అవును మీరు వింటుంది నిజమే... నన్ను పిలవద్దు నేను రాను అని అమరావతి శంకుస్థాపన నుంచి, నేటి సుప్రీం కోర్ట్ లో కేసులు దాకా, అన్ని విషయాల్లో అమరావతి మీద విషం చిమ్ముతూ వస్తున్న, జగన్ పార్టీకి సడన్ గా, అమరావతి మీద ఎంతో ప్రేమ పుట్టుకు వచ్చింది. ఎంత ప్రేమ అంటే, అమరావతి నిర్మించే చంద్రబాబుకి కూడా, అంత ప్రేమ ఉండదేమో...

అమరావతి కోసం నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్ ల విషయంలో చంద్రబాబు పూర్తిగా సంతృప్తి చెందలేదు... ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఈ డిజైన్స్ కి మరిన్ని హంగులు అద్దాలని, చంద్రబాబు సూచించారు... మేము కట్టేది ప్రపంచ స్థాయి రాజధాని అని, వరల్డ్ లో ది బెస్ట్ గా ఉండాలి అని నార్మన్ ఫోస్టర్ కి చెప్పారు... దీంతో, అమరావతి మీద జగన్ పార్టీకి ప్రేమ ఎక్కువై, ఇంకా ఎప్పుడూ అమరావతి మొదలు పెడతారు, మేము వెయిట్ చేస్తున్నాం... మీకు చేతకాక పొతే, మాకు చెప్పండి, మేము డిజైన్ చేపిస్తాం అంటున్నారు కొంత మంది జగన్ పార్టీ నాయకులు...

మరి అంత ప్రేమ ఉంటే, అమరావతికి రాజధాని రాకుండా ఇన్ని ఆటంకాలు ఎందుకు కల్పించారు ? రాజధానిపై అంత ప్రేమ ఉంటే కేసులు ఎందుకు వేశారు ? ఈ సందర్భంలో, అమరావతి మీద జగన్ పార్టీ చేసిన కుట్రలు, వాటిని ప్రజలు ఎలా తిప్పికొట్టారో ఒకసారి గుర్తు చేసుకుందాం...

1) భూసమీకరణ :
పొలాల్లో పంటకు నిప్పు, కానీ రైతుల ఆశీర్వచనంతో 34000 ఎకరాల రికార్డు సమీకరణ

2) మాస్టర్ ప్లాన్ :
సింగపూర్ ప్రభుత్వానికి అమరావతి వ్యతిరేక ఉత్తరాలు... విచారించుకొని వాస్తవాలు తెలుసుకొన్న సింగపూర్ వారు.

3) పర్యావరణం :
గ్రీన్ ట్రిబునల్లో పిటిషన్లు, అడ్డుతగలడం తప్పు అని, ప్రభుత్వ వివరణతో పనుల కొనసాగింపు.

4) స్విస్ ఛాలంజ్ :
కోర్టులలో కేసులు... అవాంతరాలు దాటుకొని అసెండాస్ వారితో స్టార్ట్ అప్ ప్రాంత అభివృద్ధికై ముందుకు.

5) ట్రాన్సిట్ సచివాలయం-అసెంబ్లీ:
అసలు వద్దు - 10 సంవత్సరాలు హైదరాబాద్ ముద్దు అంటూ పైపుల కోత దాటుకొని... సీడ్ ఆక్సిస్ రోడ్లు, ఇతర దీర్ఘకాలిక నిర్మాణాలు వైపుకు ప్రయాణం.

6) నిర్మాణానికి నిధులు :
ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కు ఈ ఏపీ క్రింద 90% కేంద్రం బరాయించే నిధులను తప్పుడు ఉత్తరాలతో అడ్డుకోవడం... వాస్తవాలు తెలుసుకొని ప్రపంచ బ్యాంక్ ముందుకు ప్రయాణం.

7) భూసేకరణ:
భూసమీకరణ, భూసేకరణ చట్టం ప్రకారం కావాలనుకునే విధంగా రెచ్చ గొట్టిన వారికి లోబడిన వారికి ఆ నిబంధనలకు లోబడే వెళ్లాలని వెళ్లిన అధికారులకు అడ్డుపడడం, భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చేలోపు ముందుకు వస్తే భూసమీకరణకు ఆయా రైతులకు మరో అవకాశం.

నన్ను అవమానిస్తున్న వారు ఇక్కడ ఉన్నంత వరకు లోటస్ పాండ్ లో అడుగు పెట్టను... నా నగిరి నియోజకవర్గం చూసుకుంటూ అక్కడే ఉండి పోతా... ఏదేమైనా జగన్ అన్నని వదిలే ప్రసక్తే లేదు.... ఇవి రోజా చేస్తున్న శపధాలు...

మీడియా ముందు, మీటింగ్లలోనూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడే రోజా, నంద్యాల, కాకినాడ ఫలితాలు తరువాత ఎక్కడా కనిపించటం లేదు... నంద్యాల ఓటర్ల దెబ్బకు చంద్రబాబు అబ్బా అంటాడు అని రోజా అన్న మాటలతో, నంద్యాల ప్రజలు రోజాకి తగిన స్థానం చూపించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న రోజాకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అప్పటి నుంచి రోజా ప్రజల ముందుకి రాలేక, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మొహం చాటేసే పరిస్థితివచ్చింది.

