ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రగడ నడుస్తున్న సందర్భంలోనే, ఏపి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఏపి ఆన్లైన్ టికెట్ల పై ముందుకు వెళ్తూ, కీలక అడుగు వేసింది. ఎఫ్‌టీవీటీడీసీ అంటే (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌ టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ను, ఆన్లైన్ టికెట్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ఉత్తర్వులతో, ఆన్లైన్ టికెట్ పోర్టల్ రూపకల్పనతో ఎఫ్‌టీవీటీడీసీ, కార్యాచరణ ప్రరంభించింది. అలాగే పోర్టల్ రూపకల్పనకు సంబంధించి, ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ సంస్థలతో, వివిధ సినిమా ధియేటర్ ల తో, ప్రైవేట్ టికెటింగ్ ఏజెన్సీలతో కుదుర్చుకున్న ఒప్పందాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. అలాగే సాంకేతిక, న్యాయ పరమైన వివాదాలు రాకుండా చూడాలని కూడా ఎఫ్‌టీవీటీడీసీని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మరి కొద్ది రోజుల్లోనే పోర్టల్ అందుబాటులోకి రాగానే, ఆన్లైన్ టికెట్ల వ్యవహారం మొదలు కానుంది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల పై, సినిమాటోగ్రఫీ చట్టాలను సవరణలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు కూడా ఆమోదించింది. దీనికి సంబందించే, ఈ రోజు ఎఫ్‌టీవీటీడీసీని ఆన్లైన్ టికెట్ పోర్టల్ కు సంబంధించి, నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, ఆ పార్టీ శ్రేణులు, అటు సమర్ధించ లేక, ఇటు మద్దతు తెలప లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక అంశం మీద ఎవరైనా మాట మార్చారు అంటే, తెలియక చేసిన తప్పు, సరి చెసుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి అంశం పైనా రచ్చ రచ్చ చేయటం, వెనక్కు వెళ్ళటం, పరి పాటిగా మారింది. ఈ మధ్య కాలంలో మూడు రాజధానుల పై కానీ, శాసనమండలి పై కానీ, అప్పట్లో రకరకాల కారణాలు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో రెచ్చిపోయి గుడ్డలు చించుకుని, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన పేటీయం బ్యాచ్, మళ్ళీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవటంతో, ఎలా సమర్ధించాలో తెలియక తికమక పడుతున్నారు. ఇలా ఒక అంశం అయితే అనుకోవచ్చు, ఈ రోజు తాజాగా మరో అంశం పైన, అది కూడా అతి ముఖ్యమైన అంశం పైన, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గటంతో, అసలు ఈ నిర్ణయాన్ని ఎలా సమర్దిన్చాలో తెలియక, వైసీపీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తిప్పిన మడమ తిప్పుడు ఏమిటి అంటే, గత ఎన్నికల్లో ఆడ వారి ఓట్లు దండుకున్న మద్య నిషేధం అంశానికి సంబంధించిన, మడమ తిప్పుడు గురించి.

jagan 19122021 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ, తాజాగా మద్యం పైన 20 శాతం వరకు ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంకా ఇంకా మద్యం అమ్మకాలు పెంచటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మొన్నటి దాకా మద్యం ధరలు పెంచి, ధరలు షాక్ కొట్టే విధంగా పెంచామని, దీంతో తాగటం మానేస్తారని జగన్ చెప్తే, దానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రాచారం కల్పించాయి. నేడు అదే జగన్ ప్రభుత్వం, మద్యం రేట్లు తగ్గించింది అంటే, దానికి ఏమి జవాబు చెప్పాలి ? ఎక్కువ తాగటానికి ధరలు తగ్గించారా అని సమాధానమే వస్తుంది. ఇక మరో పక్క, పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా అవుతుందని, అలాగే గ్రామాల్లో నాటు సారా ఎక్కువగా ఉంటుందని, అందుకే రేట్లు తగ్గిస్తున్నాం అని చెప్పటం, ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి. అంటే అక్రమ రవాణాని, నాటు సారాని ప్రభుత్వం అరికట్టలేక పోతుందని ఒప్పుకున్నట్టే కదా ? ఇవన్నీ చూస్తున్న వైసీపీ శ్రేణులు, ఎలా దీన్ని సమర్ధించాలో అర్ధం కాక, తల బాదుకుంటున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే సామాన్య ప్రజలకు ఫ్రీ దర్శనం, రూ.300 దర్శనం, మరి కొన్ని సేవల పేర్లు తరచూ వింటూ, ఆ సేవల్లో పాల్గునటం తెలుస్తూ ఉంటుంది. విఐపిలకు కొంత వెసులుబాటు ఉంటుంది, కాబట్టి సుప్రభాత సేవ లాంటి వాటిల్లో పాల్గుంటారు. సామాన్యంగా, శ్రీవారికి కోటి విరాళం ఇచ్చారు, కోటి విలువైన ఆభరణాలు ఇచ్చారు లాంటి వార్తలు వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు శ్రీవారికి నిర్వహించే ఒక సేవకు సంబంధించి, టిటిడి టికెట్ ధర నిర్ణయించింది. ఉదయాస్తమాన సేవాకు సంబంధించి, టిటిటి టికెట్ ధర నిర్ణయించింది. ఉదయాస్తమాన సేవా టికెట్లు, సాధారణ రోజుల్లో అయితే రూ. కోటి, శుక్రవారం రోజున అయితే రూ.1.5 కోట్లుగా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు విరాళం అందించే దాతలకు, ఉదయస్తమాన సేవా టికెట్లను కేటాయించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. మొత్తం 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఉంటాయి, రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని టిటిడి అంచనా వేసింది. అయితే ఈ ఆదాయంతో, చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేయాలని టిటిడి నిర్ణయంచింది. ఉదయాస్తమాన సేవ టికెట్ కొంటే, సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్నింటిలో పాల్గొనే అవకాశం టిటిడి ఇచ్చింది.

