చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డికి, జెడ్పీటీసీ గీతా రెడ్డి భర్త కొండిరెడ్డికి మద్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వైసిపి జెడ్పీటీసీ గీతా రెడ్డి భర్త కొండిరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిపై సంచలన వాఖ్యలు చేసారు. ద్వారకానాథరెడ్డి తాలిబన్‌ల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని, మా నియోజకవర్గానికి వచ్చి మా పైనే దా-డు-లకు పాల్పడుతున్నారని ఆయన, ద్వారకానాథరెడ్డిని తీవ్రంగా విమర్శించారు. ఆయన నియోజకవర్గం పుంగనూరు అయితే ఇక్కడకు వచ్చి పెత్తనం చేస్తున్నారని కొండిరెడ్డి ఆరోపించారు. ద్వారకానాథరెడ్డి ఒక హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారని, తాము పార్టీ కోసమే పని చేసే వాళ్ళమని ద్వారకానాథరెడ్డి లాగా దౌర్జన్యాలు చెయ్యమని కొండిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. అయితే ఇలా విమర్శించిన రెండు రోజులకే పోలీసులు వచ్చి కొండ్రెడ్డిని అరెస్ట్ చేసారు. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని 2008 లో 7 గురిని మోసంచేసారని కొండ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయన ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని మోసం చేసారని, ఎమ్మార్వో ఫోర్జరీ సంతకాలతో మోసం చేసారంటూ ,సెక్షన్ ఐపీసీ 467, 468, 471, 420 సెక్షన్ల కింద కేసు అరెస్ట్ చేసారు. దీంతో మరోసారి వైసిపీ నేతలు అయిన సరే, సొంత పార్టీ అరాచకాలు ప్రశ్నిస్తే, మొన్న గుప్తా లాగే చేస్తాం అనే సంకేతాలు ఇచ్చారు.

kondireddy 02012022 2

అయితే తన భర్త అరెస్ట్ పై పై జెడ్పీటీసీ గీతారెడ్డి మాట్లాడుతూ కొండి రెడ్డి ని రాత్రి పుట వచ్చి అరెస్ట్ చేసారని, ఆయనను జడ్జి ఎదుట రాత్రి పూటే హాజరు పరచి, వెంటనే మదనపల్లె సబ్‌జైలుకు పంపించినట్లు ఆమె తెలిపారు. జైలులో తనభర్త అయిన కొండి రెడ్డికి ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఆయనకు ఏ హాని జరిగినా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, పోలిసులే భాద్యత వహించాలని చెప్పారు. తాము పార్టీ మొదలుపెట్టినప్పటి' నుంచి వైసిపి లోనే ఉన్నామని , వైసిపి ప్రభుత్వం తమకు ఈ సమయమ లో అండగా నిలబడాలని కోరుకుంటున్నామని ఆమె స్పష్టం చేసారు. మానవ హక్కుల కమిషన్‌ను కలిసిదీని పై మాట్లాడతానని కూడా ఆమె చెప్పారు. ఎవరైనా కొండి రెడ్డి కి బెయిలు ఇప్పిస్తే వారిని కూడా చంపేస్తామని ద్వారకానాథరెడ్డి వర్గం బయపెడుతున్నారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద, ప్రతిపక్ష పార్టీ నేతలనే కాదు, తమ జోలికి వస్తే ఎవరినీ కూడా వదిలిపెట్టం అనే వార్నింగ్, గట్టిగా ఇస్తున్నారు వైసిపీ నేతలు..

దేశంలో మళ్ళీ కరోనా రూపు మార్చుకుని, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ తో దూసుకోస్తుంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే 1,700కి చేరుకున్నాయి. ఒమిక్రాన్ బాధితుల్లో 639 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 23 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 361, కేరళలో 156, గుజరాత్‍లో 136  కేసులు , తమిళనాడులో 121కేసులు, రాజస్థాన్ లో 120 , తెలంగాణలో 67, కర్ణాటకలో 64 , హరియాణాలో 63, ఒడిశాలో 37 ఒమిక్రాన్ కేసులు, బంగాల్‍లో 20, ఆంధ్రప్రదేశ్‍లో 17  కేసులు, మధ్యప్రదేశ్‍లో 9, యూపీ, ఉత్తరాఖండ్‍లో 8, చండీగఢ్, జమ్ముకశ్మీర్‍లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, పంజాబ్‍లో 1  ఒమిక్రాన్ కేసు  నమోదయ్యాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తూ ఉండటంతో, అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు కూడా ఈ రోజు నుంచి విర్చ్యువల్ విధానంలో కేసుల వాదనలు వినాలని నిర్ణయం తీసుకుంది. అనేక రాష్ట్రాలు కూడా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు వేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా విడుదల వాయిదా వేసుకున్నాయి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కోరుతున్నాయి.

