ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలను, పీల్చి పిప్పి చేస్తుంది ఓటీఎస్ స్కీం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో, ఒక కుటుంబలోని బాలుడుకి ఒంట్లో బాగోక పోవటంతో, విశాఖలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం అని, రూ.15 వేలు అప్పు తీసుకున్నారు. అయితే ఆ రూ.15 వేలుని బలవంతంగా ఓటీఎస్ స్కీం కింద జమ వేసుకున్నారు. అసలకే పేద వాళ్ళు, వైద్యం కోసం డబ్బులు లేక అప్పు చెస్తే, ఆ అప్పుని ఈ స్కీం కింద లాగేసుకున్నారు అంటూ, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెం వచ్చింది. ఈ కధనం చూసి చంద్రబాబు చలించిపోయారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఈ సందర్భంగా ఈ బలవంతపు వసూళ్ళు చేస్తున్న ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటాం అని, వెంటనే వైద్యం కోసం ఎంత ఖర్చు అయితే అంత తెలుగుదేశం పెట్టుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నం తీసుకుని వెళ్లి, ఆరోగ్యం బాగు చేసి, మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తాం అని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పిన వెంటనే, మునిరత్నం అనే వ్యక్తీ ముందుకు వచ్చి, తాను కూడా ఆ బాలుడి వైద్యానికి సహాయం చేస్తానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఆ ముని రత్నం అనే వ్యక్తిని అభినధించి, ఈ దుర్మార్గుల పైన పోరాటానికి, అందరూ కలిసి రావాలని అన్నారు.

cbn 06122021 2

చంద్రబాబు మాట్లాడుతూ, "పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఆనాడే ఎన్టీఆర్ అందించారు - కూడు, గూడు, బట్ట అనే నినాదంతో ప్రభుత్వాన్ని నడిపిన ఏకైన నాయకుడు ఎన్టీఆర్ - ఏజెన్సీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‍ది - ఇల్లు అనేది ఓ సెంటిమెంట్ - ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాకే మిగిలిన నేతలూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు - జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో మోసం చేస్తున్నారు - ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? - పట్టా ఇవ్వడానికి జగన్ ఎవరు?.. స్థలం ఇచ్చావా? ఇల్లు కట్టించవా? - ఇప్పుడున్న సీఎం భూమి, రూణం, నిర్మాణ ఖర్చు ఇచ్చారా? - పేదలను దోచుకోవడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యం - ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా? - ఓటీఎస్ కట్టని వారిని వాలంటీర్లు వేధిస్తున్నారు - డబ్బులు కట్టకపోతే పథకాలు రద్దవుతాయని బెదిరిస్తారా? - బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? - ఇంటి రుణం మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు - ఎన్నికల ముందు జగన్‍ది ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట - మాట తప్పి మడమ తిప్పిన జగన్‍పై చీటింగ్ కేసు పెట్టాలి - తప్పుడు కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నారా?" అని అన్నారు.

అది తాడేపల్లి ప్రాంతంలో... చాలా పటిష్టమైన భద్రత ఉండే ఏరియా... జగన్ ఇల్లు కూత వేటు దూరంలోనే ఉంటుంది. సియం క్యాంప్ ఆఫీస్ కావటంతో, రాష్ట్రంలోనే అత్యంత భద్రత ఉన్న ఏరియా అని చెప్పవచ్చు. అలాంటి చోట, రాష్ట్రంలోనే అతి పెద్ద దొంగల బ్యాచ్ అయన చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న విల్లాస్ నే టార్గెట్ చేసింది చెడ్డీ గ్యాంగ్. తాడేపల్లి ప్రాంతంలోని రెయిన్ బో విల్లాస్ లో, చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి వచ్చింది. అక్కడ దాదాపుగా 50కు పైగా విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉంటున్నారు. అయితే ఇప్పుడు మూడు విల్లాస్ లో దొంగ తనం జరిగింది. విల్లా 37, 39, 44లో దొంగ తనం జరిగింది. ఈ మూడు విల్లాస్ లో దొంగ తనం జరిగింది. ఇందులో ఒకటి తణుకు వైసీపీ ఎమ్మెల్యేది కాగా, మరొకటి ఆమంచి కృష్ణ మోహన్, అలాగే మరో నేత ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడే వైసీపీ మంత్రులు, టిటిడి చైర్మెన్ విల్లా కూడా ఉంది. సిసి టీవీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు, ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని నిర్ధారించారు. ఇప్పటికే విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న వీడియోలు గత వారం రోజులుగా టీవీల్లో వస్తున్నాయి. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ గుంటూరు జిల్లాలో, అదీ జగన్ నివాసానికి కూతవేటు దూరంలో దొంగతనానికి వెళ్ళటం సంచలనంగా మారింది.

