పోసాని కృష్ణమురళీ మెంటల్ కృష్ణ సినిమా తీసినట్టున్నారు. ఆయన వ్యవహారశైలి కూడా మెంటల్ మనిషిలాగానే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించిన ఇదే పోసాని కృష్ణమురళి..నేడు అదే బాలయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తనకి పదవి ఇచ్చిన జగన్ రెడ్డి ప్రాపకం కోసమేనని తేలిపోయింది. జగన్ రెడ్డి తనకు ఎఫ్డీసీ చైర్మన్ పదవి ఇచ్చారనే కృతజ్ఞతతో పోసాని కృష్ణమురళి పిచ్చపిచ్చగా మాట్లాడుతున్న తీరుపై టిడిపి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డికి భజన చేసుకుంటే తమకేమీ అభ్యంతరంలేదని, టిడిపి జోలికొస్తే పోసాని మెంటల్ వదిలించేలా జవాబిస్తామంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి బాలకృష్ణ మాట్లాడుతూ సైకో అనడంపై పోసాని కృష్ణమురళితో కౌంటర్ ఇప్పించారు. ముఖ్యమంత్రి సైకోనా, లేక బాలకృష్ణ సైకోనా అని ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ పోసాని రెచ్చిపోయారు. బాలకృష్ణ తుపాకీతో టపీ టపీమని ఇద్దరిని కాల్చేశారని సైకోలే ఇలా కాలుస్తారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ జగన్ రెడ్డి కోసం చేసిన సాని వ్యాఖ్యలేనంటున్నారు. 2020లో సినీ పరిశ్రమ రాజకీయ నేతలతో చర్చలకు బాలయ్యను ఆహ్వానించకపోవటంపై చాలా గౌరవంగా స్పందించిన పోసాని కృష్ణమురళి..2023లో జగన్ పదవి ఇచ్చాక స్పందించిన పోసాని మురళీ వ్యాఖ్యలు ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. `బాలయ్యకు కోపం ఎక్కువ అన్న మాట నిజమే, కానీ ఆ కోసం వెనుక పెద్ద కారణమే ఉంటుంది. నేను బాలయ్యతో రెండు మూడు సినిమాలకు కలిసి పనిచేశాను. ఆయన చాలా డీసెంట్‌గా ఉంటారు. పని పట్ల చాలా నిబద్దతగా ఉంటారు. మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు అన్నట్టు వ్యవహరిస్తారు బాలయ్య` అని చెప్పుకొచ్చారు. బాలయ్య ముఖానికి తెర వేసుకోడని లోపల ఏది అనిపిస్తే అదే చేస్తాడని చెప్పాడు. మేకప్ ముందు ఒక మాట మేకప్ తరువాత ఓ మాట చెప్పే మనస్తత్వం బాలయ్యది కాదని చెప్పాడు. వ్యక్తులు చిన్నవారా పెద్ద వారా అన్న విషయం పట్టించుకోకుండా సీఎం అయినా సామాన్యుడైనా ఒకే విధంగా బాలయ్య గౌరవిస్తాడని తెలిపాడు. అవినీతి అక్రమం చేద్దామన్న ఆలోచన కూడా ఆయనకు ఉండదని, చాలా జెన్యూన్‌గా ఉంటాడని, ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పదవిని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని బాలయ్య అనుకోలేదని 2020లో ప్రశంసించిన పోసాని 2023లో పదవి వచ్చేసరికి అదే బాలయ్యని సైకో-హంతకుడు అనడం ముమ్మాటికీ సాని కబుర్లేనని తేలిపోతోంది.
