విజయవాడ దుర్గగుడి ముందు ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నిమిత్తం నాలుగు నెలల పాటు ఆ మార్గాన్ని మూసి వేస్తున్నారు. ఈ ఆంక్షలు నాలుగు నెలల పాటు అమల్లో ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లిస్తారు.

గొల్లపూడి, పున్నమిఫూట్, భవానీపురం వైపు నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్ మీదుగా చిట్టినగర్ మార్కెట్ వైపు రావాలి.

గొల్లపూడి, కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్ నుంచి చిట్టినగర్, ఎర్రకట్ట, బీఆర్టీఎస్ రోడులో వెళ్లాలి.

గొల్లపూడి, కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్ పైపుల రోడు, ఆంధ్రప్రభ కాలనీ, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా బుడమేరు వైపు వెళ్లాలి.

పోలీసు కంట్రోల్ రూం నుంచి గొల్లపూడి వైపు వెళ్లే వాహనాలు పోలీసు కంట్రోల్ రూం, కేఆర్ మార్కెట్, చిట్టినగర్, సితార, గొల్లపూడి మీదుగా వెళ్లాలి.

ఏలూరు రోడ్డు , బుడమేరు, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్, ఆంధ్రప్రభ కాలనీ, వైవీరావు ఎస్టేట్ మీదుగా గొల్లపూడి చేరుకోవాలి.

హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలి.

హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కందులపాడు క్రాస్ రోడ్డు, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి లేఅవుట్, పాముల కాలువ, వైవీ రావు ఎస్టేట్, రామవరప్పాడు రింగ్ నుంచి బెంజి సర్కిల్ వారధి మీదుగా వెళ్లాలి.

గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు వారధి, బెంజి సర్కిల్, రామవరప్పాడు రింగ్, వైవీరావు ఎస్టేట్, పాముల కాలువ, జక్కంపూడి లే అవుట్, కె.తాడేపల్లి, కందులపాడు క్రాస్ రోడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలి.

హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే భారీ వాహనాలు నార్కెట్పల్లి, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల సత్తెనపల్లి మీదుగా వెళ్లాలి.

చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్పల్లి మీదుగా వెళ్ళాలి.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు దేవరపల్లి, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మం, సూర్యాపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

విశాఖపట్నం నుంచి చెన్నైకు వెళ్లే వాహనాలు జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, బాపట్ల, ఒంగోలు మీదుగా వెళ్లాలి.

durga floyver 12092017 1

ఆన్ని రకాల ఆటలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నం నోవోటెల్ లో నిర్వహించిన 4వ ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంటును ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో ఆఫ్రో ఆసియన్ గేమ్స్ ను, కామన్వెల్త్ క్రీడలను ఘనంగా నిర్వ హించామని గుర్తు చేశారు. భారత దేశంలో ప్రస్తుతం క్రికెట్ పై మక్కువ ఎక్కువగా వుందని, మిగిలిన క్రీడలను కూడ ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో క్రీడలకు ఉత్తమ మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్టు తెలిపారు. అమరావతిలో స్నూకర్ స్టేడియంను నిర్మిస్తామన్నారు. సంతోషమే సూచిగా పనిచేస్తామని, క్రీడలు, కల్చరల్ కార్యక్రమాలతో సంతోషం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించే స్థాయికి చేర్చుతామన్నారు.

భారత స్నూకర్ పెడరేషన్ ఆద్యక్షుడు కెప్టెన్ పి.వి. కె.మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుతం స్నూకర్ లో టాప్ 64 మంది క్రీడాకారులు పాల్గుంటున్నారని, అందులో 6 గురు వరల్డ్ ఛాంపియన్స్ అని చెప్పారు.

చంద్రబాబు ఈ సందర్భంగా స్నూకర్స్ ఆడారు, మీరూ చూడండి...

కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు-కొమటోళ్లు' అనే పుస్తకం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ పుస్తకంలో ఏముంది, ఆర్యవైశ్యుల అభ్యంతరాలు ఏమిటి అనే దాని పై ఆంధ్రప్రదేశ్ డీజీపీ నండూరు సాంబశివరావుతో, ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.

కులాలమధ్య చిచ్చుపెట్టే అంశమేదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించారు. ఒక కులాన్ని, మతాన్ని కించపరచటం, మనోభావాలని దెబ్బతియ్యటం, తద్వారా సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టటం, మంచిది కాదన్నారు..

అంతే కాకుండా, ఆర్యవైశ్యుల నుంచి విజ్ఞప్తులు వస్తే కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని మన రాష్ట్రంలో, నిషేధించే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు ఫలితాల కన్నా ముందే, ఖచ్చితమైన సర్వే ఫలితాలు చెప్పే ఆంద్ర ఆక్టోపస్, లగడపాటి రాజగోపాల్ ని నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమావేశం ఎందుకు జరిగింది అని అడిగితే, అసలు విషయం చెప్పకుండా సీఎం గారు పిలిచారు అందుకే వచ్చానంటూ అమరావతిలో విలేకరులతో చెప్పారు లగడపాటి. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.

అమరావతి వచ్చి ముఖ్యమంత్రిని కలవటం, ఇది రెండో సారి... టీడీపీ లో లగడపాటి చేరతారని, ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.. అలాంటి ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లగడపాటిని, ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించటం, సర్వత్రా చర్చ అయ్యింది... తెలుగుదేశంలో దసరా తరువాత జాయిన్ అవుతారు అనే పుకార్లు వస్తున్నాయి.

మరో వైపు, నంద్యాల, కాకినాడ విజయంతో వచ్చిన ఊపు కొనసాగించడానికి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు జరిపితే, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి, ఓ సర్వే జరపమని లగడపాటిని పిలిచారు అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.

Advertisements

Latest Articles

Most Read