రఘురామకృష్ణం రాజు తన సొంత ప్రభుత్వం పై విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. అయితే తాజాగా రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఒక మీడియాతో మాట్లాడుతూ, తమ MLAలకు పార్టీలో విలువే లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక MLA ను బేస్ బాల్ బ్యాట్ పెట్టి కొట్టారని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కొట్టడం కొత్తేమి కాదు అని, ఇది వరకు చీఫ్ సెక్రటరీనే కొట్టబోయారని ఆయన చెప్పు కొచ్చారు. మా పార్టీ అంతా పోకిరీ సినిమా టైపు అని, ఎందుకంటే అందులో అన్నటు గిచ్చితే గిచ్చించుకోవాలి అన్నట్టు మా పార్టీలో కూడా కొడితే కొట్టించుకోవాలి అని అన్నారు. నిజంగా కొట్టారా అని అడిగితే, కొట్టారని టాక్ అని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. ఎందుకంటే రూమ్ లోపలకు వెళ్లి బయటకు వచ్చిన MLA కళ్ళజోడు విరిగిపోయింది,పెదం పగిలింది, రూమ్ లోకి వెళ్లి రాంగానే దానంతట అదే విరిగిపోయిందేమో, పెదం దానంతట అదే పగిలిందేమో నాకు తెలియదు అని వెటకారం చేసారు. లేకపోతే ఆ MLA కళ్ళజోడు ఆయనే విరకోట్టుకున్నాడేమో ,పెదం ఆయనే పగల కొట్టుకున్నాడెమో నాకు తెలియదని రఘురామకృష్ణం రాజు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఎవరు ఆ MLA అని అడిగిన ప్రశ్నకు మాత్రం RRR మాట దాటేసారు. ఆ MLA ఎవరు అన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొట్టింది ఎవరో కూడా తెలియదు మరి.

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఏదో ఒక అనుచిత వాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటారు. అలాగే నిన్న శ్రీకాకుళంలో తమ్మినేని సీతారామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక మీటింగ్లో మాట్లాడిన ఆయన మీ అందరూ సపరేట్ పంచాయితి కావాలని డిమాండ్ చేస్తే జంగాలవలసను ఆమోదించాము. జంగాలవలస అయితే జనాభా ఎక్కువ, అదే కాకుండా అది సెంటర్లో ఉంది, కాబట్టి అన్నిటికి అనువుగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. మాకు అందరూ సమానమే, జంగాలవలస గ్రామానికి మధ్యలో ఉంది కాబట్టే, అందరికి సానుకూలంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈయన మాట్లాడిన ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. పంచాయితీ అయితే సెంటర్లో ఉండాలని చెప్పిన ఈయనకు రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో తెలియదా అని తెలుగు దేశం అభిమానులే కాదు , సామన్య ప్రజలు సైతం ఏకిపరేస్తున్నారు. ఎక్కడో మారుమూలన ఉండే పంచాయితీకి ఇచ్చే విలువ మీరు రాష్ట్ర భవిషత్తు కు కారణమైన రాజధానికి ఇచ్చుంటే, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, ఎంతో మంది నిరుద్యోగులకు బాటలు వేసే వారని కూడా కామెంట్ చేస్తున్నారు.

