బీజేపీ పెద్దలు పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి వీడ్కోలు సమయం దగ్గర పడిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఏపీ నేతల భేటీలు వీర్రాజు పదవికి ఎసరు పెట్టాయని విశ్లేషణలు వస్తున్నాయి. రెండుసార్లు జగన్ రెడ్డి ప్రధాని మోదీ, షాలని కలిసినా..ఆయన మిత్రుడైన సోము వీర్రాజు పదవికి ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. ఆ తరువాతే కీలకమైన భేటీలు వీర్రాజు వీడ్కోలుకి మార్గం చూపాయని అంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో ఈ ఇద్దరి నేతల ప్రభావం సోము వీర్రాజుపై తప్పక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు.. ఇటీవల.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ రెండు భేటీలు సోము వీర్రాజు పదవికే ఎసరు పెట్టాయని కమలనాథుల అంతర్గత చర్చల్లో వ్యక్తం అవుతోంది.
బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ.. సోము వీర్రాజు ఎగ్జిట్..
Advertisements