పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు తీసుకున్న నిర్ణయాన్ని ట్విట్టర్ లో అభినందించారు... అంటే కాదు, దేశం మొత్తం, ఆదర్శనీయంగా తీసుకుని ఫాలో అవ్వాలి అని, ప్రధానిని కూడా ఆ ట్వీట్ లో ట్యాగ్ చేశారు...

ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న 1100 కాల్‌ సెంటర్, ఎంతో ఉపయోగం అని, ప్రజా సమస్యలు తీర్చటాని ఇది చాలా సులభమైన మార్గం అని కిరణ్ బేడి ట్వీట్ చేశారు. "మినిమమ్‌ గవర్నమెంట్‌ మాగ్జిమమ్‌ గవర్నెన్స్" అంటే ఇదే, ఇలా ఉండాలి అన్నారు..

ఇలాంటి కాల్ సెంటర్, దేశంలోని అన్ని నగరాల్లో ఉండాలి అని, ప్రధానిని ట్యాగ్ చేస్తూ చెప్పారు... మరిన్ని సలహాలు కూడా ఇచ్చారు...మొత్తానికి, చంద్రబాబు మరో సారి, నేషనల్ టాపిక్ అయ్యారు.. దేశంలో ఏ సంస్కరణ వచ్చినా, అది ముందు తీసుకోచ్చేది చంద్రబాబే అని మరోసారి రుజువైంది...

తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు రోజాను సీరియస్ గా తీసుకున్నట్టు ఉంది... రాష్ట్ర ప్రజల కోరిక మేరకు, ఆ మురికి నోటిని ముపించటానికి, ఫైర్ బ్రాండ్ ని రంగంలోకి దించనుంది... ఆవిడే శోభారాణి... ఇది వరకు టీడీపీలోనే కొనసాగారు... తరువాత చిరంజీవి పార్టీలో చేరి ఆ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు.. చిరంజీవి జెండా పీకేసినాక, రాజకీయాలకు దూరంగా ఉన్నారు..

అయితే ఇవాళ హఠాత్తుగా గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ సీనియర్ నేతలు మంత్రి నక్కా ఆనందబాబు,గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమక్షంలో ఆమె టీడీపీలో చేరిపోయారు..

బ‌ల‌మైన మ‌హిళా నేత కోసం, ముఖ్యంగా రోజా లాంటి మహిళను ఎదుర్కోవటానికి, శోభారాణి కరెక్ట్ అంటున్నారు... రోజాకు దీటుగా స‌మాధానం చెప్పేందుకే, ఆమెను పార్టీలోకి తీసుకున్నారు అంటున్నారు... రోజా నోటికి అడ్డు చెప్పే సరైన లీడర్ లేక, రోజా మరింత రెచ్చిపోతుంది అని, ధీటుగా సమాధానం చెప్పే వారు ఉంటే, ఆవిడ కూడా కంట్రోల్ లో ఉంటుంది అని, అప్పుడు అందరికీ మంచింది అని, ప్రజలు కూడా హుందా రాజకీయాలు కోరుకుంటున్నారు అని, రోజా లాగా దిగజారి మాట్లాడకపోయినా, ధీటుగా సమాధానం చెప్తే చాలు అని, తెలుగుదేశం నాయకులు అంటున్నారు....

నదుల అనుసంధానంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇనాస్టక్చర్స్ లిమిటెడ్ తనదైన శైలిలో రికార్డులు సాధిస్తోంది. ఇన్ఫ్రా రంగంలో హైదరాబాద్ కేంద్రంగా దేశ, విదేశాల్లో మేఘా అభివృద్ధి పధంలో దూసుకుపోతోంది. నదుల అనుసంధానంలో మూడు ప్రాజెక్ట్ లను స్వల్ప కాలంలోనే పూర్తి చేసిన ఘనతను ఈ సంస్థ సొంతం చేసుకుంది.

2015లో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి పట్టిసీమ ఎత్తిపోతల పధకం నిర్మా ణంలోనూ మేఘా "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్" లోకి ఎక్కింది. రికారు స్థాయిలో 168 రోజుల్లోనే తొలి విడత కింద కృష్ణా నదికి నీటిని పంపింగ్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు గడువను పొడిగించకుండా 2016 మార్చి 29టి నాటికి పూర్తి చేసి గోదావరి-క్టషా నదుల అనుసంధానంలో సరికొత్త చరిత్రను రాసింది.

మొన్న ఈ సంస్థ నిర్మించిన గోదావరి-ఏలేరులను అనుసంధానం చేసే పరుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి ఒప్పందం లేకపోయినా సీఎం నిర్దేశించిన లక్ష్యం మేరకు స్వాతంత్ర్య దినోత్సవం నాటికి మొదటి దశలో రెండు పంపుల ద్వారా నీటిని గోదావరి నుంచి ఏలేరుకు మేఘా తరలించగలిగింది. ఆరు నెలల్లోనే అడ్డంకులను అధిగమించి మేఘా పనులు పూర్తి చేసింది.

ఇప్పడు తాజాగా ముచ్చుమర్రి (హంద్రీ-నీవా సుజల స్రవంతి) వద్ద మరో స్కీంను పూర్తిచేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామం వద్ద హంద్రీ-నీవా సుజల స్రవంతి మొదటి దశ, రెండో ప్యాకేజీలో భాగంగా మేఘా సంస్థ నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు.

మనం రొజూ ఎన్నో రాజకీయ ఛాలెంజ్ లు చూస్తూ ఉంటాం... నిన్న కాక మొన్న నంద్యాలలో చూసాం, శిల్పా అయితే ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు... జగన్ అయితే కాల్చేస్తా అన్నారు... రోజా అయితే అప్ అండ్ డౌన్ అదరాలి అంది.. చివరకి ఇలాంటి మాటల వల్ల ఏమైందో చూసాం... ముఖ్యంగా ప్రజలకు, రవ్వంత అయినా ఉపయోగం ఉండదు... పేపర్లో న్యూస్ ఐటెం కి, టీవీ లో బైట్ కి, ఫేస్బుక్ లో స్టేటస్ కి మాత్రమే ఇలాంటివి ఉపయోగపడతాయి..

ఇలాంటి రాజకీయ ఛాలెంజ్ లో నుంచే ఈ మధ్య కొన్ని ఛాలెంజ్స్ వస్తున్నాయి.... ఇవి ప్రజలకు ఉపయోగపడే ఛాలెంజ్... మొన్నా మధ్య పులివెందులలో నీళ్లు పారితేగానీ గడ్డం తీయనన్నారు. అన్నట్లుగానే ఆనాటి నుంచి మొన్నటి వరకు ఆయన గడ్డం తీసుకోలేదు... ఆయన చెప్పినట్టుగా పులివెందులకు నీళ్ళు తీసుకెళ్ళి, గడ్డం తీయించుకుని దీక్ష విరమించనున్నారు...

ఇప్పుడు అలాంటే ఛాలెంజ్ ఇంకోటి నెరవేరబోతుంది... శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తాను చేపట్టిన గెడ్డం దీక్షను శనివారంతో ముగించనున్నారు. జిల్లాలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు నిధులు మంజూరు కోసం ఆయన తన అనుచరులతో కలసి ఏప్రిల్‌1న దీక్ష మొదలుపెట్టారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతోపాటు రూ.466కోట్లు మంజూరు చేయడంతో దీక్షను విరమిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. శుక్రవారం తిరుపతి వెళ్లి శనివారం గెడ్డం తీసివేస్తానని శివాజీ పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు దోచుకోవాలి..

Advertisements

Latest Articles

Most Read