సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పేరు చాలా పవర్ ఫుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన సలహదారుగా సజ్జల రామకృష్ణా రెడ్డిని, జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈయన అంతకు ముందు సాక్షిలో ఎడిటర్ గా పని చేసే వారు. జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర మనిషి. ఎన్నికల ముందు వరకు విజయసాయి రెడ్డి నెంబర్ 2 స్థానంలో ఉంటే, ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎన్నికల తరువాత తీసుకున్నారనే ప్రచారం ఉంది. విజయసాయి రెడ్డిని కేవలం మూడు జిల్లాలకు పరిమితం చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, జగన్ మోహన్ రెడ్డితో సరి సమానంగా పవర్స్ ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రతిపక్షాలు చేసే అనేక ఆరోపణల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. ముఖ్యంగా హోంశాఖ మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుందనే ప్రచారం ఉంది. అన్ని శాఖలు ఆయన కంట్రోల్ లో ఉంటాయని, ఆయన్ను సకల శాఖల మంత్రులుగా కూడా పిలుస్తారు. ఇక ప్రతిపక్షాలను టార్గెట్ చేయటంలో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డిదే కీలక పాత్ర. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, జగన్ మోహన్ రెడ్డి అలా చూస్తూ ఉంటారు, మొత్తం నడిపించేది సజ్జల. అలాంటి సజ్జల రామకృష్ణ రెడ్డిని, పవన్ కళ్యాణ్ కలిసారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు.

sajjala 03102021 2

నిన్న రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయటానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే, సజ్జల గురించి మంచి మాటలు చెప్పారు. తాను గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసానని, సజ్జల గారితో చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని అన్నారు. తాను ఏంటో సజ్జల గారికి తెలుసని, మన ఇద్దరి సంభాషణలో ఏమి మాట్లాడుకున్నమో బాగా తెలుసు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అంతే కాదు పదే పదే సజ్జలని, సజ్జల పెద్ద మనిషి, సజ్జల చాలా విజ్ఞులు అంటూ పవన్ కళ్యాణ్ అనటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. వైసీపీ ప్రభుత్వం అరాచకంలో సజ్జలది ప్రముఖ పాత్ర అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే, పవన్ ఇలా చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే అసలు పవన్, సజ్జలను ఎప్పుడు కలిసారు, ఎందుకు కలిసారు ? చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని పవన్ చెప్పటం వెనుక, అసలు ఈ భేటీ ఎందుకు జరిగింది, ఎందుకు ఇన్నాళ్ళు సీక్రెట్ గా ఉంచారు అనేది తెలియాల్సి ఉంది.

హూ ఈజ్ ది డాన్ ఆఫ్ డ్ర-గ్ మాఫియా ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నది తేలాలని, గడచిన నాలుగు నెలల్లోనే రూ.2లక్షల కోట్ల విలువైన డ్ర-గ్స్ వ్యాపారం రాష్ట్రంలో జరిగిందని, దాని వల్ల ఎన్ని లక్షల మంది యువత నిర్వీర్యమైందో ఎవరూచెప్పడంలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనేయథాతథంగా మీకోసం..... ఐవరీకోస్ట్ ప్రాంతం సౌత్ కోస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఆఫ్రికా లో కీలక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని హెరాయిన్ హబ్ గా సిలుస్తారు. అలాంటి ప్రాంతానికి వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు వెళ్లారు? ఆయన ఏం చెబుతున్నారంటే అక్కడ తాను బియ్యం గోదాములు నిర్మించడంకోసం వెళ్లానంటున్నారు. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్నాడట, ద్వారంపూడి లాంటి వ్యక్తే. ఆయన ఐవరీకోస్ట్ కు ఎందుకు వెళ్లారో తెలియాలి. డ్ర-గ్స్ గురించి చెబితేచాలు, డీజీపీ తనరెండు చెవులూ మూసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు తాను చెప్పేది రెండు చెవులూ రిక్కించి మరీవినాలి. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ కాందహార్, ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడి విజయవాడ...? ఆఫ్ఘనిస్తా న్ లోని కాందహార్ లో గల హస్సన్ హుస్సేన్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూంటుంది. అక్కడి నుంచి బయలుదేరే డ్ర-గ్స్, మాదకద్రవ్యాలు తొలుత ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్టుకి చేరుతాయి. అక్కడి నుంచి సముద్రమార్గంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి చేరాయి. గుజరాత్ లోని ముంద్రా పోర్టుకి జూన్ లో 25 మెట్రిక్ టన్నుల హెరాయిన్ వచ్చింది. అక్కడి నుంచి కాకినాడలోని అలీషాకు చెందిన శాన్ మెరైన్ కంపెనీకి ఆ హెరాయిన్ చేరింది. అక్కడినుంచి విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ కు, 25 మెట్రిక్ టన్నుల (దానివిలువ సుమారు రూ.75కోట్ల విలువ ఉంటుంది.) హెరాయిన్ చేరింది. కాకినాడకు చెందిన అలీషా, వినోద్ అగర్వాల్ లు ఇద్దరూ బడా వ్యాపారులని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారు. అషీ ట్రేడింగ్ కంపెనీ యజమాని సుధాకర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, అషీ అనే పేరు అతనెలా పెట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మిత్రుడు, సుధాకర్ కు సన్నిహితుడైన షేక్ అలీషా కూతురిపేరు అషీ. అషీ అనేపేరు సుధాకర్ తనకంపెనీకి ఎందుకు పెట్టు కున్నాడని ఆరాతీస్తే, సదరు కంపెనీని అలీషానే రిజిస్టర్ చేయించాడని తెలిసింది. విజయవాడలోఉన్న అషీ ట్రేడింగ్ కంపెనీ కేవలం రెండు గదుల్లో మాత్రమే ఉంటుంది.

