క‌మ్మ‌రావ‌తి అన్న నోటితోనే వైకాపా నేత‌లు అమ‌రావ‌తి జ‌పం చేస్తున్నారు. సెప్టెంబ‌రులో విశాఖ వెళ్లి కాపురం చేస్తానంటున్న సీఎం అమ‌రావ‌తిలో పేద‌ల‌కి ఇళ్లు ఇవ్వ‌డ‌మే త‌న జీవిత ధ్యేయం అంటున్నారు. అమ‌రావ‌తిలో ఏముంది శ్మ‌శానం అంటూ ప్ర‌వచించిన మంత్రి బొత్స పేద‌ల‌కి ఆ శ్మ‌శానంలోనే ఇళ్లు ఇవ్వ‌డాన్ని గొప్ప‌ఘ‌న‌త‌గా ప్ర‌చారం చేస్తున్నారు. ఆర్-5 జోన్ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత త‌రువాత వైసీపీ నేత‌ల వాయిస్ ఒక్క‌సారిగా మారిపోయింది. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదు - రాజధాని ప్రజలందరిద‌ని హైకోర్టు ధ‌ర్మాస‌నం చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ పెద్ద‌లు అమ‌రావ‌తిపై ప్రేమ కురిపించేస్తున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామంటూ ప్ర‌క‌టించేశారు. వాస్త‌వంగా అమరావతిలో  7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి.. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో టిడిపి ప్ర‌భుత్వం ఇళ్ళ నిర్మాణం చేపట్టింది. మొదటి విడతగా, అమరావతి రాజధాని నగర పరిధిలో 8 చోట్ల మొత్తం 44 ఎకరాల్లో 157 బ్లాకుల్లో 5,024 ఫ్లాట్లు నిర్మాణం మొదలు పెట్టారు. ఇవి 80 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. ఆ త‌రువాత వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు ఈ ఇళ్ల‌ని నిరుపేద ల‌బ్ధిదారుల‌కు ఇవ్వ‌కుండా పాడుబెట్టాయి. అత్యాధునిక షీర్‌వాల్ టెక్నాల‌జీతో, స‌క‌ల సౌక‌ర్యాల‌తో పేద‌ల‌కు క‌ట్టిన ఇళ్లు వారికి అప్ప‌గించ‌కుండా, రాజ‌ధానిలో ఇళ్ల‌ప‌ట్టాలు ఇవ్వ‌డానికి ఎందుకింత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థంకావ‌డంలేద‌ని కొంద‌రు అంటున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానే కాద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అంటున్నారు. త‌న రాజ‌ధాని విశాఖ అని ప్ర‌క‌టించారు. అటువంట‌ప్పుడు అమ‌రావ‌తిలో రైతులు రాజ‌ధానికి ఇచ్చిన భూముల్లో ఏ ల‌క్ష్యంతో పేద‌ల‌కు ఇళ్ల‌ప‌ట్టాలు ఇస్తున్నారో ఆలోచిస్తే, ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇది జ‌గ‌న్ రెడ్డికి ఉన్న అమ‌రావ‌తిపై ద్వేషం, పేద‌ల‌పై కోపం అని..

