ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు, బీజేపీ జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీరియస్ క్లాస్ పీకారు. ఈ రోజు రెండు సమావేశాలు తిరుపతిలో జరిగాయి. ముందుగా ఆయన ఎంపీలు సియం రమేష్, సుజనా చౌదరిలతో విడిగా దాదాపుగా గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులతో పాటుగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అదే విధంగా పార్టీ నేతలతో అమిత్ షా భేటీ నిర్వహించారు. ఈ భేటీ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నేతల తీరు పై క్లాస్ పీకారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి మీడియాని, రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో చెప్పాలి అంటూ, ఆయన బీజేపీ నేతలను నిలదీశారు. ఎవరో ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదం జరిగితే, అది పార్టీ ఎందుకు పులుముకుని, ఆ ఛానల్ ను మీరు ఎందుకు బ్యాన్ చేసారని నిలదీశారు. మరో పక్క సాక్షి ఛానల్ ను మీరు ఎందుకు బహిష్కరించ లేదని నిలదీశారు. సాక్షిలో ఏపి బీజేపీ నేతల వార్తలు వస్తున్నాయా అని అడిగారు. ఇటువంటి పనులు చేయవద్దు అని బీజేపీ నేతలకు అమిత్ షా స్పష్టం చేసారు. దీంతో పాటుగా, రాజధాని రైతులు చేస్తున్న న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో మీరు ఎందుకు పాల్గునటం లేదని బీజేపీ నేతలను నిలదీయటమే కాకుండా, కొంత మంది బీజేపీ నేతలు పాల్గుంటే, వారిని ఎందుకు వివరణ అడగటం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు.

bjp 15112021 2

అమరావతి రాజధాని అని ఏకగ్రీవ తీర్మానం చేసి, ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్రలో ఎందుకు పాల్గునలేదని ప్రశ్నించారు. దీంతో పాటుగా, పొత్తులు గురించి పదే పదే, మాటలు వినిపిస్తున్నాయని, పొత్తులు గురించి మీరు ఎవరూ మాట్లాడ వద్దని స్పష్టం చేసారు. ఈ దేశంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనేది, కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాత్రమే నిర్ణయిస్తారని, మీరెవరూ పొత్తులు విషయం పై మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఇక్కడ కొంత మంది అధికారులు కేంద్ర పెద్దల పేర్లు చెప్పుకుని, రాష్ట్రంలో పెత్తనం చేయాలని చూస్తే మాత్రం, ఎట్టి పరిస్థితిలో కూడా సహించబోమని స్పష్టం చేసింది. మన ప్రధాన ప్రత్యర్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు, ఎందుకు వారితో యుద్ధం చేయటం లేదని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో పార్టీ నుంచి కొంత మందిని సస్పెండ్ చేయటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కు అమిత్ షా గట్టిగా క్లాస్ పీకారని తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీ అవినీతి పై పోరాడాలని స్పష్టం చేసారు.

కుప్పం ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. తిరుపతి ఎన్నికల్లో లాగానే దొంగ ఓట్ల దందా కుప్పంలో జరపటానికి వైసీపీ ప్లాన్ చేసింది. అయితే ముందు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, అధికారులు సహకరించకపోయినా సరే, చేతనైన కాడికి వారిని అడ్డుకుంటూ వచ్చారు. తిరుమల తరహా అయితే, ఇక్కడ జరగలేదు అనే చెప్పాలి. కుప్పం ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఈ దొంగ ఓటర్లను పట్టుకున్నారు. ప్రతి నిమిషం, ప్రతి గంటా వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ టిడిపి శ్రేణులు ముందుకు కదిలాయి. మధ్యానం ఒంటి గంట సమయంలో వైసీపీ ఒక పెద్ద ట్రాప్ వేసింది. కుప్పంలో టిడిపి ఆఫీస్ దగ్గరే, టిడిపి శ్రేణుల పై లాఠీ చార్జ్ చేపించారు. ఈ సంఘటన తెలుసుకుని, వివిధ బుతుల్లో ఉన్న టిడిపి శ్రేణులు, మీడియా మొత్తం అక్కడకు చేరుకున్నాయి. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీరంతా ఇటు రాగానే, దొంగ ఓటర్లు యధేచ్చగా బూత్లలోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు లాఠీచార్జ్ పై ఆందోళన చేస్తున్న టిడిపి శ్రేణులు, పదే పది నిమిషాల్లో వ్యూహం మార్చేసాయి. వెంటనే ఇక్కడ నుంచి అందరూ బూత్ల వద్దకు వెళ్ళిపోయి, అక్కడ దొంగ ఓటర్ల భరతం పట్టారు.

