మన రాష్ట్రానికి ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ, విజయవాడకు ప్రత్యేకమైన అతిధుల బృందం వస్తుందని టిడిపి నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మాములుగా రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తారని, కానీ ఇప్పుడు మాత్రం జగన్ రెడ్డి పాలనలో, అప్పులు వసూలు చేసుకోవటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు వసూలు చేసుకోవటానికి, ఢిల్లీ నుంచి పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు, ఈ రోజు రాత్రికి విజయవాడ చేరుకోబోతున్నారని పయ్యావుల అన్నారు. గత రెండు రోజులుగా, వారి ప్రయాణం వాయిదా వేసుకోమని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనేక రకాలుగా ప్రయత్నం చేసారని అన్నారు. కానీ ఆ అధికారులు పరిస్థితి కూడా, రేపు తాము జవాబు దారీ కాబట్టి, విధి లేని పరిస్థితిలో, తమ అప్పులను వసూలు చేసుకోవటానికి, వస్తున్నారని పయ్యావుల అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయలు చెల్లించకపోవటంతో, రిజర్వ్ బ్యాంక్ నార్మ్స్ ప్రకారం, దాదాపుగా ఎన్పిఏ గ పరిగణించే పరిస్థితి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సంస్థలకు వచ్చాయని అన్నారు.
అందులో మరీ ముఖ్యంగా పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇచ్చిన అప్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాళ్ళకి కనీసం ఇన్ స్టాల్ మెంట్స్ కూడా కట్టకుండా బకాయలు పడ్డారని అన్నారు. ఇది గతంలో కూడా జరిగిందని, ఆ రోజు నుంచి ఇది మానిటర్ చేస్తున్నామని అన్నారు. పోయిన సారి అవే బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చి కాపాడాయని, కానీ రోజు పరిస్థితి చేయి దాటి పోయిందని పయ్యావుల అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులను, దేశం గుర్తించే పరిస్థితి, ఈ రోజు రాష్ట్రానికి వచ్చే అతిధులతో, మనకు వచ్చిందని అన్నారు. టిడిపి ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చిందని, ఆర్ధిక వ్యవస్థను కుప్ప కూల్చే పరిస్థితికి మీరు వచ్చారని, తాము హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసారు. అప్పులు చేసి అభివృద్ధి చేయాలి కానీ, ఈ అప్పులు అన్నీ ఏమి చేసారని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం వద్దకు, అప్పులు వసూలు చేసుకోవటానికి వస్తున్నారు అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలని కోరారు. అయితే కొద్ది సేపటి క్రితమే, ఈ బృందం, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగింది. రేపు ఏమి జరుగుతుందో చూడాలి.