గత నెల రోజులుగా ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మే విషయం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ పరిశ్రమలో కూడా చీలిక తెచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ విషయం పై వైసీపీ పై విరుచుకు పడ్డారు. ఇది రాజకీయ దుమారం కూడా రేపింది. పవన్ కళ్యాణ్ ఒక వైపు ఉంటే, చివరకు సొంత కుటుంబంలో ఉన్న చిరంజీవి కూడా పవన్ వైపు లేకుండా, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ముఖ్యంగా ప్రభుత్వం చెప్తుంది,ఇష్టం వచ్చినట్టు టికెట్ రెట్లు వసూలు చేస్తున్నారని, కొత్త సినిమా రిలీజ్ అయితే, పండుగ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారని. మరి ఇంతలా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుంటే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం, ఇందుకు విరుద్ధంగా ఉంది. దసరా పండుగ రోజు ఆర్టీసి వేసే స్పెషల్ బస్సుల్లో 50 శాతం పైగా చార్జీలు బాదేస్తారు అంట. అన్ని బస్సులను స్పెషల్ బస్సులుగా మార్చేస్తారు. ఇలా ప్రైవేటు బస్సులు వసూలు చేస్తే, నియంత్రించాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు ఇలా చేయటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. సినిమా టికెట్లు ఆన్లైన్ అని చెప్పి, ఇప్పుడు ఇదేమిటి అని ప్రశ్నిస్తున్నారు ? ప్రభుత్వం ఏమి చెప్పదలుచుకుంది ? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ విమర్శలకు ఏమి సమాధానం చెప్తుందో ?
news
ఆసక్తి రేపుతున్న విజయసాయి ట్వీట్
విజయసాయి రెడ్డి హవా రోజు రోజుకీ వైసిపీలో తగ్గిపోతుంది అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన పెట్టిన ట్వీట్ కూడా అందుకు అనుగుణంగానే ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. విజయసాయి రెడ్డి సహజంగా ప్రత్యర్ధుల పై దూకుడు మీద ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పై ప్రతి రోజు ఒంటి కాలు మీద వెళ్తూ, అసంబద్ధం అయిన ట్వీట్లు పెడుతూ ఉంటారు. ప్రతి రోజు వారిని టార్గెట్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా సందర్భంగా వచ్చినప్పుడు పెడుతూ ఉంటారు. అయితే ఆయన గత నెల రోజులుగా ఇలాంటి ట్వీట్లు ఏవి పెట్టటం లేదు. ట్విట్టర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి విజయసాయి ఇలా ఉండటం ఇదే ప్రధమం. ఇక విశాఖలో ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలో, విజయసాయి రెడ్డి వల్లే విశాఖలో వైసిపీ వెనకంజులో ఉందనే ప్రచారం వచ్చింది. మరో పక్క విజయసాయి సన్నిహిత వర్గాల పై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే, విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రిని కలిసిన ఫోటో, కేంద్ర ఆర్ధిక శాఖ ట్వీట్ చేసింది. ఇక గత్యంతరం లేదు అనుకుని, విజయసాయి కూడా రీట్వీట్ చేసారు. ఆయన కేంద్ర మంత్రులను కలిస్తే, హడావిడి చేస్తూ, ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకు కలిసింది చెప్పే వారు. ఇప్పుడు అదేమీ లేకుండా,కేంద్ర ఆర్ధిక శాఖ ట్వీట్ చేసే దాకా, ఆ విషయం బయటకు తెలియదు. ఈ మొత్తం పరిణామాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇంత చర్చ జరుగుతున్నా విజయసాయి మాత్రం వివివరణ ఇవ్వకపోవటం, మరింతగా ఈ ప్రచారాలకు తావు ఇస్తుంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్... ప్రయత్నాలు అన్నీ విఫలం...
