విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి వందల మంది పోలీసులు రావటంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, విజయ్ పుట్టినరోజు పురస్కరించుకుని, ఆయన పుట్టిన రోజు వేడుకులు చేసుకోకుండా, నారా భువనేశ్వరి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఆడవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిపేలా నిరసన కార్యక్రమం తలపెట్టారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. అయితే పోలీసులు అయ్యన్నపాత్రుడి ఇంటికి వచ్చి, కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెప్పారు. అయ్యన్నపాత్రుడు మాత్రం, తాము ఏమి చేయం అని, కేవలం నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. దీంతో పోలీసులు భారీగా మొహరించారు. అయితే మేము మాత్రం నిరసన కార్యక్రమం విరమించుకోమని, పోలీస్ స్టేషన్ కు వచ్చి వినతి పత్రం ఇస్తామని చెప్పారు. అయితే నిరసన కార్యక్రమం చేపట్టటంతో, ఒక్కసారిగా పోలీసులు వచ్చి వారిని ఇష్టం వచ్చినట్టు లాగి పడేసే ప్రయత్నం చేసారు. దీంతో అయ్యన్నపాత్రుడు తేవర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అయ్యన్నతో పాటు టీడీపీ శ్రేణులురహదారిపై బైఠాయించిచారు. పోలీసులు తీరుకి నిరసనగా, అయ్యన్నపాత్రుడు ధర్నాకు దిగారు.

ayanna 24112021 2

పోలీసులు తీరు పై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ని గంటలు అయినా, రాత్రి అయినా సరే తాము ఇక్కడే ఉంటాం అని, మీరు ఎంత సేపు ప్రతిఘటించినా ఇక్కడే ఉంటాం అని, శాంతియుతంగా చేస్తున్న నిరసనకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరుతున్నాం అని అన్నారు. తన చేతికి కూడా గాయాలు అయ్యాయని, ఆడవారి చీరలు కూడా లాగేసరని అయ్యన్న ఆరోపించారు. కేవలం పోలీస్ కంప్లింట్ ఇస్తామని చెప్పినా, ఎందుకు భయం అని నిలదీశారు. ఆడవారిని ఆటల్లో ఎక్కించి తీసుకుని వేల్లిపోతున్నారని, పోలీసులు తీరు మార్చుకోవాలని అన్నారు. ఈ రోజు మాత్రం వెనక్కు తగ్గేది లేదని, అటో ఇటో, ఈ రోజు తేల్చుకుంటాం అని, ఏది ఏమైనా ఈ రోజు వినతి పత్రం ఇచ్చి తీరుతాం అని, ఇక్కడే రోడ్డు మీద ఉంటాం అని అయ్యన్న అన్నారు. పోలీసులను వేడుకుంటున్నాం అని, ఇప్పటికైనా ఆలోచించాలని అన్నారు. ఆడవారి కించ పర్చుతూ వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి పై కేసులు నమోదు చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, మంత్రులు, అంటూ, ప్రజానికానికి టక్కున కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి. మొదట్లో బూతులు, ఇప్పుడు అవి చెప్పలేని మాటల వరకు వెళ్ళిపోయాయి. చివరకు అసెంబ్లీ వేదికగా కూడా జుబుక్సాకరంగా మాటలు మాట్లాడే స్థాయికి వచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీరు మాట్లాడే భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న శుక్రవారం నాడు, అంబటి, ద్వారంపూడి, కొడాలి నాని వాడిన భాష గురించి అందరికీ తెలిసిందే. అంతకు ముందు వంశీ కూడా ఇదే భాష వాడారు. తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా అనేక బెదిరింపులు వస్తున్నాయి అంట. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొడాలి నానికి 2+2 భద్రతా ఉండగా, దాన్ని 1+4 కి పెంచి, ఆయన కాన్వాయ్ లో మరో వాహనాన్ని కేటాయించారు. అలాగే వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, 1+1 నుంచి 4+4కి భద్రత కల్పించారు. అదనంగా భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నోరు మంచిది అయితే, ఊరు మంచిది అవుతుంది అంటారు ఇందుకే మరి.

బీజేపీ, టిడిపి నేతలకు షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో, మూడు రోజులు క్రిందట. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఎంటర్ అయ్యింది. ఈ మూడు రోజుల నుంచి కూడా వారికి అనేక ఆంక్షలు పెడుతున్నారు నెల్లూరు పోలీసులు. మూడు రోజుల నుంచి కూడా నెల్లూరు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. హారతులు పడుతూ, కొబ్బరికాయలు కొడుతూ, పూలు జల్లుతూ, పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మహా పాదయత్రకు నెల్లూరులో పెద్దగా రెస్పాన్స్ ఉండదులే అని ప్రభుత్వం భావించింది. అయితే ఎవరూ ఊహించని విశేష స్పందన లభించింది. అయితే ప్రధానంగా పోలీసులు, మరీ ముఖ్యంగా కావలి డీఎస్పీ వైఖరి మాత్రం, రైతులను, మహిళలను ఇబ్బంది పెట్టేల ఉందని విమర్శలు వస్తున్నాయి. డప్పులు కొట్టవద్దు అంటూ, పదే పదే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రిందట ఏపి బీజేపీ నేతలు సుజనా చౌదరి, సియం రమేష్, పురందేస్వారి, కన్నా లక్ష్మీ నారాయణ, కామినేని శ్రీనివాస్ వీరందరూ వచ్చి అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామారావు, రామకృష్ణలు కూడా అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారు.

