151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబు భజన తప్ప వేరేది ఉండదు. అంత మందికీ చంద్రబాబే టార్గెట్. చంద్రబాబు రాజకీయంగా కుంగిపోడు. ఎందుకు అంటే ఆయనకు గెలుపు అయినా ఒక్కటే, ఓటమి అయినా ఒక్కటే. రాజకీయ విమర్శలు అసలు పట్టించుకోరు. రాజకీయంగా పెట్టే ఇబ్బందులు, ఎదురుండి పోరాడతారు. ఈ రెండున్నరేళ్ళలో జరిగింది అదే. చంద్రబాబు ఎదురొడ్డి పోరాటం చేసారు. ధీటుగా నిలబడ్డారు, కలబడ్డారు. చివరకు తన సొంత ఊరిలో, కుప్పంలో, టార్గెట్ పెట్టి మరీ, దొంగ ఓట్లు వేసి మరీ, గుద్దుకుని గెలిచినా, హేళన చేసినా, ఆయన తొణకలేదు. అందుకే వైసీపీ రెండో రోజే వ్యూహం మార్చింది. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టలేం అని అర్ధం అయ్యింది. అందుకే మానసికంగా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసారు. చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్లాన్, కొంత మంది చేతిలోనే పెట్టారు. ఆ కొంత మందిలో చాలా కమాన్ పాయింట్ లు ఉన్నాయి. ఆ కొంత మందిలో అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, కొడాలి నాని అన్నారు. వీరి నలుగురిలో ఒకే కామన్ పాయింట్ ఉంది. అందుకే వైసీపీ పెద్దలు వీరిని సెలెక్ట్ చేసుకున్నారు. జుబుక్సాకరంగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసారు. సైకోలులాగా ఆయన మీద పడి, మానసిక హిం-సకు దిగారు.

cbn 20112021 2

వీరి నలుగిరిలో, కొడాలి నానికి మంత్రి పదవి ఉంది. త్వరలో మంత్రి పదవి ఊడిపోతుందనే ప్రచారం జరుగుతుంది. మిగతా ముగ్గురూ మంత్రి పదవుల కోసం, పెర్ఫోరమన్స్ ఇరగ దీస్తుంటే, కొడాలి నాని మాత్రం, మంత్రి పదవి ఊడిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తమ అధినేతను సొంతోష పెట్టటమే వీరి టార్గెట్. అందుకే అధినేతిని మంచి చేసుకుని, తమకు మంత్రి పదవులు ఇస్తాడు అనే ఆశతో రెచ్చిపోతున్నారు. ఇక మరో కామన్ పాయింట్. అందరికీ కూతుళ్ళు ఉన్నారు. రోజా ఏకంగా ఆమె మహిళ. అయినా సరే, జుబుక్సాకరంగా పుట్టుకుల గురించి, రాజకీయాలతో సంబంధం లేని మహిళలను లాగారు. ఆమె క్యారెక్టర్ దెబ్బ తినేలా బజారులో పెట్టారు. పవిత్రమైన అసెంబ్లీలో పాకీ మాటలు మాట్లాడారు. ఇంకేముంది, ఆ పెద్దాయన చలించిపోయాడు. క్లమైర్ మైన్స్ పేల్చినా చలించని గుండె, భార్యని అంటే తట్టుకోలేక పోయింది. అంత పెద్ద మనిషి, బోరున విలపించటంతో, మానవత్వం ఉన్న అందరూ రాజకీయాలకు అతీతంగా ఆయనకు సంఘీభావం తెలిపారు. మృగాలు మాత్రం, ఎప్పటి లాగే, ఆయన పై వేసుకుని పడ్డారు. ఇంత పెఫోర్మన్సు ఇచ్చిన వారికి, పాపం మంత్రి పదవులు వరిస్తాయో లేదో.