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికను వాయిదా వేయాలి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎంపిపి అభ్యర్ధి షేక్ జబీన్ వేసిన పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. జబీన్ కుల ధృవీకరణ పత్రం పై తగిన నిర్ణయం తీసుకోవాలని, కలెక్టర్ ని హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, కుల ధృవీకరణ పత్రం ఇవ్వటానికి వారం రోజులు గడువును హైకోర్టు ఇచ్చింది. కుల ధృవీకరణ పత్రం ఇచ్చిన తరువాత మాత్రమే ఎంపిపి ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దుగ్గిరాల మండంలో మొత్తం 18 MPTC స్థానాలు ఉండగా, తెలుగుదేశం తొమ్మిది, వైసీపీ ఎనిమిది, జనసేన ఒక్క స్థానం గెలిచుకుంది. బీసిలకు ఎంపిపి పదవి రిజర్వ్ కాగా, తెలుగుదేశం నుంచి గెలిచిన ఏకైక ఎంపిపి అభ్యర్ధి జబీన్ కు కుల ధృవీకరణ పత్రం ఇవ్వటంలో అధికారులు ఆలస్యం చేసారు. ఇప్పటికే ఎన్నిక కావాల్సిన ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. తమ అభ్యర్ధికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవటంతో, టిడిపి సభ్యులు హాజరు కాలేదు. కోరం లేకపోవటంతో రెండు సార్లు ఈ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు వరకు ఈ విషయం వెళ్ళటం, వారం రోజుల్లోగా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని, అప్పటి వరకు ఎన్నిక జరపవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే తెలుగుదేశం నేతలు, మాత్రం వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా కూడా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని, అధికారులు కూడా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వటానికి ఇంత సమయం ఎందుకు, ఇన్ని నాటకాలు ఎందుకు అంటూ టిడిపి నేతలు అంటున్నారు. తమ అభ్యర్దులను లోబరుచుకోవటానికి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నో ఎత్తులు వేసారని, తమ అభ్యర్దులు ఎక్కడా లొంగక పోవటంతో, ఇప్పుడు దొడ్డి దార్లు తొక్కుతూ ఎంపీపీ పదవి కోసం, అడ్డదార్లు తొక్కుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అరాచకాలు ఎదుర్కుంటామని ధీమాగా చెప్తున్నారు. మరో పక్క ఈ రోజు హైకోర్టు తీర్పుతో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ అనే చెప్పాలి. ఈ వ్యవహారం పై, తదుపరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమి చేస్తారో చూడాలి.
సర్ సర్ అంటూ బిక్క మొహం... ఉద్యోగ సంఘ నాయకులను లైవ్ లో బెదిరించిది ఎవరు ?
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వారి తరుపున మాట్లాడటానికి ఉద్యోగ సంఘ నాయకులకు తప్పని పరిస్థితి. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నా రోజు రోజుకీ వారి పై ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలోనే నిన్న ఉద్యోగ సంఘ నాయకులు ప్రెస్ మీట్, పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే, ఉద్యోగ సంఘ నాయకులకు ఒక బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ సంభాషణ ఇలా సాగింది. సార్ సార్...నమస్తే సార్ అంటూ... సార్...సర్...సర్....ఏమి లేదు ..లే.. ఉంటాం ఉంటాం...కంటోల్ లో ఉంటాం సార్.. "ఐనాకూడా మేము సంయమనం చేస్తాం గానీ.. గవర్నమెంట్ కు ఆంటీ గా ..ఏమి లేదు సార్... సార్ .... సార్... అదేం ఉండదు సార్.. ఇదిగో ఈడనే ఉన్నాడు బొప్పారాజు పక్కనే ఉన్నాడు మాట్లాడండి సార్" అంటూ..ఫోన్ అందించాడు... "ఎవరు" అంటుంటే, అని నెమ్మదిగా చెప్పడంతో వారూ ఫోన్ తీసుకున్నారు. బొప్పరాజు కూడా లేదు సర్, మా మీద ప్రెజర్ ఉంది అంటూ మొహమాటంగా మాట్లాడారు, ఇది అక్కడే ఉన్న ప్రెస్ కెమెరాలు రికార్డ్ అయిపోయింది. నాయకుల తెర వెనుకటి అంతరంగం వేరు. ఇలా తెర ముందు దొరికిపోవడం ఇబ్బందే మరి. ఒకవైపు ప్రభుత్వానికి అల్టిమేటం అని ప్రెస్ ముందు చెప్పారు..కానీ ప్రభుత్వ పెద్దలతో మీకు వ్యతిరేకం కాదు కంట్రోల్ లో ఉంటాము అన్నారు. అయితే అసలు ఫోన్ చేసింది ఎవరు ? ఆ బిగ్ బాస్ ఎవరు అనేది తెలియాలి ?