ఆంధ్ర యూనివర్సిటీ ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ విడుదల చేసిన ర్యాంకులో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రథమంగా నిలిచింది. గత ఏడాది మాదిరిగా 801 నుంచి 1,000 ర్యాంకుల శ్లాబ్‌లోనే ఉన్నప్పటికీ గతం కంటే కొంత మెరుగైన పరిస్థితిని పొంది రెండు రాష్ట్రాల్లో అగ్రగామి అయ్యింది. పరిశోధనలు, బోధన, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, ప్రాంగణ ఉద్యోగాలు, మౌలిక వసతులు తదితరాలను ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకుల జారీ జరిగింది. టిహెచ్‌ఇ సర్వే ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నింటా మెరుగైన స్థితిలోనే ఏయూ కొనసాగింది.

అవుట్ లుక్‌లోను మొదటి స్థానం..
అవుట్ లుక్‌ నిర్వహించిన సర్వేలోను రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకు పొందిందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుత టైమ్స్‌ హయ్యర్‌ ర్యాంకులలోను మొదటిగా నిలిచాం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలోను దేశవ్యాప్తంగా 43వ ర్యాంకు పొందాం. ఎన్‌ఆర్‌ఐఎఫ్‌లోను మెరుగైన స్థితిలోనే ఉన్నాం. రానున్న రోజుల్లో ఫాకల్టీ నియామకాలు పూర్తయితే స్టూడెంట్ ఫాకల్టీ నిష్పత్తి మెరుగు కావడం వల్ల ర్యాంకుల్లో మరింత ముందుకు వెళ్తామని వీసీ ఆచార్య నాగేశ్వరరావు తెలిపారు.

ఏ రాజకీయ పార్టీ అయినా, గెలుపు అనేది ఫైనల్ టార్గెట్... ఇక్కడ చంద్రబాబు పాజిటివిటీతో ముందుకు వెళ్తున్నారు... ప్రజలకు ఏమి చేసేమో తెలియచేస్తూ, ఇంకా ఏమి చెయ్యాలో తెలుసుకోవటం కోసం, ఇంటింటికి తెలుగుదేశం ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది... దీని కోసం, చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ హైలైట్... నిజానికి చంద్రబాబు ఎంతో చేస్తున్నా, తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న మంచి ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఫెయిల్ అవుతున్నారు... అదే విధంగా, ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నా, తిప్పి కొట్టలేక పోతున్నారు... ప్రతి దానికి చంద్రబాబు స్పందిచే దాకా సీరియస్ గా తీసుకోవట్లేదు... మరి కొంత మంది వ్యవహార శైలి మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది... వీటన్నిటికి సరైన సమాధానమే, చంద్రబాబు స్పీచ్ ఇదే...

ఇంటింటికి వెళ్లాలి, ప్రతి ఒకరిని పరామర్శించాలి, వాళ్ల యోగ క్షేమాలు తెలుసుకోవాలి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో విచారించాలి. ఎంత బాగా చేశారు అనే కాకుండా ఎంత సమర్ధంగా ప్రజలకు దగ్గర అయ్యారు అనేదే ప్రాధాన్యం.సెప్టెంబర్ 11న శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో నేను పాల్గొంటాను.