ఇటీవ‌ల కాలంలో మాంచి ఫామ్‌లో ఉన్న బాట్స్ మెన్ మాదిరిగా ప‌వ‌ర్ హిట్టింగ్‌కి దిగుతున్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు. శ‌ష‌భిష‌లు లేవు. నాన్చుడు అస‌లే లేదు. వార్నింగ్‌లు ఇచ్చేందుకు ఒక్క క్ష‌ణ‌మూ కూడా ఆల‌స్యం చేయ‌డంలేదు. ద‌శాబ్దాల త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్న‌డూ లేని విధంగా సీబీఎన్ యాటిట్యూడ్ చేంజ్ కావ‌డంతో టిడిపిలో న‌వ్యోత్తేజం వెల్లివిరుస్తోంది. దూకుడు, మాట తీరులో వ్యంగ్యం, చాలెంజ్ చేయ‌డంలో ధైర్యం ఇవ్వ‌న్నీ చంద్ర‌బాబులో కొత్త‌గా చూస్తున్నారు నేత‌లు. ఎంత‌గా అణ‌చివేయాల‌ని చూస్తుంటే, అంత‌గా ఎగ‌సిప‌డుతున్నారు. కుప్పంలో ప్ర‌చార‌ర‌థం సీజ్ చేస్తే, వ్యాన్ ఎక్కి స‌వాల్ విసిరారు. అన‌ప‌ర్తిలో కాన్వాయ్‌ని ఆపేస్తే..చీక‌ట్లో కిలోమీట‌ర్ల మేర న‌డిచే స‌భ‌కి చేరుకుని, ద‌మ్ముంటే న‌న్ను అడ్డుకో అంటూ చాలెంజ్ చేశారు. ఇటీవ‌ల గుడివాడలో రోడ్డు షో సంద‌ర్భంగా కొడాలి నాని ఆఫీసు ఎదురుగా వ్యాన్ పై నుంచి త‌ల దువ్వుతూ ఒక న‌వ్వు విసిరి వెళ్లారు సీబీఎన్. మ‌రింత దూకుడుని ప్ర‌ద‌ర్శిస్తున్న సంఘ‌ట‌న‌లు వ‌ర‌స‌గా చూసి టిడిపి లీడ‌ర్లు, కేడ‌ర్ సంతోషంతో గెంతులు వేస్తున్నారు. సిట్ ఏర్పాటు చేస్తారంట అని మీడియా అడిగితే, ఏం పీక్కుంటారో పీక్కోండి పోండి అంటూ తెగేసి చెప్పారు. నేను చాలా క్లీన్‌, న‌న్ను ఈ జ‌గ‌న్ ఏమీ చేయ‌లేడంటూ ధీమా వ్య‌క్తం చేశారు. సాక్షి దాని అనుబంధ మీడియా ఎన్టీవీ, టీవీ9కి వ‌ర‌స‌గా రెండురోజులు పీకిన క్లాసులు చూస్తే ...సీబీఎన్ ఫుల్ ఫామ్‌లోకొచ్చి, వైసీపీతోపాటు బ్లూ మీడియాపై ప‌వ‌ర్ హిట్టింగ్‌కి దిగుతున్నారు.

ఎవ‌రైనా మామూలు వ్య‌క్తులు ఒక‌ట్రెండు రోజులు క‌న‌ప‌డ‌క‌పోతే పేప‌ర్లోనో, సోష‌ల్మీడియాలోనో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తారు. అటువంటిది షాడో సీఎంలాంటి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి గ‌త కొద్దిరోజులుగా క‌న‌ప‌డుట‌లేదు. దీనిపై సీఎం కానీ, ఆయ‌న మంత్రులు కానీ నోరు మెద‌ప‌టంలేదు. ఎందుకంటే ఆయ‌న ఢిల్లీ పెద్ద‌లు అప్ప‌గించిన టాస్కులో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల వైసీపీకి చెందిన కేసుల‌న్నీ ద‌ర్యాప్తు న‌త్త‌న‌డ‌క‌న న‌డ‌వ‌డం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పులు దొర‌క‌డం వంటి కార‌ణాల వెన‌క కేంద్ర బీజేపీ పెద్ద‌ల స‌హ‌కారం ఉంద‌నేది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యం. బీజేపీ-వైసీపీ క్విడ్ ప్రోకోలో భాగంగా బాబాయ్ హ‌త్య‌కేసు, లిక్క‌ర్ కేసు వంటి వాటి నుంచి వెసులుబాట్లు ఇవ్వ‌డం కేంద్రం చేస్తే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఖ‌ర్చు మొత్తం వైకాపా భ‌రించేలా ఒప్పందం జ‌రిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి ఖాయం అని స‌ర్వేల‌న్నీ తేల్చేస్తున్నాయి. వేల‌కోట్లు ఖ‌ర్చు చేసినా బీజేపీ గ‌ట్టెక్కే అవ‌కాశంలేదంటున్నారు. ఈ నేప‌థ్యంలో కోట్ల మూట్ల సాయంతోపాటు పోలింగ్ మేనేజ్మెంట్ లోనూ వైకాపా సాయం బీజేపీ తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏపీలో ఎక్క‌డ ఉప ఎన్నిక‌లైనా పెద్దిరెడ్డి ఓట‌ర్లు, పెద్దిరెడ్డి టూరిస్టులు పెద్ద ఎత్తున దింపుతారు. ఈ ఎక్స్ పీరియ‌న్స్‌ని క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో వాడుకునేందుకు పెద్దిరెడ్డిని బీజేపీ పెద్ద‌లు తీసుకెళ్లార‌ని స‌మాచారం. వేల‌కోట్ల డ‌బ్బుని త‌ర‌లించ‌డంతోపాటు దొంగ ఓట‌ర్ల‌ని త‌ర‌లించే బాధ్య‌త‌లు పెద్దిరెడ్డే చూస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేంద్ర బీజేపీ ఆదేశాల‌తో క‌ర్ణాట‌క‌లో ప‌నిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి చాలారోజులుగా ఏపీలో క‌న‌ప‌డ‌టంలేద‌ని ఆయ‌న పేషీకి వెళ్లిన వాళ్లు చెప్పే మాట‌.