gang 06122021 2

దాదాపుగా అయుదు మంది వరకు చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్ ఈ దొంగ తనానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎంతో సెక్యూరిటీ ఉండే ఈ ప్రాంతాన్ని చెడ్డీ గ్యాంగ్ ఎంచుకోవటం, లోపలకు వెళ్ళటం, దొంగ తనం చేయటం, ఇవన్నీ చూస్తుంటే, పూర్తి స్థాయిలో భద్రత ఉండే ప్రాంతంలోనే ఇలా జరగటం అనేది, ప్రజలను టెన్షన్ పెట్టించే అంశం అనే చెప్పాలి. ఇంత భద్రత ఉండే చోటే వాళ్ళు అనుకున్న టార్గెట్ చేదించారు అంటే, ఇక సామాన్య అపార్ట్ మెంట్లు పరిస్థితి చెప్పనక్కర లేదు. అయితే ఇది జరిగి మూడు రోజులు అవుతున్నట్టు తెలుస్తుంది. పెద్ద వాళ్ళ వ్యవహారం కావటంతో పోలీసులు గోప్యంగా ఉంచి నట్టు తెలుస్తుంది. అయితే దొంగతనం జరిగే టైంలో, ఎవరూ లేకపోవటంతో, ఎవరికీ ఏ హాని జరగలేదు. అయితే ఏమి పోయాయి అనేది మాత్రం, బయటకు రాలేదు. ఈ వ్యవహారం పై పోలీస్ విచారణ జరుగుతుంది. పూర్తి సమాచారం మాత్రం బయటకు రాలేదు. అయితే ఇంత భారీ భద్రత ఉండే చోట, ఎలా దొంగతనం చేసారు, సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు అందరినీ కలిచి వేస్తున్న ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రభుత్వం చేసే పనులతో, ఎప్పుడూ ఏదో ఒక రగడ ఉండాల్సిందే. మొన్నటి దాకా, దారుణమైన రోడ్డులు, చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు చార్జీలు, హెరాయిన్, ఇలా రకరకాల సమస్యలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టుడికింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇంటి పైకి, టిడిపి ఆఫీస్ పైకి, చివరకు చంద్రబాబు సతీమణి పై బూతులు వరకు, ఇలా రాష్ట్ర రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని మరో అంశం కుదిపేస్తుంది. అదే వన్ టైం సెటిల్మెంట్. రాష్ట్ర ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాన్ని కూడా ఊపెస్తున్న అంశం ఇది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, వాలంటీర్లు, ఇతర అధికారులు, అందరూ వెళ్లి గ్రామాల్లో వన్ టైం సెటిల్మెంట్ కింద పది వేలు కట్టాలని, దానికి అవగాహన కలిగిస్తున్నారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అసలు ఎప్పుడో, 1983 నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇచ్చిన ఇళ్ళను, ఇప్పుడు వీళ్ళు పది వేలు అడగటం ఏమిటి అంటూ, ఎవరినీ డబ్బులు కట్టొద్దు అంటూ టిడిపి ఇప్పటికే ప్రకటించింది. అయితే గ్రామాల్లోకి వెళ్తున్న వాలంటీర్లకు, సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజలు అందరూ ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికే ఆర్దికంగా చితికి పొతే, ఇప్పుడు మీరు వచ్చి పది వేలు కట్టమంటే ఎలా అంటూ, ఎదురు తిరుగుతున్నారు.

