సామాన్యంగా చంద్రబాబు ఏ అధికారిని అంత తొందరగా మెచ్చుకోరు.... చాలా అరుదుగుగా అధికారులని మెచ్చుకుంటారు... మెచ్చుకున్నారు అంటే, ఆ అధికారి ది బెస్ట్ కిందే లెక్క అనుకుంటారు ఐఏఎస్ అధికారులు... కృష్ణా జిల్లా లక్ష్మీకాంతం, ఈ సారి చంద్రబాబు దృష్టిలో పడ్డారు... స్వయంగా చంద్రబాబు ఈ విషయాన్ని అందరికీ చెప్పారు...

కృష్ణా జిల్లా హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానం సాధించటం, ఉపాధి హామీ పనుల్లో దేశానికి ఆదర్శంగా నిలవటం, మీకోసం ధరఖాస్తుల పరిష్కారంలో, కైజాల, మీడియా ద్వారా వచ్చే సమస్యల పరిష్కారంలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండటం, ఇలా అన్నిటిలోనూ ప్రజలకు మేలు చేస్తున్న విధానాలు అవలంభిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ ని, చంద్రబాబు అభినందించారు...

ప్రజల నాడి తెలుసుకోవటం కోసం చేస్తున్న ఐవిఆర్‌ఎస్‌ ఫోన్ కాల్స్ సర్వేలో కూడా, 64 శాతం హ్యాపీనెస్‌తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో 12,25,102 ధరఖాస్తులు రాగా 12,20,867 ధరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, ఇది అన్ని జిల్లాలకు ఆదర్శం కావాలని అన్నారు..

ఇది వరకు కలెక్టర్ గా పని చేసిన, అహ్మద్ బాబు కూడా చాలా మంచి పనులు చేసి, జిల్లాకు, దేశ స్థాయిలో ఎన్నో అవార్డ్లు తీసుకొచ్చారు. ఇప్పడు, కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా, అదే బాటలో జిల్లాను నడిపిస్తున్నారు.

ప్రతి విషయంలోనూ, చంద్రబాబుతో పోటీ పడే కెసిఆర్... సంక్రాంతి… క్రిస్మస్… రంజాన్ పండుగలకు చంద్రన్న కానుకాలు ఇస్తున్నట్టు, తానూ కూడా ఇద్దాం అని కొత్తగా ట్రై చేశారు... చంద్రన్న కానుకాల పేరుతో పండగలప్పుడు సరుకులు పంపిణీ చేసి, పేదవారు కూడా పండగ చేసుకోవాలనేది చంద్రబాబు ఉద్దేశం. అలా ఇస్తున్న కానుకలతో చంద్రబాబుకి ఆయా వర్గాల్లో మైలేజీ వచ్చింది.

బాబులాగా మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు కేసీఆర్... తెలంగాణలో ఆడపడుచులకు ఏకంగా చీరలు ఇచ్చి వారి దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుని బొక్క బోర్లా పడ్డారు కెసిఆర్.

తెలంగాణ ఆడబిడ్డ‌లు తిర‌గ‌బ‌డేదాకా విషయం వెళ్ళింది... బతుక‌మ్మ కానుక‌గా ఇస్తోన్న చీర‌లు నాసిర‌కంగా ఉన్నాయంటూ మహిళలు చాలా చోట్ల నిరసనలు తెలిపారు... సూరత్ నుంచి తెచ్చిన, రూ.50, రూ.100 చీర‌లు ఇస్తారాఅంటూ మండిప‌డ్డారు. త‌మ‌కు చేనేత చీర‌లే ఇవ్వాలంటూ అధికారులను నిల‌దీశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న‌లు చేసి, ఒక్క‌సారి క‌ట్టుకుంటేనే చిరిగిపోయే చీరలు ఇచ్చారని మ‌హిళ‌లు మండిప‌డ్డారు.

దీంతో చంద్రన్న కానుకలులాగా మంచి పేరు రాకపోగా, విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది... మహిళలు రోడ్డెక్కి చీరలు తగలుపెట్టెంత చెడ్డ పేరు వచ్చింది...

60 ఏళ్ళ పోరాటం తరువాత, తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది... ప్రతి తెలంగాణా పౌరుడు, బంగారు తెలంగాణా వచ్చేస్తుంది అని ఆశ పడ్డారు... కాని అక్కడ ఏమి జరుగుతుంది ? విద్యార్ధుల బలి దానాల మీద గద్దెనెక్కి, కెసిఆర్ చేస్తుంది ఏమిటి ? మీడియాని 10 కీమీ లోతులో బొంద పెడతా అన్నందుకు, అన్ని ఛానల్స్ భజన చెయ్యటమే సరిపోతుంది.. వైఫల్యాలు చూపించే వారు లేరు... చెప్పుకోవాటానికి ఏమి లేదు...

