ప్రభుత్వాలు నడిపే ఆర్టీసీ బస్సులు పై ప్రజల్లో ఒకోసారి విసుగు వస్తూ ఉంటుంది. బస్సులు సమయానికి రావు, పనులు లేట్ అయిపోతాయి, స్కూల్స్కి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మనం వెళ్ళాల్సిన రూట్ లో బస్సులు కూడా క్యాన్సిల్ చేసేస్తారు. అయితే ఈ సమస్యలు పరిష్కారం కావాలి అంటే, ఆర్టీసి అధికారులకు మోర పెట్టుకుంటాం. సమస్య పరిష్కారం చాలా సార్లు అవ్వదు కూడా. అయితే ఇక్కడ మాత్రం, ఆర్టీసిలో బస్సుల సమస్య పై ఏకంగా ఈ దేశ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం, ఆయన స్పందించటం, సమస్య పరిష్కారం అవ్వటం కూడా జరిగిపోయాయి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్ధి, తాను ఎదుర్కుంటున్న సమస్య పై చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణకు లేఖ రాసారు. తమది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా,మేడ్చల్ మండలం చిడేడు గ్రామం అని, ఆర్టీసి బస్సులు సమయానికి రావటం లేదని ఫిర్యాదు వెళ్ళింది. ఫిర్యాదు చేసింది అదే గ్రామనికి చెందిన వైష్ణవి అనే 8వ తరగతి చదివే విద్యార్ధి. ఆర్టీసి బస్సులు సమయానికి రాక విసుగు చెంది, తాను ఈ సమస్య వల్ల స్కూల్ కి సరిగ్గా వెళ్ళలేక పోతున్నాను అంటూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసారు.

nvr 05112021 2

అయితే ఆ విద్యార్ధి వినతి పై ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా స్పందించారు. సమస్యను తెలంగాణా ఆర్టీసి అధికారులకు చెప్పారు. ఇంకేముంది, సాక్ష్యాత్తు చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా రంగంలోకి దిగే సరికి, ఆర్టీసి ఎండీ సజ్జనార్ కూడా అలెర్ట్ అయ్యారు. వెంటనే సమస్య గురించి అధికారులతో మాట్లాడారు. బస్సులు వెంటనే పునరుద్ధరించాలని, చెప్పి, సమస్య పరిష్కారం అయ్యేలా చూసారు. విషయం చీఫ్ జస్టిస్ కు చెప్పారు. సమస్య పరిష్కారం కోసం చీఫ్ జస్టిస్ పూనుకోవటంతో, ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. ఒక చిన్న పిల్ల రాసిన సమస్యకు కూడా చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా స్పందించటం, ఆ సమస్య పరిష్కారం అవ్వటం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వ్యవస్థలు అన్నీ ఇంతే బాధ్యతగా ఉంటే , ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయని అంటున్నారు. ఇలా సమాజంలో జరిగే అనేక సమస్యల పై ఇటీవిల చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా స్పందిస్తున్న తీరు, ప్రశంసలు అందుకుంటుంది.

