అది తాడేపల్లి ప్రాంతంలో... చాలా పటిష్టమైన భద్రత ఉండే ఏరియా... జగన్ ఇల్లు కూత వేటు దూరంలోనే ఉంటుంది. సియం క్యాంప్ ఆఫీస్ కావటంతో, రాష్ట్రంలోనే అత్యంత భద్రత ఉన్న ఏరియా అని చెప్పవచ్చు. అలాంటి చోట, రాష్ట్రంలోనే అతి పెద్ద దొంగల బ్యాచ్ అయన చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న విల్లాస్ నే టార్గెట్ చేసింది చెడ్డీ గ్యాంగ్. తాడేపల్లి ప్రాంతంలోని రెయిన్ బో విల్లాస్ లో, చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి వచ్చింది. అక్కడ దాదాపుగా 50కు పైగా విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉంటున్నారు. అయితే ఇప్పుడు మూడు విల్లాస్ లో దొంగ తనం జరిగింది. విల్లా 37, 39, 44లో దొంగ తనం జరిగింది. ఈ మూడు విల్లాస్ లో దొంగ తనం జరిగింది. ఇందులో ఒకటి తణుకు వైసీపీ ఎమ్మెల్యేది కాగా, మరొకటి ఆమంచి కృష్ణ మోహన్, అలాగే మరో నేత ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడే వైసీపీ మంత్రులు, టిటిడి చైర్మెన్ విల్లా కూడా ఉంది. సిసి టీవీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు, ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని నిర్ధారించారు. ఇప్పటికే విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న వీడియోలు గత వారం రోజులుగా టీవీల్లో వస్తున్నాయి. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ గుంటూరు జిల్లాలో, అదీ జగన్ నివాసానికి కూతవేటు దూరంలో దొంగతనానికి వెళ్ళటం సంచలనంగా మారింది.

gang 06122021 2

దాదాపుగా అయుదు మంది వరకు చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్ ఈ దొంగ తనానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎంతో సెక్యూరిటీ ఉండే ఈ ప్రాంతాన్ని చెడ్డీ గ్యాంగ్ ఎంచుకోవటం, లోపలకు వెళ్ళటం, దొంగ తనం చేయటం, ఇవన్నీ చూస్తుంటే, పూర్తి స్థాయిలో భద్రత ఉండే ప్రాంతంలోనే ఇలా జరగటం అనేది, ప్రజలను టెన్షన్ పెట్టించే అంశం అనే చెప్పాలి. ఇంత భద్రత ఉండే చోటే వాళ్ళు అనుకున్న టార్గెట్ చేదించారు అంటే, ఇక సామాన్య అపార్ట్ మెంట్లు పరిస్థితి చెప్పనక్కర లేదు. అయితే ఇది జరిగి మూడు రోజులు అవుతున్నట్టు తెలుస్తుంది. పెద్ద వాళ్ళ వ్యవహారం కావటంతో పోలీసులు గోప్యంగా ఉంచి నట్టు తెలుస్తుంది. అయితే దొంగతనం జరిగే టైంలో, ఎవరూ లేకపోవటంతో, ఎవరికీ ఏ హాని జరగలేదు. అయితే ఏమి పోయాయి అనేది మాత్రం, బయటకు రాలేదు. ఈ వ్యవహారం పై పోలీస్ విచారణ జరుగుతుంది. పూర్తి సమాచారం మాత్రం బయటకు రాలేదు. అయితే ఇంత భారీ భద్రత ఉండే చోట, ఎలా దొంగతనం చేసారు, సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు అందరినీ కలిచి వేస్తున్న ప్రశ్న.

Advertisements

Advertisements

Latest Articles

Most Read