తెలంగాణా ప్రజలని, ముఖ్యంగా యువతని పిచ్చోళ్లని చెయ్యటమే లక్ష్యంగా, కెసిఆర్ పాలన సాగుతుంది... యువతకి విష భీజాలు నాటి, కెసిఆర్ తప్ప తెలంగాణాకు ఎవరూ ఏమి చెయ్యలేదు అనే వాతావరణం సృష్టిస్తున్నారు... బంగారు తెలంగాణా అంటూ ౩ ఏళ్ళలో కెసిఆర్ ఏమి చేశాడో చెప్పుకోవాల్సింది పోయి, ఇప్పటికీ చంద్రబాబు మీద ఏడుస్తూనే ఉన్నారు..

ఎక్కడైనా పోటీ పరీక్షలు జరిగితే, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి ? మన ప్రాంత చరిత్ర, గొప్ప మనుషులు, మన ఎకానమీ ఇలా ఉంటాయి పరీక్షలు... కాని, తెలంగాణాలో, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగారో చూడండి. ‘రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది ఎవరు?’ ‘లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు?’ అంటూ అడిగారు.

ఎలాంటి విష భీజాలు నాటుతున్నారో చూడండి... వీరికి తెలంగాణా గురించి అడగటానికి ప్రశ్నలే లేవా ? ఎప్పటికీ ఇరు రాష్ట్రాల యువత కొట్టుకుని చావాలా ? చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతం అంటే ఏంటో, ఇప్పటికీ కెసిఆర్ కు అర్ధం కాలేదు... ఇరు ప్రాంతాలకి అన్యాయం జరగని విభజన కావలి అంటే తప్పా ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అంటే, ఒక కన్నుని పొడిచి, ఇంకో కంటిని కాపాడినందుకే కదా...

సరే, ఇదే తెలంగాణా ధోరణి అయితే, మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి ? చంద్రబాబు ఎలాగూ, ఇలాంటివి చెయ్యరు కాబ్బట్టి, మనమే కొన్ని ప్రశ్నలు వేద్దాం...

1.ఒంటి మీద పెట్రోల్ పోసుకుని, అగ్గిపెట్టి మర్చిపోయింది ఎవరు ?
జగన్
హరీష్
కేటీఆర్

2.దుబాయికి అక్రమ పాస్ పోర్ట్ లతో, మనుషుల అక్రమ రవాణా చేసింది ఎవరు ?
వైఎస్ఆర్
కెసిఆర్
పొన్నం ప్రభాకర్

౩.నగల షాపులో, నగలు కొని, డబ్బులు ఎగ్గొట్టింది ఎవరు ?
విజయశాంతి
కవిత
సోనియా గాంధీ

4.తెలంగాణా ప్రజలను ఆంధ్ర ప్రజలు మీద రెచ్చగొట్టి, ఆంధ్రలో చదువుకుని, ఆంధ్రా వాళ్ళతోనే వ్యాపారాలు చేస్తుంది ఎవరు ?
హరీష్
కేటీఆర్
కెసిఆర్

5.విద్యార్ధుల బలి దానాల మీద గద్దెనెక్కి, అదే విధ్యార్ధులను పోలీసులు చేత కొట్టించిన కుటుంబం ఏది ?
వైఎస్ఆర్ కుటుంబం
కెసిఆర్ కుటుంబం
సోనియా గాంధీ కుటుంబం

6.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దొంగ దీక్షలు చేసింది ఎవరు
జానారెడ్డి
కెసిఆర్
కోదండరాం...

రాష్ట్రంలో ప్రతిపక్ష వైసిపి సమాధి కావడానికి ఆ ముగ్గురే కారణమా ? రాష్ట్రంలో రాజకీయాలు ఫోలో అయ్యే ఎవరైనా, ఆ ముగ్గురూ ఎవరో చెప్తారు... ఇప్పుడు రాష్ట్ర మంత్రి కూడా అదే అంటున్నారు...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి జగన్ కు కుడి ఎడమలుగా ఉన్న కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలునని, వీరి దెబ్బతో ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవటం ఖాయమని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వ్యంగ్యా స్రాలు సంధించారు.

సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడవేసేందుకు జగన్ ఆస్తులు అప్పజెప్పాలని పిలుపుని వైకాపా నాయకులు భుజాలు తడుముకుంటున్నారు.

గతంలోనూ చంద్రబాబు పై అవినీతి ఆరోపణలు చేశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి, 40 మంది కాంగ్రెస్ నాయకులు దేశంలోని అన్ని కోర్టులను ఆశ్రయించి కేసులు నిరూపించలేక ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించటానికి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టామన్నారు.

Advertisements

Latest Articles

Most Read