టిడిపి అధినేత కొమ్మారెడ్డి పట్టాభి, వీడియో సందేశం విడుదల చేసారు. తన పై వైసిపీ చేస్తున్న విష ప్రచారం పై ఆయన స్పందిస్తూ, వీడియో సందేశం విడుదల చేసారు. "గంజాయి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే ఉద్యమాన్ని టిడిపి చేపట్టింది. చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం, ఈ ఉద్యమంలో నేను కూడా పాల్గున్నాను. కొద్ది రోజుల క్రితం కుట్ర పూరితంగా కొన్ని అవరోధాలు సృష్టించారు. ఆ సమయంలో చంద్రబాబు గారితో పాటుగా, లోకేష్ గారు, ఇతర టిడిపి నేతలు, సామాన్య ప్రజలు నాకు సుపోర్ట్ గా నిలిచారు. ఈ ఉద్యమం ఒక తరాన్ని గంజాయి బారి నుంచి కాపాడటం కోసం. గత రెండేళ్లుగా నేను అనేక ఆధారాలతో ప్రెస్ మీట్లు పెట్టాను. వాటికి సమాధానం చెప్పలేక, ఒక మాట అన్నానని, దానికి అర్ధాలు ఆపాదించి, నా ఇంటి పై దా-డి చేసారు. నేను లేని సమయంలో నా ఇంటి పైన దా-డి చేయటమే కాకుండా, 8 ఏళ్ళ నా కూతురుని కూడా భయానక వాతవరణంలో భయ పెట్టారు. ఆ పసి హృదయం భయానికి లోనయ్యింది. చిన్న వయసులో ఆ పాపకు గా-యం అయితే, దాన్ని రూపుమాపటం ఎంత కష్టమో మన అందరికీ తెలుసు. అయినప్పటికీ ఏ మాత్రం మానవత్వం లేకుండా, చిన్న పిల్లను ఒక షాక్ కు గురి చేసారు. బాధ్యత గల తండ్రిగా నా బిడ్డను, నా భార్యను తీసుకుని, ఈ వాతవరణం నుంచి బయటకు తీసుకుని వెళ్తే, దానికి కూడా విపరీత అర్ధాలు తీసారు.

pattabhi 26102021 2

"అనేక రకాలుగా ప్రచారాలు చేసారు వైసిపీ శ్రేణులు. ఈ వీడియో మెసేజ్ ద్వారా నేను ఒకటే తెలియ చేస్తున్నా, ఒక బాధ్యత గల తండ్రిగా ఈ రోజు ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, గా-య-ప-డి-న ఆ పసిహృదయాన్ని కాపాడటం కోసం, ఆ గా-యా-న్ని రూపుమపటం కోసం, ఒక బాధ్యత గల తండ్రిగా పని చేస్తున్నాను. దాని మీద కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ, విపరీత అర్ధాలు తీసారు. ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అతి త్వరలోనే నేను ఒక తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను, దీని తరువాత అతి త్వరలోనే, పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక బాధ్యత గల తండ్రిగా తిరిగి క్రియాశీలకంగా పాల్గుంటాను. గంజాయికు వ్యతిరేకంగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గుంటాను. ఈ కుట్ర పూరితమైన కేసులకు భయపడను. ప్రజల కోసం మరిన్ని నిజాలతో ప్రజల మందుకు వస్తాను. న్యాయబద్దంగా అన్ని కుట్ర పూరితమైన కేసులు ఎదుర్కుంటాను. అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను అని, మరోక్క సారి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు."