ఇది బల ప్రదర్శన కోసం కాదు, ప్రజా సేవకు మనం వెళ్తున్నాం. కష్టాల్లో ఉన్నా, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ 3ఏళ్లలో ఎన్నో చేశాం. ఇంకా సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం. ప్రజల్లో మనపట్ల ఉన్న సానుకూలత కాంక్రీట్ చేసేందుకే ఇంటింటికి వెళ్తున్నాం. ఆధిపత్యం చూపడానికి కాదు,ఇగో ప్రదర్శించడానికి కాదు. ఇన్ని కష్టాలలో కూడా పనులు చేస్తున్నాం కాబట్టే ప్రజల్లో 80% సంతృప్తి ఉంది, సానుకూలత ఉంది. దానిని మరింత పెంచుకోవడమే మన విధి.
మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిదికాదు,మనపై వ్యతిరేకత ఉన్నవారి మనసులు కూడా గెలుచుకోవాలి. మన వినమ్రత,మన భాష,మన సేవాభిలాష ప్రజల మెప్పు పొందేలా ఉండాలి. ఏరోజు ఏ గ్రామంలో కార్యక్రమం జరిగేది ముందే షెడ్యూల్ ఇవ్వాలి. ఇళ్ల స్థలం కావాలా, పక్కా ఇల్లు కావాలా,గ్యాస్ కనెక్షన్ కావాలా, పింఛన్ కావాలా, అని ప్రతి ఒకరిని ప్రశ్నించి వాళ్ల అవసరాలను గుర్తించాలి. ప్రత్యేక యాప్ లో వాటిని నమోదుచేయాలి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత నాయకులు అందరిపై ఉంది.

మన బలహీనతలు ఎదుటివాళ్లకు బలాలు కాకూడదు. బలహీనతలు వదులుకోవాలి, బలాలు పెంచుకోవాలి. ఎవరికీ లేని ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సంస్థాగత, వ్యవస్థాగత బలం మనపార్టీకి ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
మంత్రి పదవి ఇవ్వలేదని దుష్ప్రచారం చేసి ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని చూశారు. కాని మనం చేసిన పనులవల్లే ముస్లింలు మనకు దగ్గర అయ్యారు. బడ్జెట్ కేటాయింపులు రెండు రెట్లు చేయడం, ఇమాంలు,మౌజన్ లకు జీతాలు, ‘దుల్హన్’ కింద పేద ముస్లిం ఆడపిల్లల వివాహానికి రూ.50వేలు ఆర్ధిక సాయం,హజ్ యాత్రకు పంపడం,హజ్ భవన్ నిర్మాణం,ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు ఫరూక్, నౌమన్ లకు ఉన్నత పదవులు ఇవ్వడం ద్వారా ముస్లింలలో సానుకూలత రెట్టింపు అయ్యింది. ఒకవైపు మందా కృష్ణ ద్వారా మాదిగలను రెచ్చగొట్టడం, మరోవైపు ముద్రగడ పద్మనాభం ద్వారా కాపులను దూరం చేయాలని చూడటం వంటి పన్నాగాలు ఎన్నో పన్నినా ప్రతిపక్షం కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టారు.

రాంగ్ నోషన్స్ వల్ల ఎలా దెబ్బతింటారో నంద్యాల ఫలితమే ఉదాహరణ. ఎమ్మెల్యే కావాలని ఆశపడి ఉన్న ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు,వచ్చే ఛైర్మన్ పదవిని వదులుకున్నారు,ఎమ్మెల్యే కాలేకపోయారు అని శిల్పా బ్రదర్స్ నుంచి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నంద్యాల,కాకినాడ ఘనవిజయం దరిమిలా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థానంలో కూడా గెలుపు మనకు కష్టంకాదు. అన్ని స్థానాల్లో గెలుపును నంద్యాల,కాకినాడ నల్లేరు మీద నడక చేశాయి. నంద్యాలలో కొత్తకుర్రాడు, ముఖమాటస్థుడు, అయినా ఇంత ఘనవిజయం సాధ్యం అయ్యిందంటే దానికి ప్రభుత్వంపై ఉన్న సానుకూలతే కారణం.