అయితే, ఇక్కడ ఇంకో విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతుంది... రోజాకి ఇలాంటి పరాభవాలు కొత్త కాదని, ఇంకా ఎదో జరిగింది అని ఆరా తియ్యగా, ప్రశాంత్ కిషోర్, కొంత మంది పార్టీ సీనియర్ల కారణంగా, రోజా ఇంకా నియోజకవర్గానికే పరిమితం కానుంది అంటున్నారు.. నంద్యాల, కాకినాడ ఫలితాలకి, రోజాని ప్రధాన కారణంగా ప్రశాంత్ కిషోర్ చూపటంతో, జగన్ ఆదేశాల మేరకు, పార్టీ సీనియర్ నేతలతో క్లాస్ ఇప్పించారు. మీ ప్రవర్తన సరిగ్గా లేదు అని వాళ్ళు చెప్పటంతో, రోజా వాళ్ళ మీదే ఫైర్ అయ్యి, పార్టీ కోసం కష్టపడుతుంటే తనను తప్పుపట్టడం ఏంటి అని రగిలిపోయారు. నిన్న కాక మొన్న, ఎక్కడ నుంచో వచ్చినోడు, జీతం కోసం పని చేసే వాడు, నన్ను నిందిస్తారా అంటూ రోజా ఫైర్ అయిపోతున్నారు...

పార్టీ కోసం, జగన్ కోసం తాను అన్నింటిని భరిస్తున్నానని, నా మీద ఇంత కుట్ర జరుగుతుంటే, వీరంతా ఉంటున్న లోటస్ పాండ్ లో అడుగు పెట్టను అని... నా నియోజకవర్గానికే పరిమితం అయిపోతాను అని... కాని, జగన్ అన్నని అస్సలు వదిలి పెట్టను అంటున్నారు రోజా... మరి ప్రశాంత్ కిషోర్ ఎలా స్పందిస్తారో చూడాలి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించింది... శ్రీకాకుళం జిల్లా నేతలు, అధికారుల శ్రమ వృధా కాలేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో వంశధార పనులు జోరుగా కొనసాగిస్తున్న వేళ, మరో మంచి పరిణామం చోటు చేసుకుంది.. వంశధార నది పై నేరడి వద్ద బ్యారేజి అనుమతి ఇవ్వటం శ్రీకాకుళం జిల్లా వాసుల్లో ఆనందం నింపింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఇదే తేడా... అధికారులకి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ, బలమైన వాదనలు వినిపిస్తూ, ఐదున్నర దశాబ్దాల తరువాత విజయం సాధించారు..

ఒడిషా సరిహద్దుల్లో దశాబ్దాల తరబడి నెలకొన్న నేరడి ప్రాజెక్టు విషయంలో ట్రిబ్యునల్ తుది తీర్పు చెప్పింది. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మించుకోవచ్చునని ట్రిబ్యునల్ తుది తీర్పు చెప్పింది. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఒడిషా ప్రభుత్వం సేకరించాలని చెప్పింది. నలుగురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా నెలకొన్న వివాదానికి తెరబడింది. నేరడి ప్రాజెక్టు పూర్తి అయ్యేంతవరకు, అంతకుముందున్నటువంటి కాట్రగడ్డ సైడ్ వ్యూవర్ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్ అంగీకరించింది.

గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్కగట్టిన ట్రైబ్యునల్‌, ఈ నీటిని ఏపీ, ఒడిసా రాష్ట్రాలు 50: 50 నిష్పత్తిలో సమానంగా వాడుకోవాలని సూచించింది. నేరడి బ్యారేజీ ద్వారా ప్రతియేటా జూన్‌ 1 నుంచి నవంబరు 30 వరకు.. అంటే మొదటి పంట కాలంలో నీటిని తోడుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు ట్రైబ్యునల్‌ అనుమతి ఇచ్చింది.
బ్యారేజీ నిర్మాణానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా నీటిని తోడుకోవడానికి కాట్రగడ్డ దగ్గర సైడ్‌వేవియర్‌ నిర్మించుకోవడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లావాసులకు సుమారు 50 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది. సుమారు 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే..

ఈ ఫిర్యాదులు అందిన నేపద్యంలో ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి రాజధాని ప్రాంతంలో బుధవారం పర్యటించింది. రాజధాని నిర్మాణానికి రైతుల నుండి వచ్చిన వినతులపై సుదీర్ఘ సమావేశం నిర్వహించింది.

రాజదాని నిర్మాణానికి ప్రభుత్వ రుణం నిమిత్తం ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి చేసిన సమయంలో ఈ పర్యటన జరగడం సర్వత్రా ఆసక్తికరంగా వూరింది. ముందుగా నేలపాడు గ్రామంలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. తుళ్లూరు మండలం నేలపాడులోని పంట భూములలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద రైతుల అభిప్రాయాలు విన్నారు. బహిరంగ సభ మాదిరిగా ఏర్పాటు చేసిన ఆ ప్రాంతంలో మాట్లాడిన రైతులంతా రాజధాని నిర్మాణానికి తాము ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చామని స్పష్టంచేశారు.

రైతులంతా ముక్తకంఠంతో చంద్రబాబు సర్కారుకు తమ మద్దతు తెలియజేశారు. ప్రపంచ స్థాయి రాజధానిలో తామంతా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన భూ సమీకరణకు తామంతా ఇష్టంగానే భూములిచ్చామని స్పష్టం చేశారు. కొందరు రాజధానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, ఇటువంటి తప్పడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. రాజధాని వ్యతిరేకులు అతి కొద్ది మంది ఫిర్యాదులు చేయటంతో 95 శాతం మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, అపోహలు నమ్మవద్దని బృందానికి సూచించారు. పంట భూములు ఇచ్చిన తమను సీఎం అన్ని విధాలుగా ఆదుకున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు రైతులు తెలిపారు.

అన్నీ విన్న తరువాత స్థానిక రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రపంచ బ్యాంకు బృదం ప్రసంగించింది. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రపంచ బ్యాంకు ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తామని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read