ఈ రాష్ట్రం 2014లో కట్టుబట్టలతో, అప్పులతో, రాజధాని లేకుండా రోడ్డున పడితే, మనకు ఒక అడ్డ్రెస్ ఇచ్చేలా చేసి, మనకు ఒక రాజధాని కోసం, ఈ రాష్ట్ర నడిఒడ్డులో అమరావతి అనే రాజధాని పెట్టుకోవటానికి, అక్కడ రైతులు భూములను త్యాగం చేసారు. ఈ రాష్ట్రంతో పాటుగా, తమ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు. 2019 వరకు అంతా సాఫీగానే సాగినా, తరువాత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాత నుంచి, మళ్ళీ ఏపి రాజధాని అడ్డ్రెస్ ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు, గంటలు, రోజులు, వారాలు, నెలలు అయిపోయి, ఇప్పుడు సంవత్సరాల దాకా వస్తుంది, వ్యవహారం. ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది ఈ ఉద్యమం మొదలు పెట్టి. అయితే ప్రభుత్వాలు మాత్రం స్పందించటం లేదు. దీంతో వారు ఇప్పుడు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రాష్ట్రం అంతా తమ కష్టాలు తెలిసేలా. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ, సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి, అమరావతిలోని హైకోర్టు దగ్గర నుంచి, తిరుపతిలో ఉన్న వెంకన్న గుడి వరకు మహా పాదయాత్ర చేయాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పాదయాత్రకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను కోరారు.

dgp 26102021 2

ఈ అనుమతి కోసం ఈ నెల 11న, అలాగే 12న, 14న కూడా వారు డీజీపీకి అనుమతి ఇవ్వాలని లేఖలు రాసారు. అయితే గడువు సమీపిస్తూ ఉండటం, సమయం దగ్గర పడుతూ ఉండటంతో, ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవటంతో, రాజధాని రైతులు కోర్టుని ఆశ్రయించారు. మా లేఖ పై, డీజీపీ స్పందించేలా చూడాలి అంటూ, హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పటికే రూట్ మ్యాప్ తో పాటుగా, అన్ని రకాల సమాచారం పోలీసులకు ఇచ్చాం అని కోర్టుకు తెలిపారు. రైతుల పిటీషన్ పై స్పందించిన హైకోర్టు, ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలో, పోలీస్ శాఖ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఏ నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియ చేయాలని డీజీపీని ఆదేశించింది. అయితే దీని పై స్పందించిన హోం శాఖ తరుపున హాజరు అయిన న్యాయవాది, తాము రూట్ మ్యాప్ ఇచ్చిన విధంగా, అన్ని జిల్లా ఎస్పీల నుంచి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నాం అని, ఎస్పీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా, తాము త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కోర్టుకు తెలిపారు.

ఆంధ్రపదేశ్ రాష్టంలో జరుగుతున్న అరాచకాల పై తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతిని కలిసి ఆయనకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పై, దాదాపుగా అరగంటకు పైగా, చంద్రబాబు రాష్ట్రపతికి వివరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు, ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దా-డు-ల పై, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఇక రాష్ట్రంలో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న గంజాయి పై కూడా ఫిర్యాదు చేసారు. అధికార పార్టీతో కలిసి, డీజీపీ చేస్తున్న పనులు వివరిస్తూ, డీజీపీని రీకాల్ చేయాలని ఆయన, రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గత రెండున్నరేళ్ళుగా ఏపిలో వైసిపి ప్రభుత్వం చేసిన అరాచకాల పై, స్టేట్ స్పాన్సర్డ్‌ టెర్రర్‌ ఇన్‌ ఏపీ అనే 300 పేజీల పుస్తకాన్ని కూడా చంద్రబాబు రాష్ట్రపతికి అందచేసారు. ఇక్కడ మాదకద్రవ్యాల ద్వారా డబ్బు సంపాదిస్తూ, ఆ డబ్బుని ఉగ్రవాద సంస్థలు చేరవేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ, అధికార పార్టీతో కుమ్మక్కు అయ్యి, రాష్ట్రంలో రాజ్యాంగం అమలు లేకుండా ప్రవరిస్తున్నారని, పోలీస్ వ్యవస్థను కూడా వైసిపీ ప్రభుత్వం ఆడిస్తుందని, ఏకంగా ఎంపీ రఘురామకృష్ణం రాజుని పోలీసులను అడ్డుపెట్టుకుని ఏమి చేసారో అందరం చూసాం అని అన్నారు.