నిన్న ఒంగోలుకు చెందిన గుప్తా అనే వైసీపీ నేత మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక వైసిపీ పని అయిపొయింది అనే విధంగా మాట్లాడుతూ, కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి, అంబటి లాంటి వెధవల వల్ల, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, రేపు ఓడిపోతే, ఇలాంటి వారి వల్ల, మనలను రోడ్డు మీద ఉరికించి టిడిపి వాళ్ళు కొడతారని, ఆయన వాపోయారు. ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్య కూడా, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుల మనుసల్లో ఉన్న మాటగానే అందరూ చెప్తున్నారు. ఈ గుప్తా అనే ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, 20 ఏళ్ళుగా అనుచరుడిగా కొనసాగుతున్నాడు. అలాగే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో, ప్రకాశం జిల్లాలో గుప్తా చాలా చురుగ్గా పాల్గున్నారు. వైసీపీకి వీరాభిమానిగా అతనికి గుర్తింపు కూడా ఉంది. అయితే ప్రస్తుతం, తాజాగా చర్చిస్తున్న అనేక పరిణమాల నేపధ్యంలో, జగన్ కు, బాలినేనికు ఉద్దేశిస్తూ, తనకు ఉన్న భావాన్ని, ప్రజల్లో వైసీపీకి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను, వేదిక మీదుగా, మొత్తం భావాలను వ్యక్తపరిచారు. అయితే వైసీపీ సెకండ్ గ్రేడ్ లీడర్లు, ఇది నిజమే అని, పార్టీ మారాలని అనుకుంటే, వైసీపీ పెద్దలు మాత్రం తట్టుకోలేక పోతున్నారు. తమ జోలికి వస్తే, సొంత కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయని, వైసిపీ మార్క్ చూపించారు.

attack 19122021 2

నిన్న రాత్రి కొంత మంది దుండగులు, గుప్తా ఇంటికి వెళ్ళి, విధ్వంసం సృష్టించారు. జై కొడాలి, జై అంబటి అనుకుంటూ అతని ఇంటికి వెళ్లి, ఇల్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసారు. అక్కడే ఉన్న గుప్త భార్యకు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదని ఆమెను హెచ్చరించి, ఆమెను కూడా దుర్భాషలాడారు. అలాగే కిందకు వెళ్తూ, గుప్తా ద్విచక్ర వాహనాన్ని కూడా ధ్వంసం చేసారు. అయితే ఈ దా-డి సమయంలో గుప్తా ఇంట్లో లేరు. అయితే ఇప్పటికీ గుప్తా ఇంటికి రాకపోవటంతో, ఆయన భార్య ఆందోళన చెందుతుంది. గుప్తా అదృశ్యం అవ్వటం పట్ల, ఆమె ఆందోళన వ్యక్తం చేస్తుంది. తన భర్త ఆచూకీ కోసం ఆమె ఎదురు చూస్తుంది. అయతే ఇంటి మీదకు వచ్చింది ఎవరు ? ఎవరు పంపించారు ? అనే అంశం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు గుప్తా తరుపు కుటుంబ సభ్యులు మాత్రం, పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మొత్తానికి వైసీపీ మార్క్ ఎలా ఉంటుందో, ఈ రాష్ట్రానికి మళ్ళీ చూపించారు, వైసీపీ నేతలు. తమ జోలికి వస్తే, ఎలా ఉంటుందో, మరో సాంపిల్ చూపించారు.

Advertisements

Latest Articles

Most Read