ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కాకినాడలో, భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రమే చొరవ తీసుకోవాలని, ఏపి విభజన చట్టంలో స్పష్టం చేసారు. ఆ మేరకు కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి అంటూ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. దానికి సంబందించిన సాధ్యా సాధ్యాల పైన కూడా అధ్యయనం జరిగింది. రూ.32,901 కోట్ల వ్యయంతో, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు, అప్పటి ప్రభుత్వంతో, గెయిల్, హెచ్‌పీసీఎల్‌ లు కూడా ఒప్పందం చేసుకున్నాయి. 2017 జనవరి 27న ఒప్పందం చేసుకున్నాయి. అయితే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ విషయంలో, గెయిల్, హెచ్‌పీసీఎల్‌ తరువాత మెలిక పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో లాభ నష్టాలకు సంబంధించి ఏమైనా గ్యాప్ వస్తే, ఆ గ్యాప్ ని మాత్రం, రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని, ఆ కంపెనీలు ప్రతిపాదన పెట్టాయి. ఏపి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలి అంటే, ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భరించాల్సి ఉంటుందని, ఆయిల్ కంపెనీలు మెలిక పెట్టాయి. వయబులిటీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ప్రతిపాదన పెట్టాయి.

rs 06122021 2

అయితే ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ను సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం పలు సార్లు కోరింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఎప్పటి లాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాజ్యసభలో ఈ కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సంగతి ఏమిటి అంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి సమాధానం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సమకూర్చాలని, కేంద్రం పలు సార్లు కోరిందని కేంద్ర మంత్రి చెప్పారు. పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు, భారీ మూల ధన వ్యయం, అలాగే పెట్టుబడులు అవసరం కూడా ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇది ఆర్ధికంగా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, పన్నులు వస్తాయని, అందుకే రాష్ట ప్రభుత్వం, ఈ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ పైన ఎక్కువ ఆలోచన లేకుండా, తగిన నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు.

ఈ రోజు లాక్ సభలో, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, అదే విధంగా వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం నడిచింది. జీరో హావర్ సందర్భంగా , అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర అయిన, న్యాయస్థానం టు దేవస్థానంకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కల్పిస్తున్న అడ్డంకులకు సంబంధించి జీరో హావర్ లో, ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పూర్తి స్థాయిలో హైకోర్టు అనుమతి తీసుకున్నా కూడా, మహా పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని, అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని, ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు కాలరాస్తున్నారని సభ దృష్టికి తెసుకుని వచ్చారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు మహా పాదయాత్ర గురించి ప్రస్తావించారు. అయితే రఘురామకృష్ణం రాజు ప్రసంగంతో, ఒక్కసారిగా వైసీపీ ఎంపీలు ఉలిక్కి పడ్డారు. తమ బండారం మొత్తం రఘరామరాజు బయట పెడుతున్నారని గ్రహించి, ఆయన ప్రసంగానికి అడ్డుకునే ప్రయత్నం చేసారు, వైసీపీ ఎంపీలు. అయితే రఘురామ రాజు మాట్లాడిన తరువాత, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. విషయం పైన , జరుగుతున్న దాని పైన సమాచారం చెప్తారని అందరూ అనుకున్నారు.

loksabha 06122021 2

పోలీసులు ఎందుకు అలా వ్యవహరించారో చెప్పకుండా, ఒక్కసారిగా రఘురామకృష్ణం రాజు పైన వ్యక్తిగత దా-డికి దిగారు. రఘురామకృష్ణం రాజు తన పైన ఉన్నతు వంటి సిబిఐ కేసులు నుంచి తప్పించుకోవటానికి , ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే రఘురామకృష్ణం రాజు బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని, ఆయన పైన రెండు సిబిఐ కేసులు ఉన్నాయని, ఆ సిబిఐ కేసులను వెంటనే విచారణ చేయాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని, సంబంధం లేని విషయాలు మాట్లాడారు. అయితే అదే సమయంలో రఘురామ రాజు , నా పైన రెండు కేసులే ఉన్నాయని, మీ నేత పైన వందల కేసులు ఉన్నాయని, ముందు వాటి సంగతి చూసుకోండి, వాటిని కూడా విచారణ చేయమని అడగండి అని కౌంటర్ చేసారు. ఆ తరువాత రఘురామరాజు విలేఖరులతో మాట్లాడుతూ, జరిగిన విషయాన్ని విలేఖరులకు చెప్పారు. అయితే తాను మాట్లాడుతున్న సమయంలో, చెప్పలేని భాషతో బూతులు మాట్లాడారని, ఈ బూతులు చివరకు పార్లమెంట్ కు తెచ్చారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది రాజకీయ నాయుకులు అంటేనే ప్రజలు భయపడి పోతున్నారు. వాళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు అంటే, ఇంట్లో ఏ సర్టిఫికేట్ అమలు చేస్తున్నారు. పిల్లలను టీవీల నుంచి దూరంగా తీసుకుని వెళ్తున్నారు. చివరకు చట్ట సభల్లో కూడా బూతు భాష ఇంట్రడ్యూస్ చేసి, సంచలనం సృష్టిస్తున్నారు. ఈ బూతులు ఇంట్లో ఆడవాళ్ళను లాగే వరకు వెళ్ళాయి. మరీ ముఖ్యంగా వైసీపీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియా ముందుకు వస్తున్నారు అంటే, హడల్ అనే చెప్పాలి. మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు. పేర్ని నాని కూడా ఈ మధ్య శ్రుతి కలిపారు. ఇక ఎమ్మెల్యేలు రోజా, అంబటి, వంశీ, ద్వారంపూడి లాంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కొంత మంది మాట్లాడే భాష ఉచ్చం నీచం తెలీకుండా, కన్ను మిన్ను కాన రాకుండా, రేచ్చిపోతూ ఉంటారు. రేపు అనేది ఏమిటో, వీళ్ళకు తెలుసో తెలియదో కానీ, ప్రస్తుతం అధికారం మాదే, ఇక శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం అనే విధంగా, రెచ్చిపోతున్నారు. ఈ బూతు భాష ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది. కొంత మంది మాటలు ఎంత ఇరిటేటింగ్ గ ఉంటాయో, వారు మీడియా ముందుకు వస్తున్నారు అంటేనే, టీవీలు కట్టేసే పరిస్థితి.