speaker 07012022 2

వాస్తవంమాట్లాడాలంటే గత మూడేళ్ళ నుంచి AP కి రాజధాని ఏది అనే ప్రశ్నకు ఈ వైసిపి ప్రభుత్వం దగ్గర సమాదానం లేదు, ఈలాంటి ఘనత మన రాష్ట్రానికే దక్కింది అనటంలో సందేహమే లేదు. తమ్మినేని చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే మన అమరావతి కూడా అటు వైజాగ్ కు ఇటు వైపు అనంతపురానికి కూడా మధ్యలోనే ఉంది కదా ? అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది కదా ? మరి అమరావతిని రాజధానిగా ఒప్పుకోవటానికి వైసిపి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అని కూడా ప్రశ్నిస్తున్నారు. పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతిలో కొంతవరకు అభివృద్ధి పనులు చకచక జరిగిపోయాయి. మరి అమరావతిని ఎందుకు ప్రకటించరని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా, రాజధాని అనేది సెంట్రల్ గా లోకేట్ అయి ఉండాలని, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ మూడు ఎక్కడ ఉంటే, అదే రాజధాని అని జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన బీసీ ముఖ్య నేతల సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీల ఆరాధ్య దైవం కీ.శే. నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు త్వరలో ప్రారంభం అవుతున్నాయని, ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాల్లో బీసీలను రాజకీయంగా, సామాజికంగా మరింత ముందుకు తీసుకెళ్లాలా అందరి అభిప్రాయాలు సేకరిస్తాం అని అన్నారు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం అధ్యయనం చేయనున్నాం అని, బీసీల ఐక్యతకు, సంక్షేమానికి, అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా చేసిన కృషి అనిర్వచనీయం అని, బీసీలకు రాజకీయ ఆర్ధిక సామాజిక గుర్తింపు తెలుగుదేశంతోనే సాధ్యమైంది. సాధ్యమవుతుంది అని అన్నారు. ఈ సమావేశంలో శ్రీ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. గత 40 సంవత్సరాలుగా బీసీల రాజకీయ, ఆర్ధిక, సామాజిక పురోబివృద్ధికి పార్టీ ఎంతో ప్రోత్సాహం అందించింది. అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి ప్రకటనను ఉద్ఘాటించారు. టీడీపీ అంటే బీసీ అనేలా ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు. కానీ.. మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డి మోసపూరిత హామీలు, తప్పుడు ప్రచారంతో ఐక్యంగా ఉండే బీసీల మధ్య చిచ్చు పెట్టారు. జగన్ రెడ్డి కుట్రలను, కుతంత్రాలను ఛేదిస్తూ బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్యానంతరం రాజకీయంగా అణగదొక్కబడ్డ బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు కల్పించి వేలాది మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించాం. కానీ.. జగన్ రెడ్డి ప్రబుత్వం రిజర్వేషన్లను కుదించి బీసీల రాజకీయ నాయకత్వంపై గొడ్డలివేటు వేసిందని మండిపడ్డారు. భేటీలో పలు తీర్మాణాలు చేశారు. 1. బీసీలకు విదేశీ విద్య, బీసీ భవన్స్, పూలే స్టడీ సర్కిల్స్, కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు, ఆదరణ పరికరాలు సహా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం. 2. సలహాదారులు, నామినేటెడ్ పదవులు, ఇతర ఛైర్మన్ల పదవుల కేటాయింపు విషయంలో అర్హత, అనుభవం ఉన్న బీసీలకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వకుండా, ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిచ్చి బీసీలను అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత ఉదృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. 3. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం. బీసీ సంఘాల్లోని నేతలంతా వైసీపీ దుర్మార్గాలపై గళం విప్పాలని నిర్ణయించారు. 4.నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను ప్రకటించి బీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలతో కలిసి ఉద్యమించేందుకు కార్యాచరణ. 5. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకుండా దాదాపు రూ.18 వేల కోట్లకు పైగా నిధులు దారి మళ్లించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణమే కార్పొరేషన్ల రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. 6.ఆదరణ పథకం ద్వారా పనిముట్లు పంపిణీ, సగంలో ఆగిపోయిన బీసీ భవన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భేటీలో నిర్ణయించారు. 7. బీసీ జనగణన చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇప్పుడు మరోసారి తీర్మానం చేసినట్లు జగన్ రెడ్డి హడావుడి చేసుకుంటున్నారు. కానీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వంతో పోరాడాలని తీర్మానించారు. సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, కాలవ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బచ్చుల అర్చునుడు, బి.టి.నాయుడు, బీదా రవిచంద్రయాదవ్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, బి.కె.పార్థసారధి, పల్లా శ్రీనివాసరావు, గొల్లా నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వి.కొండబాబు, జయమంగళ వెంకటరమణ, ఆర్.జితేందర్ గౌడ్, ద్వారపురెడ్డి జగదీశ్, గుండుముల తిప్పేస్వామి, బుద్దా వెంకన్న, బచ్చుల పుల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్, నిమ్మల కిష్టప్ప, పంచుమర్తి అనురాధ, శ్రీరాం చినబాబు, వాసంశెట్టి సత్య, గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