kuppam 15112021 2

ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళనివ్వక పోయినా, వారు తప్పించుకుని అక్కడకు వెళ్లి, దొంగ ఓటర్లను పట్టుకున్నారు. మెరుపు వేగంతో టిడిపి వ్యూహం మార్చింది. ఒక వేళ టిడిపి ఇంకా లాఠీచార్జ్ దగ్గరే ఒక అరగంట ఉండి ఉంటే, దొంగ ఓట్లు అన్నీ పోలు అయిపోయేవి. ఈ విధంగా వైసీపీ పన్నిన ఒక భారీ కుట్రను టిడిపి భగ్నం చేసింది. ఉదయం నుంచి బస్సుల్లో వచ్చిన స్థానికేతరులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు ఎక్కడా చర్యలు తీసుకోలేదని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఛైర్మన్ అభ్యర్థి సుధీర్ ఉన్న 16వ వార్డులో వైసీపీ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ వార్డులో భారీగా స్థానికేతరులను దింపి, దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా విజయవాణి కళాశాల వద్ద వైసీపీ దొంగ ఓటర్లను డంప్ చేసింది. అక్కడకు వెళ్లి టిడిపి నేతలు, మీడియా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తానికి ఉదయం నుంచి టిడిపి శ్రేణులు, దీటుగా వైసీపీ అధికార బలాన్ని ఎదుర్కున్నాయి. ఎన్ని దొంగ ఓట్లు వేసినా, 80% ప్రజలు తమ వైపే ఉన్నరని టిడిపి అంటుంది.

కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. ఇప్పటికే దొంగ ఓట్ల కోసం పక్క నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. అయితే వీరిని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవటం, వారిని పట్టుకోవటం, మీడియాలో రావటంతో వైసిపీ నేతలు తలలు పట్టుకున్నారు. చివరకు తమ వద్ద ఉన్న అధికార బలన్ని వాడారు. టిడిపి నేతల అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసారు. కుప్పం మున్సిపల్ పరిధిలో స్థానిక టీడీపీ నేతలు అందరినీ అరెస్ట్ చేపించారు. అర్ధరాత్రి నుంచి కుప్పంలోని స్థానిక టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జనరల్ పోలింగ్ ఏజెంట్లను, వార్డు ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారి పైన ఎలాంటి కేసులు లేకపోయినా, వారిని అక్రంగా అరెస్ట్ చేసి లోపల ఉంచుతున్నారు. పోలింగ్ రోజున స్థానిక టిడిపి ముఖ్య నేతలు ఎవరూ లేకుండా చేయటానికి వారిని అరెస్ట్ చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాని, అరెస్ట్ చేసిన వారిని ఎక్కడ పెట్టారో కుదక్ చెప్పటం లేదని అంటున్నారు. ఒక పక్క వైసిపీ నేతలు దొంగ ఓటర్లను తెస్తుంటే, వారిని ఏమి అనటం లేదని వాపోతున్నారు.

రాజధాని అమరావతి కేసులు విచారణ ఈ రోజు హైకోర్టులో కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయ్యింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఈ వాదనలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం తరుపు న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులను ఈ బెంచ్ నుంచి విచారణ నుంచి తప్పించాలని కోరారు. వారికి అమరావతిలో, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఫ్లాట్లు వారికి ఇవ్వటం వలన, వారికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తో పాటుగా, మరో న్యాయవాది కూడా ఈ అభ్యంతరాలు కూడా లేవనెత్తారు. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని, రాష్ట్ర హైకోర్టులో ఉండే న్యాయమూర్తులకు, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఆస్తులు ఉంటాయని, ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటే, ఈ కేసుని వేరే రాష్ట్రంలోకి బదిలీ చేయాల్సి ఉంటుందని, వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలోనే సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జోక్యం చేసుకుని, ఒక వేళ మీరు మా విజ్ఞప్తిని తోసి పుచ్చితే, ఈ విషయాన్ని ఫైనల్ జడ్జిమెంట్ లో పోస్ట్ చేయాలని కోరారు. దీని పైన తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, న్యాయమూర్తులను తప్పించే అవకాసం లేదని, వాదనలు కొనసాగించాలని కోరారు.

cj 15112021 2

హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‍కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి రోజు కూడా ఈ కేసు పై రోజు వారీ విచారణ చేస్తామని స్పష్టం చేసారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో ఈ కేసులు విచారణ కారణంగా, ఈ కేసులు కారణంగా అభివృద్ధి ఆగిపోయినట్టు కనిపిస్తుందని, కక్షిదారులతో పాటుగా, ఇది అందరికీ ఇబ్బందిగా మారిందని, ఈ నేపధ్యంలోనే ఈ కేసులు విచారణ తొందరగా చేపట్టి, పూర్తి చేయాల్సిన బాధ్యత హైకోర్టు పై ఉందని, ఆయన స్పష్టం చేసారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనంలో ఎటువంటి మార్పులు ఉండ బోవని, ఈ త్రిసభ్య ధర్మాసనం మందే అందరూ వాదనలు వినిపించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే వాదనలను హైబ్రిడ్ పధ్ధతిలో కాకుండా నేరుగా వచ్చి వినిపిస్తే, ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుందని చెప్పటంతో, ప్రభుత్వ తరుపు న్యాయవాది దుష్యంత్ దవే తాను కూడా నేరుగా వచ్చి వాదనలు వినిపిస్తానని చెప్పారు. రైతులు తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు ప్రారంభించారు. ఇక నుంచి రోజు వారీ విచారణ జరగనుంది.

Advertisements

Latest Articles

Most Read