ప్ర‌తీస‌భ‌లో ఒక ముస‌లాయ‌న ఉండేవాడు అంటూ జ‌గ‌న్ రెడ్డి చంద్ర‌బాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం వంటి గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌విలో ఉండి ఆ ముసలాయ‌న ప్ర‌భుత్వం అంటూ బాబుని ఎద్దేవ చేస్తున్నాడు జ‌గ‌న్. ఎన్నిసార్లు ముస‌లాయ‌న అని ఆరోపించినా స్పందించ‌ని చంద్ర‌బాబు.. త‌న‌దైన శైలిలోనే దూసుకుపోతున్నారు. తానెక్క‌డికి వెళ్తే అక్క‌డకి జ‌గ‌న్ అండ్ కో ప‌రుగులు పెట్టేలా చేస్తున్నారు. ఇటీవ‌ల స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌కి వెళ్లారు. అక్క‌డ మంత్రి అంబ‌టి రాంబాబు డ్రైనేజీలో ప‌డి మృతిచెందిన బాధిత కుటుంబానికి రావాల్సిన చెక్ క‌మీష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆపేశారు. ఆ బాధితురాలిని ప‌రామ‌ర్శించి టిడిపి నుంచి సాయం అందించారు బాబు. ఈ చ‌ర్య‌తో ఒక్క‌సారిగా మంత్రి ప‌రువుతోపాటు ప్ర‌భుత్వం ప‌రువూ పోయిన‌ట్ట‌య్యింది. మృతుల కుటుంబాల వ‌ద్ద ప‌రిహారంలో వాటా అడుగుతున్న మంత్రుల తీరుని మ‌రోసారి ప్ర‌జ‌ల ముందుంచారు బాబు. తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న షురూ చేశారు టిడిపి అధినేత‌. ఒక్కో మంత్రి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల‌ని గుంత‌లు క‌ప్పించే ప‌ని, ధాన్యం కొనుగోలు చేయించే ప‌నుల్లో బిజీ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కూ కాన‌రాని అధికారులైతే గ్రామాల్లోకి వ‌చ్చి మ‌రీ అర్ధ‌రాత్రి అయినా రైతుల వ‌ద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇదీ చంద్ర‌బాబు దెబ్బంటే! ముస‌లాయ‌న ముస‌లాయ‌న అంటూ ఆయ‌న‌ని జ‌గ‌న్ రెడ్డి గిల్లాడు. ఆయ‌న కుర్రాడి కంటే స్పీడుగా టూర్లు తిరుగుతూ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారునీ ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

Advertisements

Latest Articles

Most Read