president 26102021 2

నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వటం లేదని, అమరావతిలో రైతులు, మహిళల పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అమరావతి విషయం పై ఆరా తీసినట్టు తెలుస్తుంది. అమరావతిని అన్నిటిలాగే, దీన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి సర్వ నాశనం చేసారని రాష్ట్రపతికి టిడిపి నేతలు తెలిపారు. గతంలో రాష్ట్రపతి అమరావతి వచ్చిన సందర్భంగా, అయన అమరావతిలో పర్యటించారు. అలాగే అమరావతి పై రకరకాల వార్తలు అప్పట్లో వచ్చేవి. అందుకే అమరావతి పై రాష్ట్రపతి అడిగి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న ఘటనలు ప్రస్తావిస్తూ, వరప్రసాద్‌ అనే దళితుడికి శిరోముండనం చేసిన సందర్భంలో, మీ వరకు ఫిర్యాదు వచ్చినా, మీరు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరినా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్రపతికి గుర్తు చేసారు. దీని పై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. మీరు లేవనెత్తిన అంశాలు అన్నీ సీరియస్ అంశాలు అని, దీని పై తగు చర్యలు తీసుకుంటాను అంటూ రాష్ట్రపతి చెప్పినట్టు టిడిపి బృందం చెప్పింది.

తెలుగుదేశం పార్టీ నేత నాదెండ్ల బ్రహ్మం వేసిన బెయిల్ పిటీషన్ పై నిన్న వాదనలు జరిగాయి. విచారణ చేసిన హైకోర్టు, నాదెండ్ల బ్రహ్మంకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల బాండ్‌తో పాటుగా, రెండు పూచీకత్తులను సమర్పించి, బెయిల్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది బ్రహ్మం చౌదరిని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో తిరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా, దీనికి స్పందించిన కోర్టు, పూర్తిగా ఆదేశాలు ఇవ్వలేమని, మూడు వారాల పాటు బ్రహ్మం చౌదరి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో తిరగకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సహజంగా పోలీసులు వైఖరి ఇలాంటి కేసుల్లో ప్రశ్నార్ధకం అవుతూ ఉంటుంది. అయితే ఈ సారి జిల్లా జడ్జి ఎందుకు ఇలా చేసారు అంటూ, హైకోర్టు ప్రశ్నించటం కీలక అంశంగా చెప్పుకోవచ్చు. పోలీసులు అరెస్ట్ చూపించి, మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరు పరిచారు. ఆ సందర్భంలో మేడికొండూరు సీఐ తనను కొట్టారు అంటూ నాదెండ్ల బ్రహ్మం కోర్టుకు తెలిపారు. అయితే ఆ విషయాన్ని జడ్జి రికార్డ్ అయితే చేసారు కానీ, ఇతర ఏ ఆదేశాలు ఇవ్వకుండా, నాదెండ్ల బ్రహ్మంను రిమాండ్ కు పంపించారు.

brahmam 26102021 2

ఇదే అంశం పై హైకోర్టు నిన్న జిల్లా జడ్జిని ప్రశ్నించింది. పోలీసులు తనను కొట్టారని చెప్తున్నా, ఎందుకని అతని మాటలు పట్టించుకోలేదని, గాయాలు ఎందుకు పరిశీలించలేదని, వైద్య పరీక్షలకు పంపకుండా, రిమాండ్ కు ఎందుకు పంపారు అంటూ, హైకోర్టు జిల్లా జడ్జిని ప్రశ్నించింది. ఈ అంశం పై తమకు గురువారం లోపు వివరణ ఇవ్వాలని జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసులు అన్నీ ఏడేళ్ళ లోపు కేసులు అయినా, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా ఎందుకు అతన్ని అరెస్ట్ చేసారు అంటూ కోర్టు ప్రశ్నించింది. టిడిపి కార్యాలయం పై దా-డి సందర్భంగా, తాను అక్కడకు వెళ్ళగా, తనను కులం పేరుతో దూషిస్తూ , తన పై హ-త్యా-య-త్నం చేసారు అంటూ, డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నాదెండ్ల బ్రహ్మంను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసు పై బెయిల్ పై నాదెండ్ల బ్రహ్మం విడుదల అయ్యారు. విడుదల అయిన తరువాత, కొంత మంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అందరికీ వడ్డీతో సహా ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read