cbn 05122021 2

అనేక పన్నులు కడుతున్నాం అని, ఇప్పుడు మళ్ళీ ఇది ఏమిటి అంటూ ఎదురు తిరుగుతున్నారు. మొత్తం గందరగోళం అవ్వటం, డబ్బులు అత్యవసరం అవ్వటంతో, ఎలాగైనా ప్రజల నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరింత అవగాహన కల్పించే విధంగా, ఈ రోజు పేపర్ యాడ్ ఇచ్చారు. ఇందులో, ఈ వన్ టైం సెటిల్మెంట్ స్కీం చాలా ఉపయోగం అని చెప్తూ, గతంలో చంద్రబాబు హాయాంలో, అయుదు సార్లు అధికారులు చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన పెట్టినా చంద్రబాబు వద్దు అన్నారు అంటూ, అంత పెద్ద యాడ్ లో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి వేసారు. అయితే ఇక్కడ అర్ధం కాని విషయం, ఇప్పటికీ చంద్రబాబు అదే కదా చెప్తుంది. ప్రజల మీద భారం పడుతుంది, అయినా ఎవరో ఇచ్చిన స్థలాలకు మనం డబ్బులు తీసుకోవటం ఏమిటి అనేది చంద్రబాబు స్టాండ్. అప్పుడు కూడా అందుకే అయుదు సార్లు ప్రతిపాదిస్తే, ప్రజల మీద భారం వద్దని చంద్రబాబు వద్దు అన్నారు. ఇదే విషయం కోట్లు ఖర్చు పెట్టి, ప్రభుత్వం ఈ రోజు పేపర్ యాడ్ ఇవ్వటం హైలైట్ అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ అనే పధకం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒక పక్క ప్రభుత్వం, ఇది ఆప్షనల్ అని చెప్తూనే, మరో పక్క టార్గెట్ లు పెట్టి మరీ వసూళ్ళు చేయమని అధికారులు చెప్పటం, గందరగోళానికి గురి చేస్తుంది. ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు ఎవరూ కట్టటానికి సుముఖంగా లేమని, వాలంటీర్ల పై అరుస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడుగా తెలుగుదేశం పార్టీ కూడా ఒత్తిడి తెస్తుంది. ఆందోళనలు చేయటం, ప్రజలు మద్దతు పలకటంతో, అధికార పార్టీ డిఫెన్స్ లో పడినా, వన్ టైం సెటిల్మెంట్ మాత్రం చేసి తీరుతాం అంటుంది. తాజాగా మర్రిపాడు ఎంపీడీవో ఆడియో వైరల్ అవుతుంది. అందులో మర్రిపాడు ఎంపీడీవో మాట్లాడుతూ, సచివాలయ సిబ్బందికి టార్గెట్ లు ఇస్తున్నారు. ప్రతి రోజు టార్గెట్ లు ఉంటాయని, ఎలాగైనా ప్రజలను ఒప్పించాలని చెప్తున్నారు. అవసరం అయితే వారిని భయపెట్టాలని, కూడా చెప్పటం సంచలనంగా మారింది. ఇది కలక్టర్ ఆదేశాలు అని కూడా ఆమె చెప్తుంది. ఇప్పటికే పధకాలు ఆపేస్తాం అంటూ, ఇచ్చిన ఆదేశాలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కడితేనే, మీకు ఏ సర్టిఫికెట్లు కావాలన్నా ఇస్తాం అంటూ బెదిరిస్తున్న ఆడియో వైరల్ అవుతుంది.

jagan 06122021 2

1983 నుంచి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, పేదలకు ఇచ్చిన స్థలాలకు పది వేలు కట్టాలని ప్రభుత్వం అంటుంది. అలా చేస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అని, అవి మీరు తీసుకుని బ్యాంకులో అప్పు కూడా తీసుకోవచ్చని చెప్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం, గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు, మీకు ఎందుకు డబ్బులు కట్టాలని వాదిస్తుంది. ఉచితంగా ఇవ్వాలని, లేదంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత, ఫ్రీ గా ఇస్తాం అని అంటుంది. అయితే ప్రజలు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క ఆప్షనల్ అని చెప్తూనే, ఇలా బలవంతం చేయటం పై, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ధరలు పెరిగి, ఏమి చేయాలో అర్ధం కాక, మేము ఉంటే, ఇప్పుడు పది వేలు ఎక్కడ నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇంటి అద్దె పెంచారని, చెత్త పన్ను వేస్తున్నారని, కరెంటు చార్జీలు పెరిగాయని, పెట్రోల్, చర్జలు పెరిగాయని, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అని, ఇప్పుడు ఈ గుదిబండ మా వల్ల కాదని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read