ఇప్పుడు విజయవాడలో రాజకీయం అంతా టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చుట్టూనే తిరుగుతుంది. తనను హ-త్య చేసేందుకు కుట్ర జరుగుతుందని, తన ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారని రాధా ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం దీనికి స్పందిస్తూ రాధాకు 2+2 భద్రత ఇస్తామని ప్రకటించి, ఆ తరువాత నామ మాత్రంగా ఒక్క గన్ మెన్ ఆఫీస్ కు పంపగా, రాధా తనకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేద,ని తన అభిమానులే తనని కాపాడతారని వాళ్ళని తిప్పిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా రంగా ఇంటికి వెళ్లి పరామర్శించటంతో, బెజావాడలో రాజకీయం మరింత వేడిక్కింది. వెంటనే ఈ కేసుపై విచారణ జరపాలని టిడిపి నేతలు ఒత్తిడి పెంచారు. అయితే తాజాగా విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణ టాటా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేసు గురించి, మాట్లాడుతూ తమకు రాధా హ-త్య కు రెక్కి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదనిఅన్నారు. అయినా ఈ కేసుపై ఇంకా క్షున్నంగా పరిశీలన జరుపుతామని, సీసీటీవీ ఫుటేజీని కూడా గమనిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి అయితే తమకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని సీపీ స్పష్టం చేసారు.

police 222022 1

రాధాతో మాట్లాడామని,అ ఆయన ఇచ్చిన సమాచారం కూడా తీసుకున్నామని అన్నారు. దీని పై మరింత సమాచారం తెప్పించుకుంటామని అన్నారు. అలాగే మొన్న చంద్రబాబు, రాధా ఇంటికి వెళ్ళిన సందర్భంలో చేసిన వ్యఖ్యల పైన కూడా పోలీస్ కమీషనర్ స్పందించారు. అసలు అక్కడ ఎలాంటి నేరం జరగలేదని, ఎలాంటి క్రిమినల్ ఆక్టివిటీ తమకు కనిపించలేదని, అలాంటప్పుడు చంద్రబాబు గారు కోరుతున్నట్టు, తాము జీరో ఎఫ్ ఐఆర్ ఎలా నమోదు చేస్తాం అంటూ, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు, పోలీస్ కమీషనర్. బాధ్యతగా అందరూ ఉండాలని అన్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ ఏజెన్సీలు కూడా విచారణ జరుపుతున్నాయని అన్నారు. ఈ విషయం పై, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అలాగే విజయవాడలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అన్నారు. అయితే పోలీస్ కమీషనర్ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం అవుతుంది. ఒక పక్క రాధా మొత్తం సమాచారం ఇచ్చినా, పూర్తి ఆధారాలు ఇచ్చినా, ఇప్పటికిప్పుడు, తమకు ఆధారాలు దొరకలేదు అని చెప్పటం విస్మయం కలిగించే అంశం.

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పై ఆసక్తి నెలకొంది. ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వైసిపి నేతలు మాత్రం జగన్  రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నారని,  అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తారని చెపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు, జల వివాదాలపై కుడా చర్చిస్తారని, ఆంధ్రప్రదేశ్ విభజన  సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రధానిని కలిసి మాట్లాడతారని, బోర్డులకు సాగునీటి ప్రాజెక్టుల అప్పగింతపై  కుడా చర్చించస్తారని, మీడియాతో చెప్పారు. అయితే మూడు రాజధానుల అంశంపై కూడా  ప్రధానితో చర్చించే అవకాశం  ఉందని , అమరావతి అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై గురించి  కూడా ప్రధానితో మాట్లాడతారని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అమరావతి పై ప్రభుత్వం కన్ఫ్యుజన్ లో ఉంది. దీనికి తోడు అమిత్ షా, తిరుపతి వచ్చిన సమయంలో, అమరావతికి ఫుల్ మద్దతు అని చెప్పటం, తరువాత ఏపి బీజేపీ నేతలు, అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం పైన ప్రధానంగా బీజేపీ నేతల మనసు మార్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి నెల రోజుల క్రిందట అమిత్ షా పర్యటనతో, జగన్ కు సినిమా అర్ధమైంది. మరి ప్రధాని ఎలా స్పందిస్తారో చూడాలి

Advertisements

Latest Articles

Most Read