చంద్రబాబు చైనా పర్యటనలో ఏమి సాధించారు అనే వారికి సమాధానం ఇది... 2015లో చంద్రబాబు పెట్టుబడుల కోసం చైనా పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పర్యటన సాగుతున్న అంత సేపు జగన్ విమరిస్తూనే ఉన్నారు... చంద్రబాబు ఎంజాయ్ చెయ్యటానికి వెళ్లారు అని ఒకరు, చంద్రబాబు మొఖం చూసి ఎవడు పెట్టుబడులు పెడతారు అని ఒక వైపు విమర్శలు చేశారు. అయితే, ఇప్పుడు వారందరికే చెంప పెట్టు ఈ న్యూస్..

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చైనాకు చెందిన జియాన్‌ లోంగీ సిలికాన్‌ మెటీరియల్స్‌ కార్పొరేషన్‌ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించనుంది. తొలి విడత రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు, 5 వేల మందికి ఉపాధి రానుంది.

వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ సెల్స్‌, మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ మాడ్యూళ్లను ఉత్పత్తి చేయనుంది. ఇక్కడ తయారు చేసిన వాటిని విదేశాలకూ ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. వాటితో పాటు అక్కడే మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను సంస్థ ఉత్పత్తి చేసి.. రాష్ట్రానికి విక్రయించనుంది.

దీనికి సంబంధించి పనులు అన్నీ చక చక జరుగుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నాటికి, ప్లాంట్ కి ముఖ్యమంత్రి చేత శంకుస్థాపన చేసి, సాధ్యమైనంత త్వరలో కంపెనీ ప్రారంభించనున్నారు.

చంద్రబాబు నాయుడు" ఇప్పుడు ఈ పేరు చెప్తే నీటి పారుదల శాఖలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులకు చుక్కలు కనపడుతున్నాయి... తనంతట తాను లక్ష్యాలను పెట్టుకుని ... అప్పటికి పూర్తి చేస్తా అని చెప్పి ఆయన నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోనివ్వకుండా మాకు ఈ టార్చర్ ఏంటి అని చంద్రబాబు ని చూసి కొందరు అధికారులు తిట్టుకుంటున్నారట... ప్రాజెక్ట్ పూర్తి అయితే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారని గాని మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారట....

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ అంటూ రైతులకు కొరకు పలు కార్యక్రమాలు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత పట్టుసీమ తో సాగునీటి ప్రాజెక్టులను మొదలు పెట్టారు... అక్కడి నుంచి రోజులో అధిక భాగం వాటి గురించి ఆరా తీస్తూ వారం వారం సమీక్షలు సమావేశాలు మొదలు పెట్టి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారట... పోలవరం త్వరగా పూర్తి చేసి నీళ్లు ఇవ్వడానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి వారంలో ఒక రోజు ఈ ప్రాజెక్టుకు కేటాయించారు..

పనులు ఎక్కడి వరకు వచ్చాయి గేట్లు పూర్తి అయ్యాయా..? డయాఫ్రామ్ వాల్ ఎక్కడి వరకు వచ్చింది... ఇలా అన్ని ఆరా తీస్తుండటంతో అధికారులకు నిద్ర కరువైపోతుందట... అలాగే రాయలసీమ విషయంలో కూడా సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి సీమలో పర్యటిస్తున్నారంటే అధికారులు తెలియకుండానే ప్రాజెక్టుల వద్దకు పరిగెడుతున్నారట... సర్వీస్ సగంలో ఉన్న అధికారులు దాదాపు 70 ఏళ్లకు దగ్గరగా ఉన్న చంద్రబాబు స్పీడ్ అందుకోలేక నానా అవస్థలు పడుతున్నారట...

యదా జగన్, తదా ఆయన అభిమానులు అన్నట్టు... జగన్ పార్టీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ పై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు, అతని భార్య, ఐఆర్‌ఎస్ అధికారిని విజయలక్ష్మి పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ, ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమంగా రూ. కోటి ఉన్నట్లు గుర్తించింది.

జగన్ 11 చార్జ్ షీట్లతో, ఇప్పటి వరకు సీబీఐ 43 వేల కోట్ల అక్రమ ఆస్తులుగా గుర్తిస్తే, ఈయన ఎమ్మెల్యే మాత్రం, పాపం కేవలం కోటి రూపాయలే అక్రమంగా సంపాదించారు... ఇది జగన్ కి, అవమానం అంటున్నారు... జగన్ ఈ అమౌంట్ చూసి సిగ్గు పడతారని, అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు....

కేవలం కోటి రూపాయలకే ఇంత రచ్చ అయితే, 43 వేల కోట్లకు జగన్ ఏమై పోవాలి అంటున్నారు....

విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన వాటిలో పోలీసు ఆచారం ఒకటి. ఇంద్రకీలాద్రి ఉన్న ప్రాంతం స్థానికంగా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్‌కు ఇంద్రకీలాద్రికి సంబంధించిన ఆచారాలు వందల సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడం గొప్ప విశేషం.

ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా, స్టేషన్‌ ప్రాంతంలో ఉన్న రావి చెట్టును, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో విజయవాడ పోలీసు అధికారులు అమ్మవారికి పుట్టింటివారి పాత్ర పోషిస్తారు. కొండమీద దసరా ఉత్సవాలు మొదలయ్యే ముందురోజే స్టేషన్‌లో వేడుకలు ప్రారంభమవుతాయి.

అంతే కాదు, దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు తొలిరోజు అలంకరించే చీరను వన్‌టౌన్‌ పోలీసులే బహుకరించటం జరుగుతుంది. అలాగే చివరి రోజు జరిగే శమీపూజలో ఎంత మంది దేవాదాయ శాఖ అధికారులు ఉన్నా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ హౌస్ ఆఫీసర్ పీఠం పై కూర్చుని పూజలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం.

అలాగే, దసరా శరన్నవరాత్రులకు వన్టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. నిత్యం ప్రత్యేక పూజలు జరిపిస్తారు. చండీహోమం వైభవంగా జరుగుతుంది. తొలిరోజు, చివరిరోజున పోలీసు ఉన్నతాధికారులు ఈ పూజల్లో పాల్గొంటారు.

Advertisements

Latest Articles

Most Read