రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చిన, గోరంతను కొండంత చేసే జగన్ పార్టీ, జగన్ పైడ్ సోషల్ మీడియా వర్కర్స్, సాక్షి టీవీ, ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు స్పందించలేదు ? చివరకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించినా, బాధ్యత గల ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడడా ?

కాపు రిజర్వేషన్ల విషయంలో కాని, గరగపర్రు విషయంలో కాని రెచ్చిపోయి రచ్చ చేసిన జగన్, ఎందుకు నోరెత్తటలేదు ? ప్రతి పక్ష నేత అని మర్చిపోయాడా ? లేక వారు ఎలాగూ నాకు వోట్లు వెయ్యరు, వాళ్ళ గురించి నేనెందుకు పట్టించుకోవాలి అనుకుంటున్నాడా ?

ఆర్య వైశ్యులని "సామిజక స్మగ్లర్ లు" అంటూ కంచె ఐలయ్య రాసిన పుస్తకం, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.... ఒక కులాన్ని డైరెక్ట్ గా నిందిస్తూ, కంచె ఐలయ్య రెచ్చిపోతుంటే, ఆ సామజిక వర్గం ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, వారి తరుపున ఇప్పటివరకు మాట్లాడలేదు ప్రతిపక్ష నాయకుడు...

చంద్రబాబు, డిజిపితో రివ్యూ జరిపి, అన్ని చట్ట పరమైన చర్యలు తీసుకోమన్నారు.. ఒక కులాన్ని నిందించే హక్కు ఎవరకి లేదు అని, ఆ పుస్తకాన్ని రాష్ట్రంలో నిషేదించాలి అని కూడా చెప్తూ, ఆర్య వైశ్యులకి అండగా నిలబడ్డారు చంద్రబాబు... మరి జగన్ ఏమి చేస్తున్నాడు ? ఈ విషయం మీద కూడా, ఆఫ్టర్ టు ఇయర్స్ సియం అయిన తరువాత మాట్లాడతాడా ?

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన డిఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా...? ప్రతిపక్షం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాను మాత్రం చంద్రబాబు కిందే పని చేయడానికి మొగ్గు చూపుతున్నారా...? అసలు డిఎల్ పయనం ఎటు...? బలమైన నేతగా పేరున్న ఆయన రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి చంద్రబాబుకి మద్దతు పలికే అవకాశం ఉందని అంటున్నారు తెలుగుదేశం నేతలు... అది ఒకసారి పరిశీలిస్తే....

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు కనుమెరుగైన కాంగ్రెస్ పార్టీలోని బలమైన నేతలు అంతా తెలుగుదేశం పార్టీ , ప్రతిపక్ష వైకాపాలో చేరినా మరికొంత మంది నేతలు మాత్రం అలా స్తబ్దుగా ఉండిపోయారు. వారిలో మాజీ ఆరోగ్య శాఖా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఒకరు... కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గానికి చెందిన డిఎల్ కి తన నియోజకవర్గంలోనే కాక జిల్ల్లాలో కూడా మంచి పేరుంది... అన్ని వర్గాలకు ఆయన దగ్గరగానే ఉంటూ వచ్చారు.

అయితే గత ఎన్నికల నుంచి ఆయన దాదాపు రాజకీయాలకు దూరమయ్యారనే చెప్పవచ్చు.. ఎక్కడా కూడా తన పార్టీ కార్యాకలాపాల్లో కూడా ఆయన పాల్గొన్న దాఖలాలు కూడా లేవు.. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న డిఎల్ మళ్ళి తన రాజకీయ పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధమవుతున్నారు.. అయితే ఏ పార్టీలో చేరతారు అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా లేకపోయినా తెలుగుదేశంలో చేరే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి..