news
నారా లోకేష్ గంజాయి వద్దు బ్రో అంటుంటే..గంజాయి ఎంజాయ్
ఏపీలో విచ్చలవిడి గంజాయి అమ్మకాలకి అడ్డుకట్ట వేయాలని, మత్తులో జోగుతున్న యువత భవిష్యత్తు కాపాడాలని టిడిపి యువనేత నారా లోకేష్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఆయన ఉద్యమం నడుస్తున్న రోజుల్లోనే వేల కేజీల గంజాయి రాష్ట్రంలో యథేచ్ఛగా రవాణా అవుతోంది. చంద్రగిరిలో హైస్కూల్ పిల్లలు గంజాయి బానిసలయ్యారని, డ్రగ్స్‌పై చర్యలు తీసుకోవాలని లోకేష్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఏపీ సర్కారు మాదిరిగానే కేంద్రం కూడా తాము విడుదల ఎన్సీఆర్బీలో గంజాయిలో ఏపీ నెంబర్ వన్ ఉందని చెప్పి చేతులు దులుపుకుంది. గంజాయి, డ్రగ్స్ సర్కారు ఎలాగూ అరికట్టదు, తామే యువతని ఈ మహమ్మారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఉద్యమం టిడిపి ఆరంభించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గంజాయి వద్దు బ్రో #GanjaOdhuBro హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. యువగళం పాదయాత్రలో గంజాయి వద్దు బ్రో అంటూ లోకేష్, బాలయ్య ప్రచారం చేపట్టారు. ఓ వైపు గంజాయిని అరికట్టాలని టిడిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే, రేగుపాలెం మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ వద్ద చేసిన తనిఖీలలో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. లారీలో తీసుకెళ్తున్న సుమారు 1,200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతే అంతకుమించి ఈ గంజాయి యజమానులెవరో మాత్రం తేలదు.
చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ తో ఉలిక్కిపడ్డ వైసీపీ ఫేక్ ఎటాక్స్..టిడిపి కౌంటర్ అదుర్స్
కొడుకు లోకేష్ ఓ పక్క సెల్ఫీ చాలెంజులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..తండ్రి చంద్రబాబు కూడా రంగంలోకి దిగి సెల్ఫీ చాలెంజ్ విసిరి వైసీపీపై పొలిటికల్ ఎటాక్ గట్టిగానే చేస్తున్నారు. కౌంటర్ ఎలా ఇవ్వాలో తెలియక వైసీపీ బ్రాండ్ అయిన ఫేక్ ప్రచారంతో వచ్చింది. టిడిపి చంద్రబాబు సీఎంగా కట్టిన టిడ్కో ఇళ్లు తేదీలతో సహా పోస్ట్ చేసి కౌంటర్ ఎ టాక్ బాగానే చేసింది. నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి కాకాని టిడ్కో ఇళ్ల వద్దు కాదు, ప్రతీ ఇంటి వెళ్లి అడుగుదాం రమ్మంటూ చంద్రబాబుకి సవాల్ విసరడంతో ఓటమిని ఒప్పుకున్నట్టే అయ్యింది. చంద్రబాబు టిడిపి జోన్ -4 సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరు వెళ్తూ టిడిపి ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి జగన్ రెడ్డికి సవాల్ చేశారు. తమ హయాంలో ఇన్నిఇళ్లు కట్టామని మీ హయాంలో ఏం కట్టాలో చెప్పాలన్నారు. చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ ఎటాక్ ఊహించలేని వైసీపీ కిందిస్థాయి కేడర్ నుంచి టాప్ లీడర్ వరకూ అవాక్కయ్యారు. ముందుగా రంగంలోకి దిగిన సోషల్ మీడియా ఫేక్ మార్ఫింగ్ పోస్టులతో కౌంటర్ ఇచ్చామని మురిసిపోయింది. అయితే టిడిపి సోషల్ మీడియా వైసీపీ ఎస్ఎం పోస్టు చేసిన ప్రతీ పోస్టు డిటైల్డ్‌గా టిడిపి ప్రభుత్వంలో తేదీలు, ఒరిజినల్ ఫోటోలతో వేసి వైసీపీ ఫేక్ బాగోతం బట్టబయలు చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు వితండవాదంతో వస్తున్నారే కానీ, ఇళ్లు కట్టిన చాలెంజ్ స్వీకరించలేక చేతులెత్తేశారు.
బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ.. సోము వీర్రాజు ఎగ్జిట్..
బీజేపీ పెద్దలు పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి వీడ్కోలు సమయం దగ్గర పడిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఏపీ నేతల భేటీలు వీర్రాజు పదవికి ఎసరు పెట్టాయని విశ్లేషణలు వస్తున్నాయి. రెండుసార్లు జగన్ రెడ్డి ప్రధాని మోదీ, షాలని కలిసినా..ఆయన మిత్రుడైన సోము వీర్రాజు పదవికి ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. ఆ తరువాతే కీలకమైన భేటీలు వీర్రాజు వీడ్కోలుకి మార్గం చూపాయని అంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో ఈ ఇద్దరి నేతల ప్రభావం సోము వీర్రాజుపై తప్పక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు.. ఇటీవల.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ రెండు భేటీలు సోము వీర్రాజు పదవికే ఎసరు పెట్టాయని కమలనాథుల అంతర్గత చర్చల్లో వ్యక్తం అవుతోంది.