కానీ దాని కార్య కలాపాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అషీ ట్రేడింగ్ కంపెనీ ఒక సూట్ కేసు కంపెనీ. కాకినాడకు వచ్చిన హెరాయిన్ అక్కడి నుంచి చెన్నైకు చేరుతుంది. చెన్నైలో వై.ఎస్.అనిల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన షాలోమ్ ఇండస్ట్రీస్ కు చేరుతుంది. సదరు అనిల్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు వరుస అవుతాడని చెబుతున్నారు. అవునో, కాదో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆఫ్గనిస్తాన్ నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి చెన్నైకి, అక్కడి నుంచి ఐవరీకోస్ట్ కు హెరాయిన్ చేరుతుంది. అదే ఐవరీకోస్ట్ లో తాను బియ్యం గోదాములు నిర్మిస్తున్నానని వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలకు జరుగతున్న దానికి ఎక్కడా పొంతనలేదు. ఇంతభారీ మొత్తంలో డ్ర-గ్స్ వ్యాపారం ఏపీ కేంద్రంగా ఆఫ్ఘనిస్తాన్ టూ ఐవరీకోస్ట్ కు జరుగుతుంటే, డీజీపీ రాష్ట్రానికి ఏంసంబంధం లేదని బాధ్యత లేకుండా మాట్లాడవచ్చా? డీజీపీ వ్యాఖ్యలవల్ల, రాష్ట్రంలో జరుగుతున్న డ్ర-గ్స్ దందా వల్ల ఎన్నిలక్షలమంది యువత జీవితాలు నిర్వీర్యమవుతున్నాయో ఆయన ఆలోచించకపోతే ఎలా? అషీ ట్రేడింగ్ కంపెనీ కార్యకలాపాలు ఏవీ ఏపీలో లేవని డీజీపీ ఎలా చెప్పారు?

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికున్న సంబంధాలు, షేక్ అలీషా వ్యవహారం, అతనితో సుధాకర్ కు, వినోద్ అగర్వాల్ కుఉన్న సంబంధాలు, వారందరితో చెన్నైలోని షాలోమ్ ఇండస్ట్రీస్ వై.ఎస్.అనిల్ కుఉన్న సంబంధాలేమిటో పోలీసలుతేల్చరా? చెన్నైనుంచి ఐవరీకోస్ట్ కు జరుగుతున్న హెరాయిన్ రవాణాలో ఇంకెందరి ప్రమేయముందో తేల్చాల్సిన బాధ్యత ఏపీ పోలీస్ కు లేదా? మహమ్మద్ షేక్ అలీషా, తన కూతురిపేరుతో రిజిస్టర్ చేసిన కంపెనీకి సుధాకర్ ఎలా యజమాని అయ్యాడు. దాన్ని అతనెలా నిర్వహిస్తున్నాడనేది పోలీసులు కనిపెట్టరా? ఎక్కడి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఆంధప్రదేశ్? ఎక్కడి కాందహార్ ఎక్కడి విజయవాడ? ఏమైనా సంబంధముందా అసలు? హెరాయిన్ రావడమేంటి? దాన్ని ఏపీ నుంచి మరోచోటికి సరఫరా చేయడమేంటి? డీజీపీ ఈ కేసుని సీరియస్ గా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లక్షలాది మంది యువత ఇప్పటికే నిర్వీర్యమయ్యారు. మరి కొన్ని లక్షలమంది నిర్వీర్యమయ్యే ప్రమాదముంది. ఐవరీకోస్ట్ కు వైసీపీఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు వెళ్లారు ? ఈ వ్యవహారాలన్నీ తేల్చరా? అందుకే ప్రధానిమోదీ, కేంద్రహోం మంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నా? ఈ వ్యవహారం వెనకున్న వారెవరో తేలాలంటే ఎన్ఐఏకు (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రులను కోరుతున్నా.