జగన్ అక్రమ ఆస్తుల కేసులు 2012లో ప్రారంభం అయ్యాయి. చాలా కేసుల్లో చార్జ్ షీట్లు కూడా వేసారు. మొత్తం 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు. ఈ కేసులు ఇప్పటికీ, ఒక్క కేసులో కూడా ట్రైల్స్ మొదలు అవ్వలేదు అంటే, ఎంత జాప్యం జరుగుతుందో చూడండి. ఇది ఇంకా సిబిఐ కోర్ట్ లోనే ఉంది. ఇక్కడ తీర్పు వచ్చిన తరువాత హైకోర్టు, అక్కడ నుంచి సుప్రీం కోర్టుకు వెళ్ళాలి అంటే, ఈ కేసు ఎప్పటికి తేలుతుంది ? అసలు తేలుతుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ కేసులో అనేక మందిని సిబిఐ, ఈడీ నిందితులగా చేర్చింది. ఏ1 గా జగన్ మోహన్ రెడ్డి, ఏ2 గా విజయసాయి రెడ్డి ఉండగా, మిగతా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొకరూ డిశ్చార్జ్ పిటీషన్ లు వేస్తూ, ఆ పిటీషన్ అని , ఈ పిటీషన్ అని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వేస్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి, శుక్రవారం వచ్చింది అంటే చాలు, ఏదో ఒక కారణం చెప్పటం, వాయిదా ఎగ్గోట్టటం పరిపాటిగా మారిపోయింది. ప్రతి వారం, ఏదో ఒక కారణం. ఇలా ఈ అక్రమ ఆస్తుల కేసులో ఉన్న అందరూ ప్రతి సారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ, విచారణ వాయిదా వేస్తున్నారు. దీంతో తెలంగాణా హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇక నుంచి జగన అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి, వాయిదాలు కోరితే, కోర్టు ఖర్చులు కింద రూ.50 వేలు జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ, మాటి మాటికీ వాయిదా కోరటం పై అసహనం వ్యక్తం చేసింది.

jagan hc 20112021 2

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుల్లో వివిధ పిటీషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. తమ పేర్లు కొట్టేయాలని, డిశ్చార్జ్ పిటీషన్లు ఇలా అనేకం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్ ముందకు వచ్చాయి. అయితే లిస్టు లో ఉన్న ప్రకారం, న్యాయమూర్తి విచారణకు పిలుస్తున్నా ఒక్కరూ రాలేదు. అందరూ వివిధ కారణాలు చెప్పి వాయిదా కోరారు. దాల్మియా సిమెంట్స్‌ న్యాయవాది వాయిదా కోరారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి కేసు రాగా, న్యాయవాది రాలేదని వాయిదా కోరారు. ఇలా అందరూ వాయిదా కోరటం, ఇది పరిపాటిగా మారటంతో, నాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీరు కోరితేనే కదా, విచారణ ఈ రోజు చేసుకుందాం అని అనుకుంది, ఇప్పుడు అందరూ ఏదో ఒక కారణం చెప్పి రాకుండా, కోర్టు సమయం వృధా చేస్తే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఇక నుంచి విచారణ సమయానికి వాదనలు వినిపించాలసిందే అనే, లేకపోతే రోజుకు రూ.50 వేల చొప్పున కోర్టు ఖర్చుల కింద జమ చేయాలి అనే ఆదేశాలు ఇస్తామని హెచ్చరిస్తూ, విచారణను వాయిదా వేసారు. ఇక్కడ వీరికి రూ.50 వేలు లెక్క లేకపోయినా, కోర్టు సీరియస్ గా ఉంది అనే విషయం అర్ధం చేసుకోవాలి.

విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మ లు సై-కో జగన్ ని ఒక సారి ఎవరికైనా చూపించాలని, ఇలాగే వదిలేస్తే ఆడవాళ్లు బయటికొచ్చే పరిస్థితులు లేవని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సలహా ఇచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ మాటలు మీ కోసం... గతంలో పోలీసులకు సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడనప్పటికినీ వాడకూడని పదమేదో మాట్లాడారని సాక్ష్యాత్తు సీఎం స్థాయిలో ఉన్న జగన్ కార్యాలయాలపై రా-ళ్లు, రప్పలు విసిరించారు. పైగా కార్యకర్తలకు బీపీ వచ్చిందని సమర్థించుకున్నారు. టీడీపీ కార్యాలయాల మీద కూడా రా-ళ్లు, రప్పలు వేయించారు. ఇప్పుడు భువనేశ్వరి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబునాయుడు చేత కంట తడి పెట్టిండంపై మేమేం చేయాలి? చంద్రబాబునాయుడు గారు ఒక చిటికేసి కార్యకర్తలకు చెబితే.. టీడీపీ కార్యకర్తలే కాకుండా ఎన్టీరామారావు అభిమానులందరూ ఇండ్లల్లో నుంచి బయటికి వచ్చి వైసీపీ నాయకుల అంతు చూడగలరు. సైకోలకు కన్నీళ్లు చూస్తే ఆనందమేస్తుంది. చంద్రబాబునాయుడు చేత కన్నీళ్లు పెట్టించడంతో వైసీపీ నాయకుల సైకోయిజం బయటపడింది. సైకోలకు తల్లి కన్నీళ్లు, చెల్లి కన్నీళ్లు అవేవీ కనపడవు. ఎవరిచేతనైనా కన్నీళ్లు పెట్టించగలరు. జగన్ తల్లి, చెల్లి కన్నీళ్లకు కరగలేదు. చంద్రబాబునాయుడు కన్నీళ్లకేం కరుగుతాడు? చంద్రబాబు చిటికేసి వైసీపీ నాయకులు ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని స్థితిని తీసుకరాగలరు.

