రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త అయిన సంతోష్, రాములు, వీరి ఇద్దరినీ కూడా సిఐడి పోలీసులు, సోషల్ మీడియాలో జగన్ ను దుషిస్తూ పోస్టింగ్ లు పెట్టారని, రెండు రోజుల క్రిందట అరెస్ట్ చేసారు. సంతోష్ సతీమణి, హాస్పిటల్ లో డెలివరీకి ఉండగా, ఆమె పక్కనే ఉన్న సంతోష్ ని అరెస్ట్ చేసి తీసుకుని రావటం పట్ల, అక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మల్యే బుచ్చయ్య చౌదరి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు అరెస్ట్ కు ఆయన అడ్డు పడ్డారు. అయినా కూడా సిఐడి అధికారులు, వారి ఇద్దరినీ అరెస్ట్ చేసి, విజయవాడకు తీసుకుని వచ్చారు. అయితే వారి ఇద్దరినీ ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. ఈ రోజు వారిని కోర్టులో హాజరు పరిచే సమయంలో, తెలుగుదేశం పార్టీ సోషల్ మెదిఆ కార్యకర్తల తరుపున, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించారు. 24 గంటలు కంటే, వారి ఇద్దరినీ కస్టడీలో ఉంచుకోవటం, అలాగే బలవంతంగా వసూళ్ళు చేసారని చెప్పి, వారి పైన కేసులు నమోదు చేయటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు కోసం అరెస్ట్ చేసి, బలవంతపు వసూళ్లు సెక్షన్ ఎలా ఆపదిస్తారని కూడా వాదనలు వినిపించారు. అలాగే 24 గంటల కంటే ఎక్కువ, సేపు పోలీస్ కస్టడీలో ఉంచటం పట్ల, న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
అంతే కాకుండా దార్యప్టు అధికారికి , ఈ సంఘటన పైన వివరణ ఇవ్వాలని కూడా, మేమో జారీ చేసారు. ఇక దీంతో పాటుగా, బలవంతపు వసూళ్లు సెక్షన్ ఏదైతే నమోదు చేసారో, ఆ సెక్షన్ చెల్లదని న్యాయమూర్తి చెప్తూ, సిఐడి పోలీసులకు షాక్ ఇచ్చారు. అలాగే సంతోష్, రాములు, వీరి ఇరువురికీ కూడా బెయిల్ మంజూరు చేసారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అయితే ఈ కేసులో వాదనలు వినిపించిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, మాత్రం బలవంతపు వసూళ్లు సెక్షన్, కేవలం వాళ్ళని పది ఏళ్ళు శిక్ష పడే సెక్షన్ కావటంతో, వాళ్ళని జైల్లో ఉంచటం కోసమే ఈ సెక్షన్ ఆపాదించారని చెప్పారు. అసలు ఈ బలవంతపు వసూళ్లు సెక్షన్ వీళ్ళకు ఎందుకు ఆపాదించారని ప్రశ్నించారు. దీంతో ఆయన వాదనలతో న్యాయవాది ఏకీభవించారు. ఏకీభవించిన అనంతరం, వాళ్లకు బెయిల్ మంజురు చేయటంతో పాటుగా, బలవంతపు వసూళ్లు సెక్షన్ కూడా చెల్లదని చెప్పారు. దీంతో పాటు దర్యాప్తు అధికారికి కూడా మెమో జారీ చేసారు.