విజయవాడలో జరిగే దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన వాటిలో పోలీసు ఆచారం ఒకటి. ఇంద్రకీలాద్రి ఉన్న ప్రాంతం స్థానికంగా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్‌కు ఇంద్రకీలాద్రికి సంబంధించిన ఆచారాలు వందల సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడం గొప్ప విశేషం.

ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా, స్టేషన్‌ ప్రాంతంలో ఉన్న రావి చెట్టును, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో విజయవాడ పోలీసు అధికారులు అమ్మవారికి పుట్టింటివారి పాత్ర పోషిస్తారు. కొండమీద దసరా ఉత్సవాలు మొదలయ్యే ముందురోజే స్టేషన్‌లో వేడుకలు ప్రారంభమవుతాయి.

అంతే కాదు, దసరా ఉత్సవాల్లో దుర్గమ్మకు తొలిరోజు అలంకరించే చీరను వన్‌టౌన్‌ పోలీసులే బహుకరించటం జరుగుతుంది. అలాగే చివరి రోజు జరిగే శమీపూజలో ఎంత మంది దేవాదాయ శాఖ అధికారులు ఉన్నా వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ హౌస్ ఆఫీసర్ పీఠం పై కూర్చుని పూజలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం.

అలాగే, దసరా శరన్నవరాత్రులకు వన్టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. నిత్యం ప్రత్యేక పూజలు జరిపిస్తారు. చండీహోమం వైభవంగా జరుగుతుంది. తొలిరోజు, చివరిరోజున పోలీసు ఉన్నతాధికారులు ఈ పూజల్లో పాల్గొంటారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read