అమరావతి భూముల్ని తాకట్టు పెట్టి, వేల కోట్లు అప్పులు పొంది, ఆ సొమ్ముని దిగమింగే క్రమంలోనే అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి, దాని పరిధిలోకి 29గ్రామాలను కాకుండా, కేవలం 19గ్రామాలనే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ వ్యవహారమంతా కూడా రాజధాని రైతుల్ని మరింత మానసిక క్షోభకు గురిచేయడానికేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయకార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! అమరావతి కోర్ కేపిటల్ ఏరియా 29 గ్రామాల్ని 19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ అని కొత్తపేరు పెట్టారు. దాన్ని 19 గ్రామాలకు పరిమితం చేసి, రాజధానిలోనే ఉన్న 10 గ్రామాల్ని గాలికి వదిలేశారు. కేవలం తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకొని.. తాడేపల్లి మండలంలోని 2 గ్రామాలు మంగళగిరి మండలంలోని 4 గ్రామాలు, మరికొన్ని గ్రామాలను పక్కన పెట్టారు. కేవలం రాజధానిని డైల్యూట్ చేయాలన్న దురాలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం అన్ని గ్రామాల రైతులు భూములిచ్చారు. ఎక్కడైనాసరే, ఎవరైనా సరే రైతులు బువ్వపెడితేనే అందరం తినే పరిస్థితి ఉంది. అలాంటి రైతుల్ని మానసికక్షోభకు గురిచేస్తూ, ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. రాజధానిలో ప్రభుత్వం ఏం చేయాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, న్యాయస్థానాల అనుమతి తప్పనిసరని హైకోర్ట్ స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన స్టేటస్ కో ఇప్పటికీ అమల్లో ఉంది. దాన్నిధిక్కరించేలా ప్రభుత్వం ఇప్పుడు 29 గ్రామాలను కాదని, 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ కు శ్రీకారం చుట్టింది. రైతులు ఇచ్చిన భూముల్లో దాదాపు 481 ఎకరాలు, రూ.3,760కోట్లకు పైగా విలువ చేస్తుందని, ఆ భూముల తాకట్టుతో రూ.2,994కోట్లు అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. ఆక్రమంలో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారు కూడా.

481 ఎకరాలు రూ.3,760 కోట్లు అయితే, ఒక్కో ఎకరా దాదాపు రూ.7 కోట్లపైన పలుకుతోంది. అమరావతిని గురించి గతంలో పెద్దపెద్ద మంత్రులు, లావు మంత్రులంతా శ్మశానమని, ఎడారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అదే మంత్రులు, అదేప్రభుత్వం బ్యాంకులకు తాకట్టుపెట్టడానికి తయారు చేసిన డీపీఆర్ లో ఎకరం భూమి విలువ రూ.7 కోట్లని చెప్పారు. ఆ లెక్కన చూసినా, మొత్తం రాజధాని రైతులిచ్చిన 34 వేల ఎకరాల విలువ రూ.2లక్షల38 వేల కోట్లు అవుతుంది. బ్యాంకుల్లో తీసుకున రుణానికి సంబంధించి మొదటి రెండేళ్లు మారటోరియం అప్పుని 481ఎకరాలు అమ్మి తీరుస్తామని చెబుతున్నారు. తరువాత తీసుకునే అప్పులను 18 సంవత్సరాల వరకు దఫదఫాలుగా వాయిదాలు చెల్లిస్తామని, అప్పటికి భూమివిలువ ఎకరా రూ.17 కోట్ల 70లక్షలు అవుతుందంటున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, ప్రధాన మంత్రి మాటల నమ్మి రైతులు 34వేలఎకరాలు ఇచ్చారు. దానివిలువ రూ.2లక్షల38వేల కోట్లను బ్యాంకుకి చూపించి అప్పులు తీసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ ఆవిర్భావం జరిగింది. అంతిమంగా అప్పులు తీసుకొని రైతుల గొంతుకోయాలి. ఇదేగా ప్రభుత్వఆలోచన. అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఆ భూములను మీరు బ్యాంకుల్లో పెట్టి రుణాలెలా తీసుకుంటారు? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? టీడీపీ ప్రభుత్వంలో అప్పులు ఇవ్వవద్దని ఇప్పుడున్న మీరే నాబార్డ్ వంటి సంస్థలకు లేఖలు రాశారు. మరి మీరే ఇప్పుడు ఊళ్లో వాళ్ల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ముందు అమరావతిలో చేయాల్సిన అభివృద్ధి చేయండి. భూములిచ్చినవారికి న్యాయం చేయకుండా ఆ భూములు బ్యాంకుల్లో ఎలా తాకట్టు పెడతారు?

Advertisements

Latest Articles

Most Read