విజయనగరం జిల్లాలోని లచ్చయ్య పేట షుగర్ ఫ్యాక్టరీలో మొన్న తమ బకాయల కోసం రోడ్డెక్కిన అరుగురు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయటంతో, పోలీసులపై రైతులు, రైతు సంఘాల నేతలు తిరగబడ్డారు. కొబ్బరిమట్టలు తీసుకుని వెంబడించారు. దీంతో రైతుల ఆగ్రహాన్ని గ్రహించిన పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు వారి పైన కేసులు పెట్టటం పై విమర్సు వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో ఈ రోజు రైతు సంఘాలు బంద్‍కు పిలుపునిచ్చాయి. ముందస్తుగా రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయనున్నారని తెలుస్తుంది. అయితే పోలీసులు కేసులు పెట్టటం పై, చంద్రబాబు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపితే, రైతుల పైనే అక్రమ కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లకు న్యాయం చేయాలి కానీ, ఇలా కేసులు పెడతార అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు, రోడ్డు మీదకు వస్తే, వాళ్ళ పైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అరాచకాలు మొదలు పెట్టింది. 12 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, ఇతర స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నిన్న దీపావళి రోజున కూడా నామినేషన్ వేయటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నికల నామినేషన్ పర్వంలో మళ్ళీ దౌర్జన్యాలు చేస్తుంది అధికార పక్షం. తూర్పు గోదావరి జిల్లాలోని, రంపచోడవరం నియోజకవర్గంలోని కూనవరం మండలం, కాచవరం గ్రామంలో ఒకటో వార్డు అభ్యర్ధి బొడ్డు శిరీషను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ఫోన్ చేసి బెదిరించటంపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బెదిరింపులకు సంబంధించిన వాయిస్ రికార్డుని, ఎన్నికల కమిషన్ కు అందించింది. అలాగే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లు, టిడిపి అభ్యర్ధి బొడ్డు శిరీష నేరుగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారు. శిరీషకు జరిగిన అన్యాయానికి తాము అందరం అండగా ఉంటాం అని చంద్రబాబు చెప్పారు. ఇక కుప్పం నగర పంచాయతీలో ప్రభుత్వం నియమించిన లోకేష్ వర్మ అనే ఎన్నికల ప్రత్యేక అధికారి పై కూడా తెలుగుదేశం అభ్యంతరం చెప్తుంది. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, లోకేష్ వర్మ వ్యవహరించిన తీరు పై, అప్పట్లోనే తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది.

cbn 05112021 2

అతని పై చర్యలు తీసుకోక పోగా, ఇప్పుడు తీసుకుని వచ్చి కుప్పంలో వేయటం పై తెలుగుదేశం ఆగ్రహంగా ఉంది. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయాకులతో, సన్నిహితంగా ఉన్న ఫోటోలను చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో బయటకు వదిలారు. అతన్ని ఎన్నికల విధులు నుంచి తొలగించాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. ఇక గుంటూరు జిల్లా గురజాలలో మళ్ళీ చెలరేగిపోయారు. టిడిపి అభ్యర్ధులు కోర్ట్ కు వెళ్ళటంతో, అభ్యర్ధికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అమలు కాకపోవటంతో, చంద్రబాబు రంగంలోకి దిగి, నిన్న కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదులు చేసారు. ప్రెస్ మీట్ పెట్టి, ఎండగట్టారు. దీంతో నిన్న రాత్రి ఆఘమేఘాల పై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, గుంటూరు కలెక్టర్, ఎస్పీకి వెంటనే టిడిపి అభ్యర్ధులు నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రక్షణ ఇవ్వాలి అంటూ, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలో, నక్కపల్లి మండలం వేంపాడులో ఉన్న టోల్‌ప్లాజాలో అరాచకం సృష్టించారు వైసీపీ నేతలు. టోల్‌ప్లాజాలో పని చేస్తున్న సిబ్బంది పై పాయకరావుపేట వైసీపీ నాయకులు దా-డి చేసారు. టోల్‌ప్లాజాలో వైసీపీ నేతలను టోల్ చార్జ్ అడిగినందుకు, టోల్ ప్లాజాలో పని చేస్తున్న ఉద్యోగి సత్యనారాయణ పై దా-డి చేసి, అతన్ని తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన సత్యనారాయణ అనే వ్యక్తిని నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కు హుటాహుటిన తరలించారు. అయితే తలకు గాయం బలంగా తగిలిందని, పరిస్థితి విషమంగా ఉందని, ఏదైనా పెద్ద హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని అక్కడ వైద్యులు సూచించటంతో, వెంటనే ఆ ఉద్యోగిని విశాఖలో ఉన్న ఒక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పై, టోల్ ప్లాజా సిబ్బంది, నక్కపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత పై ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న నక్కపల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. రోజు రోజుకీ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయని టిడిపి విమర్శిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read