గతంలో కార్యకర్తలకు బీపీ వచ్చి కార్యాలయాలపై దా-డి చేశారని చిలకపలుకులు పలికిన డీజీపీ ఇప్పుడు మాజీ సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలేవీ? వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చని డీజీపీ వారికి రాసిఇచ్చినట్లుంది. చంద్రబాబు విలువలు కలిగిన వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. రాబోయే కాలంలో సీఎం ఆయనే . మేమంతా సైనికుల్లా పనిచేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఆయనను మళ్లీ సీఎం చేస్తాం. అందులో అనుమానం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేం వ్యవహరిస్తాం. ఒక పేటీయం బ్యాచ్ ఒక అమ్మ గురించి ఇలా మాట్లాడటమా? ఇలాగే వ్యవహరిస్తే ఆడవాళ్లు చెప్పులతో దా-డి చేసే రోజులు రాగలవు. జబర్దస్ లో డబల్ మీనింగ్ డైలాగులకు మార్కులిచ్చే రోజా.. రాజకీయ విలువల గురించి మాట్లాడటమా? రోజాకు రాజకీయ బిక్ష పెట్టింది టీడీపీనే. టీడీపీనే ఆమె పునాదులు. ఇంకోసారి భువనేశ్వరి గురించి చులకనగా, అవహేళనగా మాట్లాడితే ఆడవారు చెప్పులతో దేహశుద్ధి చేస్తారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు లు అసెంబ్లీలో కూర్చోవడం ప్రజల దౌర్భాగ్యమైంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చట్టాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. డీజీపీ వెంటనే భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపట్ల కేసు పెట్టాలి. వైసీపీ నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సూచించారు.

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల మధ్య కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం వచ్చిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించింది. అయితే ఇది అనేక ట్విస్ట్ లు తిరుగుతుంది. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ 29 వార్డుల్లో, టిడిపి పార్టీ 14 వార్డులు గెలుచుకుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వార్డులు గెలుచుకుంది. అయితే మరో ఇండిపెన్డెంట్ అభ్యర్ధి కూడా గెలుచున్నారుఇండిపెన్డెంట్ అభ్యర్ధి చంద్రబాబు గారి సమక్షంలో టిడిపిలో చేరటంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో, ఆయన తన ఓటు వినియోగించుకోవటంతో, వైసీపీ బలం కూడా 15కు చేరుకుంది. అయితే ఇదే సందర్భంలో అక్కడ స్థానిక ఎంపీగా ఉన్న టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నానికి కూడా అక్కడ ఓటు ఉంది. అయితే ఆయన ఓటు నమోదు చేసుకోలేదు. ముందుగా నమోదు చేసుకోక పోవటంతో, కేశినేని నాని ఓటు పై సస్పెన్స్ నెలకొంది. ఈ నెల 22న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉండటం, ఏమి జరుగుతుందా అని అందరూ టెన్షన్ పడుతున్న సందర్భంలో, కేశినేని నానికి ఓటు లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం హ్సుస్తూ, మైండ్ గేం ఆడింది.

kesinani 19112021 2

అయితే కేశినేని నాని మాత్రం, ఓటు హక్కు ఎప్పుడైనా కౌంటింగ్ జరిగే రోజు వరకు అడగవచ్చని చెప్పారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తనకు ఓటు వేసే హక్కుని ఇవ్వాలి అంటూ, మున్సిపల్ కమిషనర్ కు కేశినేని నాని, అదే రోజు లేఖ రాసారు. అయితే మున్సిపల్ కమిషనర్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికే ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు సాయంత్రం 5 గంటలలోపు అయిపొయింది. మున్సిపల్ కమిషనర్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మున్సిపల్ కమిషనర్ సమాధానం ఇవ్వకపోవటంతో, ఆయన కావాలనే కాలయాపన చేసారు అంటూ, కేశినేని నాని హైకోర్టుకు వెళ్లి వైసీపీకి షాక్ ఇచ్చారు. దీంతో కోర్టు, కొండపల్లిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, ఓటు వేసేందుకు కేశినేనికి అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ కు జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని, విచారణాను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. మరో పక్క టిడిపి వారిని లాగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని, టిడిపి ఆరోపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read