bjp 24112021 2

ఈ రోజు వైసీపీ మినహా అన్ని పార్టీల వారు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఒక్క వైసీపీ మాత్రమే రైతులకు మద్దతు ఇవ్వటం లేదు. అయితే కావాలి డీఎస్పీ అడ్డుకోవటమే కాకుండా, ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడితో కేసులు కూడా నమోదు చేస్తున్నారని అమరావతి జేఏసి ఆరోపిస్తుంది. ఇప్పటికే కావాలిలో మూడు కేసులు పెట్టినట్టు చెప్తున్నారు. తాజాగా బీజేపీ, టిడిపి నేతలకు కూడా షాక్ ఇచ్చారు. తెలుగుదేశం నేతలు బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామారావు, రామకృష్ణతో పాటుగా, బీజేపీ నేతలు అయిన సుజనా చౌదరి, పురంధేశ్వరి, సీఎం రమేష్‌, కామినేనిలపై కేసులు పెట్టారు. అయితే వీరు మద్దతు తెలిపి వెంటనే వెళ్ళిపోయారు. మొత్తం 75 మంది పైన ఈ కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలా ఉంటే, కొంత మంది యాత్రలో పాల్గునని వారి పైన కూడా కేసులు పెట్టారని, బీజేపీ, టిడిపి చెప్తూ, అవాక్కయ్యారు. అయితే పోలీసులు మాత్రం, కేసులు పెట్టలేదని, ఎఫ్ఐఆర్ లు నమోదు చేసామని, హైకోర్ట్ కు మాత్రమే సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. అయితే టిడిపి, బీజేపీ నేతలు మాత్రం, కావలి డీఎస్పీ పై మండి పడుతూ, ఇది కేవలం ప్రభుత్వ ఒత్తిడితో చేస్తున్న పనులని అంటున్నారు.

గత కొన్ని రోజులుగా ములుపులు తిరుగుతూ వస్తున్న కొండపల్లి మునిసిపల్ చైర్మెన్ ఎన్నిక, ఎట్టకేలకు ఈ రోజు ముగిసింది. కొండపల్లి ఖిల్లా పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‍గా టీడీపీ అభ్యర్థి చిట్టిబాబు అలాగే వైస్ చైర్మన్లుగా టిడిపి 0వ వార్డు కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి, టిడిపి 29వ వార్డు కౌన్సిలర్ చుట్టకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వీరికి మద్దతు తెలుపుతూ, 16 మంది టీడీపీ సభ్యులు చేతులు ఎత్తారు. అయితే ఈ ఎన్నిక వ్యవహారం మొత్తం కోర్టులో ఉండటంతో, అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎన్నికల ఫలితం ప్రకటించలేదు. ఈ మొత్తం కూడా సీల్డ్ కవర్ లో రేపు హైకోర్టు ముందు ఉంచనున్నారు. ఈ ఫలితాలు పట్ల తెలుగుదేశం శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అనేక అరాచకాలు తట్టుకుని మరీ, ఇక్కడ టిడిపి జెండా ఎగిరినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం, హైకోర్టు ఆదేశాలతో సక్రమంగా జరిగిందని టిడిపి సంతోషం వ్యక్తం చేస్తుంది. హైకోర్టు జోక్యం లేకపోతే, ఈ సారి కూడా ఏదో ఒకటి చేసేవారని అంటున్నారు. అయితే ఈ రోజు పరిణామాలు చూస్తే, హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వటంతో, ఉదయం నుంచి కూడా మొత్తం పోలీస్ పహారాలలో, పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు మధ్య ఎన్నిక జరిగింది.

kondapalli 24112021 2

అటు టిడిపి సభ్యులు, గొల్లపూడి నుంచి, ఇటు వచ్చేంత వరకు కూడా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా తీసుకుని రావటం జరిగింది. అలాగే వైసీపీ సభ్యులను కూడా ఐతవరం నుంచి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. లోపలకు వెళ్ళిన తరువాత, వైసిపీ నేతలు మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఎన్నిక సీక్రెట్ గా జరగాలని ఆందోళన చేసారు. అయితే రూల్స్ ప్రకారం కేవలం చేతులు ఎత్తి మాత్రమే ఎన్నిక జరగాలని టిడిపి కూడా పట్టుబట్టింది. కేశినేని నాని కూడా, ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ వివరించారు. దీంతో, ఎన్నికల అధికారి కూడా ఒప్పుకున్నారు. మొత్తం ప్రక్రియ మొత్తం కెమెరా రికార్డింగ్ తో జరిగింది. జరిగిన ప్రక్రియ మొత్తం వీడియో గ్రాఫి జరిగింది. ఇది మొత్తం హైకోర్టుకు కూడా ఇవ్వనున్నారు. మొత్తం మీద గత నాలుగు రోజులుగా నడుస్తున్న హైటెన్షన్ వాతవరణం, ఎట్టకేలకు కోర్టు జోక్యంతో, మొత్తం ప్రశాంతంగా జరిగింది. మరి ఇప్పటి నుంచి ఎలాంటి ప్రలోభాలు, ఎలాంటి దౌర్జన్యాలు చేస్తారో చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read