వైకాపాకి చెందిన కీలక నాయకులు డిఎల్ ని సంప్రదించినా ఆయన వారికీ ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తుంది... ఆ సందిగ్దత అలా కొనసాగుతున్న తరుణంలో డిఎల్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరికినట్టు తెలుస్తుంది...మూడు నాలుగు రోజుల్లో హైదరాబాద్ లో జరిగే ఒక వివాహంలో వీరిరువురు కలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు తెలుగుదేశం నేతలు...

ఇంత వరకు బాగానే ఉన్నా మైదుకూరు నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి రేగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది... ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ డిఎల్ ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది... డిఎల్ వచ్చినా అధిష్టానం తనకే సీటు ఇస్తుందనే ధీమాలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది... ఏది ఎలా ఉన్నా డిఎల్ తెలుగుదేశంలోకి వస్తే మాత్రం ప్రతిపక్షానికి జిల్లాలో భారీ దెబ్బె అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఉదారతను చాటుకున్నారు. సమస్యలను బట్టి తక్షణ సాయం అందిస్తున్నారు చంద్రబాబు.

శరీరం మొత్తం పుండుగా మారే అరుదైన వ్యాధితో గుంటూరుకు చెందిన షేక్ హసీన అనే మహిళ బాధపడుతుంది. హసీనా నిరుపేదరాలు కావడంతో చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.. తన చికిత్సకు సహాయం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు.

షేక్ హసీన పరిస్థితి చూసి చంద్రబాబు చలించిపోయారు. వైద్యం నిమిత్తం రూ.10లక్షలు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి.

శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో తనను కలిసిన సందర్శకుల సమస్యలు సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వారి సమస్యలను బట్టి తక్షణ సాయం అందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్తుంటే, సాక్షి పేపర్ ఎలా రాసిందో చూసాం... తెలంగాణా ఎడిషన్ లో వాళ్ళని రెచ్చగొడుతూ, ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తోడేస్తుంది అని రాశారు... ఇక్కడేమో, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎక్కువ నీళ్ళు తోడలేదు అని రాసింది సాక్షి...

ఈ విషయం మీద సోషల్ మీడియాలో విపరీతమైన రియాక్షన్ వచ్చింది... సాక్షి వక్ర బుద్ధిని సోషల్ మీడియా వేదికగా అందరూ ఎండగట్టారు... కాని తెలుగుదేశం వైపు నుంచి ఒక్కరు కూడా, ఈ విషయం మీద మాట్లాడలేదు... మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి వార్తలు ఖండిచక పొతే, ప్రజలకు విషయాలు ఎలా తెలుస్తాయి ? ఈ ఒక్క విషయం అనే కాదు, చాలా విషయాల్లో చేసింది చెప్పుకోవటం దగ్గర నుంచి, విష ప్రచారాన్ని తిప్పి కొట్టే దాకా తెలుగుదేశం ఫెయిల్ అవుతూనే ఉంది....

చివరకి సాక్షాత్తు ముఖ్యమంత్రి సాక్షి వక్ర బుద్ధి మీద స్పందించాల్సి వచ్చింది. రాయలసీమకు నీళ్లు ఇస్తే, నీళ్లు దొంగిలిస్తున్నానంటూ జగన్ పత్రిక రాయటం పై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "పులివెందుల, కడపకు నీళ్లిచ్చినా భరించలేరా? ఎంత నీచం... ఎంత దుర్మార్గం. వీళ్లు మనుషులేనా... తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా అక్కడ రాతలు రాస్తారా... పట్టిసీమ, గండికోట, అమరావతి ఏ పని చేసినా అడ్డుపడ్డారు. ఇలాంటి వారిని ఏమనాలి? మనూరికి నీళ్లు ఇచ్చినా ఓర్చుకోలేని అసూయ మనుషులకుంటే ఎలా....' అంటూ ముఖ్యమంత్రి సాక్షి రాతలని ప్రజలకు అర్ధమైయ్యేలా వివరించారు...

ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మారతారమే చూద్దాం...

Advertisements

Latest Articles

Most Read