకే మూడేళ్ళు అయినా, జగన్ ఇప్పటి వరకు అమరావతికి మఖాం మార్చలేదు..

అయితే కొత్తగా బీహార్ నుంచి ఇంపోర్ట్ అయిన, సలహాదారుడి సూచన మేరకు, మనసు ఒప్పుకోక పోయినా, ముఖ్యమంత్రి కుర్చీ కోసం బెజవాడ షిఫ్ట్ అవ్వటానికి జగన్ ఒప్పుకున్నారు... దీంతో "తాత్కాలిక" సెట్ అప్ ఒకటి, బందర్ రోడ్డులోని, మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన స్థలంలో వైసీసీ కార్యాలయం నిర్మిస్తున్నారు. లెక్క ప్రకారం ఇవాళ ఆ ఆఫీస్ ఓపెన్ అవ్వాలి... కాని, జ్యోతిష్యులు 27వ నెంబర్ కలిసి రాదు అన్నారు అనే వంక పెట్టుకుని, విజయవాడ కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా వేశారు...

అయితే, విజయవాడలో కార్యాలయం పెడుతున్నాం అని, జగన్ ఇక్కడే ఉంటారని, అందుకని PWD గ్రౌండ్స్ ఎదురుగుగా ఉన్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, జగన్ కు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది వైసిపీ...

ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆ గెస్ట్ హౌస్ లో, ఎప్పటి నుంచో మంత్రి అయ్యన్నపాత్రుడు తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అది ఇవ్వటం కుదరదు అని చెప్పింది ప్రభుత్వం... అది ఎలాగూ ఇవ్వరు అని తెలిసి, వైసిపీ ఆ గెస్ట్ హుసే కావాలని పట్టుబడుతుంది... ప్రభుత్వం ప్రతి పక్ష నాయకుడిని అవమానిస్తుంది అంటూ, ప్రచారం మొదలు పెట్టింది.

ఇన్నాళ్ళు సొంత రాష్ట్రం మీద, అమరావతి మీద జగన్ చేసిన విష ప్రచారం, ఎలక్షన్ దగ్గర పడుతుండటంతో, జగన్ కు ప్రేమ కలగటం, దాన్ని రాజకీయం చెయ్యటం, ఇవన్నీ చూస్తున్న ప్రజలు అసహ్యించుకుంటున్నారు...

డిసెంబర్ నెలలో బిల్‌ గేట్స్‌ రాష్ట్రానికి వస్తున్న సంగతి తెలిసిందే... అయితే బిల్ గేట్స్‌ రక కంటే ముందే, బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ఓ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

గురువారం ఈ బృందం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది. ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది.

రాష్ట్రంలో భూసార పరీక్షల కోసం ఫౌండేషన్‌ సాంకేతిక సహకారం ఇవ్వనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన భూసార పరీక్షలు, వాటి ఫలితాలు, రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డుల పంపిణీ విధానాలను వంటి వాటిపై వ్యవసాయశాఖ ఈ బృందానికి వివరించనుంది.

వీటిని అన్నిటినీ క్రోడీకరించి, బిల్‌ గేట్స్‌ కు, రిపోర్ట్ ఇవ్వనుంది ఈ బృందం...

సాక్షి దినపత్రికలో వచ్చే పిచ్చి వార్తలు, ఇప్పుడు జగన్ సతీమణికి చుట్టుకుంటున్నాయి... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి, సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి కోర్టు నూజివీడు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

విజయవాడలో జరిగిన కాల్‌మనీ కేసులో, కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పై సాక్షి పిచ్చి రాతలు రాసింది.. దీంతో, తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఇది ఇలా ఉండగా, ఈ కేసు వాయిదాలకి కోర్టుకు హాజరుకాకపోవడంతో సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది.

Advertisements

Latest Articles

Most Read