nani 06122021 2

అలాంటిది ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వెబ్ సైట్, కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తావిస్తూ, ఒక సర్వే వివరాలు వెల్లడించింది. అయితే ఈ సంస్థ గతంలో కూడా తన సర్వే వివరాలు చెప్పటం, అది కూడా దగ్గరగా ఉండటంతో, ఆ సంస్థ పట్ల క్రెడిబిలిటీ కూడా ప్రజల్లో ఉంది. గతంలో మీకు బాగా విసుగు తెప్పించిన రాజకీయ నాయకులు ఎవరు అనే అంశం పైన సర్వే చేయగా, లక్ష్మీ పార్వతి, రోజా, అంబటి రాంబాబు, కొమ్మినేని, జాఫర్ పేర్లు వినిపించాయి. వీరందరూ జగన్ క్యాంప్ వాళ్ళే కావటం విశేషం. ఇప్పుడు తాజాగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో, మోస్ట్ ఇరిటేటింగ్ వాయిస్ అనే క్యాటగిరీలో మంత్రి కొడాలి నాని వచ్చారు. కొడాలి నాని అంటేనే, మోస్ట్ ఇరిటేటింగ్ వాయిస్ అంటున్నారు ప్రజలు. ఇక ఏ కారణం లేకుండా, కోపం చూపించే మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ర్యాంక్ వచ్చింది. మొత్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. ఇప్పటికైనా సదరు నేతలు, జరుగుతున్న విషయం గ్రహించి, తమను తాము సరి చేసుకుంటారో, దొంత కేర్ అంటారో మరి.

జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, తనకు వ్యక్తిగత హాజరు నుంచి, కోర్టుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి దఖలు చేసిన పిటీషన్ పైన, ఈ రోజు తెలంగాణా హైకోర్టులో వాదనలు ముగిసాయి. ప్రధానంగా గతంలో ఇదే పిటీషన్ పైన సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సిబిఐ కోర్టు , జగన్ మోహన్ రెడ్డికి, విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన గత ఏడాది తెలంగాణా హైకోర్టుని ఆశ్రయించారు. అయితే మధ్యలో కో-వి-డ్ పరిస్థితులు కారణంగా, ఈ పిటీషన్ పై విచారణ జరగలేదు. ఇటీవల కోర్టులు ప్రారంభం కావటం, ఈ కేసు పైన కూడా హైకోర్టులో విచారణ జరగటం జరిగింది. ఈ రోజు సిబిఐ తరుపున సీనియర్ న్యాయవాది సురేంద్ర వాదనలు వినిపించారు. ప్రధానంగా జగన్ మోహన్ రెడ్డికి, ఇదే అభ్యర్ధనను, సిబిఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. ఒక వేళ జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు అయితే, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, ఆయన సాక్షాలను తారు మారు చేసే అవకాసం ఉందని సిబిఐ ప్రధానంగా వాదించింది. ఇదే కారణంతో హైకోర్టు కూడా మినహాయింపు ఇవ్వలేదని, గతంలో కన్నా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి హోదా పెరిగిందని కోర్టుకు తెలిపారు.

cbi 06122021 2

ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాసం మరింత ఎక్కువగా ఉంటుందని, సిబిఐ వాదించింది. కాబట్టి, జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వద్దని, కచ్చితంగా హాజరు అయ్యేలా చూడాలని ఆదేశించాలని కోరారు. పదేళ్ళ నుంచి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుందని, అయినా కూడా కేసుల విచారణ ఇంకా డిశ్చార్జ్ పిటీషన్ల స్థాయిలోనే ఉందని, ఒకవేళ ఏ1గా ఉన్న జగన్ కు కేసుల నుంచి మినహియింపు ఇస్తే, ఈ కేసులు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకశం ఉందని సిబిఐ వాదించింది. వ్యక్తిగతంగా ఏమైనా అవసరం ఉన్నప్పుడు, అత్యవసరం అయినప్పుడు, ఆ రోజు మినహాయింపు కోరుతూనే ఉన్నారని, ఇప్పటికే 40 సార్లు ఆ విధంగా అడిగారని, కోర్ట్ కూడా మినహయింపు ఇస్తుందని, దానికి సిబిఐ కూడా ఒప్పుకుందని తెలిపారు. కానీ నిరవధికంగా వ్యక్తిగతంగా హాజరు ఇవ్వటం కుదరదని, సిబిఐ వాదించింది. ఇప్పటికే జగన్ తరుపు వాదనలు కూడా జరగటంతో, ఇక తీర్పుని రిజర్వ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read