ఉరవకొండలో జరిగిన ‘జలసిరికి హారతి’కి ఊహించని విధంగా ప్రజల్లో స్పందన వచ్చింది. ప్రభుత్వంపై సానుకూలత వల్లే అటు రాయలసీమ (నంద్యాల), ఇటు ఉత్తరాంధ్ర (కాకినాడ) రెండుచోట్ల 16% ఆధిక్యత సాధించ గలిగాం. విజయాలకు అందరూ యాజమాన్యం వహిస్తారు కాని వైఫల్యాలను ఎవరూ తీసుకోరు, అయితే విజయం ఉత్సాహంతోపాటు బాధ్యతను రెట్టింపు చేస్తుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించడం తథ్యం.
మనకు లక్ష్యం ఉండాలి. దానిని సాధించేందుకు తగిన కార్యాచరణ ఉండాలి. ఆబ్లిగేషన్స్ కింద పనిచేయవద్దండి,ఒక ప్యాషన్ గా పనిచేయాలి,ఒక ప్రైడ్ తో పనిచేయాలి. ప్రజా సేవ చేయగలిగితేనే పదవులు తీసుకోవాలి.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్దిరేటు 11.72% వచ్చింది. వ్యవసాయం అనుబంధ రంగాలలో 27.60% వృద్ది సాధించగలిగాం. హర్టీకల్చర్ రంగంలో వృద్దిని 35%కు తీసుకెళ్లాల్సివుంది. కోటిఎకరాల్లో పండ్లతోటల సాగు జరగాలి, ప్రస్తుతం కంటే రెండున్నర రెట్లు పెరగాలి. సూక్ష్మసేద్యం కోటి ఎకరాలకు విస్తరించాలి, ప్రస్తుతం కంటె 5రెట్లు పెరగాలి. మత్స్యపరిశ్రమకు కాలుష్య బెడద ఉందికాని ఉద్యానరంగానికి ఆ సమస్యలేదు. సాగునీటి భద్రత కల్పించేందుకే మూడు నెలల్లో 28ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సాగునీటి వసతులు పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేల ఆదాయం రావాలి. అందుకే అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నాం.పుట్టుక నుంచి చనిపోయే వరకు వ్యక్తి అన్నిదశల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అందుకు ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలి.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రముఖ యూనివర్సిటీ రానుంది. ప్రతిష్టాత్మిక అమృత యూనివర్సిటీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. అమృత విశ్వవిద్యా లయం బిల్డింగ్ ప్లాన్‌కు సీఆర్డీయే ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు.

విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు తమ అమరావతి క్యాంపస్‌కు సంబంధించిన ప్లాన్‌తో కూడిన దరఖాస్తును సమర్పించగా, అవి నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రాన్ని సీఆర్డీయే మంజూరు చేసింది.

నిన్న సీఆర్డీయే కార్యక్రమంలో ఓపెన్‌ ఫోరంలో మొత్తం 22 దరఖాస్తులు అందగా, వాటిల్లో నిబంధనలను పాటించిన 15కు అధికారులు అనుమతులిచ్చారు. మరో 4 దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. మిగిలిన మూడింటిని తిరస్కరించారు.

ముఖ్యామంత్రి చంద్రబాబు, ముద్రగడ పై సూపర్ పంచ్ వేశారు... ఇలాంటి వాటికి దూరంగా ఉండే బాబు, సరదాగా ముద్రగడకి చురక అంటించారు... మొఖమాటాలకి ఇక సెలవంటూ, పంచ్ పేల్చారు...

ఇటీవల ముద్రగడ మాట్లాడుతూ, కాకినాడలో నేను ప్రచారం చేస్తే విషయం వేరేలా ఉండేది... చంద్రబాబుకి చుక్కలు చూపించే వాడిని అంటూ, వ్యాఖ్యానించారు.

శుక్రవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముద్రగడ వ్యాఖ్యల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తూ, ముద్రగడకు పంచ్ వేశారు...

జగన్‌తోపాటు ముద్రగడ కూడా ప్రచారానికి వస్తే బాగుండేదన్నారు. ఇద్దరూ కలిసి ప్రచారం చెయ్యల్సింది అని అన్నారు... ఇద్దరికీ తిక్క కుదిరేది అనే అర్ధం వచ్చేలా కామెంట్ చేశారు... చంద్రబాబు సహజ దోరనికి భిన్నంగా వెటకారంగా పంచ్ వెయ్యటంతో, అందరూ నవ్వారు...

Advertisements

Latest Articles

Most Read