రీల్ వెనక్కు తిప్పి, 2019 ముందుకు వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు చెవుల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, విడతల వారీగా మందు షాపులు ఏత్తేస్తాను, కేవలం ఫైవ్ స్టార్ హోటల్ లోనే, మందు ఉండేలా, అది కూడా షాక్ కొట్టే ధరలు ఉండేలా చేస్తాను, డబ్బు ఉన్న వాడే మద్యం కొనుక్కుని, అక్కడే తాగి పడతాడు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రచారానికి, ఆడవాళ్ళు ఓట్లు వేసారనే చెప్పాలి. అయితే ఎన్నికలు అయిన తరువాత, మొదటి ఏడాది అక్టోబర్ 2న 4,380 షాపుల నుంచి, 3,500 షాపులకు తగ్గించి, మొత్తం ప్రభుత్వమే నడిపేలా పాలసీ తీసుకుని వచ్చారు. అప్పట్లో అందరూ మద్య నిషేధం చేస్తున్నాడనే అనుకున్నారు. అప్పుడే మొదలైంది అసలు సినిమా. మంచి బ్రాండులు అన్నీ పోయాయి. ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్, ఇలా వింత వింత పేర్లతో మందు దిగింది. అవి తాగితే పేగు పూత, కడుపు మంట, నాలిక మంట. సర్లే ఏదో ఒకటి తాగుదాం అనుకుంటే, 50 రూపాయల క్వార్టర్, 200 చేసి పడేసారు. క-రో-నా మొదలై షాపులు అన్నీ కొన్ని నెలలు మూసేసి, మళ్ళీ తెరిచే సమయానికి మరి కొన్ని షాపులు తగ్గించి 2,934కు తెచ్చారు. మద్య నిషేధం ఏమో కానీ, ప్రభుత్వానికి వద్దంటే ఆదాయం, వేల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది.

gandhi 02102021 2

నెలకు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది. ఇప్పుడు 2021 అక్టోబర్ 2. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడో గాంధీ జయంతి. ఇంకేముంది, ఈ సారి కూడా షాపులు పూర్తిగా తగ్గించేస్తారు, వచ్చే ఏడాదికి ఇక ఫైవ్ స్టార్ట్ హోటల్స్ కు మాత్రమే పరిమితం అని డబ్బా కొట్టారు. అయితే నిన్న గాంధీ జయంతి సందర్భంగా, మందు బాబులుకు బంపర్ ఆఫర్ ఇస్తూ గజెట్ విడుదల చేసారు. మద్య నిషేధంలో భాగంగా ఈ ఏడాది ఒక్క షాపు కూడా మూయటం లేదు అంట. మొత్తం 2,934 షాపులు అలాగే ఉంటాయి. వీటికి తోడుగా కొత్తగా పర్యాటక ప్రాంతాల్లో షాపులు, వాన్ ఇన్ స్టోర్స్ వస్తున్నాయి. ఇది చూసిన వైసీపీ శ్రేణులు కూడా షాక్ అయ్యాయి. అసలు ఇదేమి మద్య పాన నిషేధం అంటూ, పెదవి విరుస్తున్నారు. ఒకపక్క రేట్లు పెంచి ,ఆదాయం భారిగా పెంచుకుని, ఇప్పుడు షాపులు కూడా తగ్గించకపోతే, ప్రజలకు ఏమి సమాధానం చెప్తాం అంటూ, సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికి గాంధీ జయంతి సందర్భంగా, జగన్ తీసుకున్న నిర్ణయంతో, వైసిపి శ్రేణులు తలలు బాదుకుంటున్నాయి.

మద్య నిషేధం పేరుతో మహిళల్ని మోసం చేసిన జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు రాకుండా అడ్డుకుంటామని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు.  ప్రభుత్వం తెచ్చిన నూతన మద్య విధానాన్ని నిరసనగా తెలుగు మహిళా సంఘాలతో కలిసి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం బయట మద్యం సీసాలను పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడతూ.. మద్యం షాపులను ఏటా తగ్గించుకుంటూపోతానని మహిళలకు మాటిచ్చి రెండేళ్లుగా అలాంటి చర్యలేమీ చేపట్టలేదని దుయ్యబట్టారు. గాంధీ జయంతి నాడు మద్యం షాపులను ప్రభుత్వం తగ్గింస్తుందని ఎదురు చూసిన మహిళా లోకానికి కొత్తగా మాల్స్ రూపంలో మద్యం దుకానాలను తెస్తూ షాకిచ్చారని విమర్శించారు. జనం రక్తాన్ని జగన్ జలగలా తాగుతున్నారని, మహిళల ఉసురుకొట్టుని పోతారని ఆక్షేపించారు. వైసీపీ నేతల కంపెనీల్లో తయారైన నకిలీ మద్యం తప్ప మరో బ్రాండ్ రాష్ట్రంలో కనిపించడం లేదని విమర్శించారు. మద్య నిషేధం హామీ అమలు చేయకపోతే ప్రభుత్వ షాపులపై మహిళలతో కలిసి దా-డి చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దితే జగన్ వచ్చాక మద్యాంధ్రప్రేదేశ్ గా మార్చారని దుయ్యబట్టారు. నవరత్నాలలో ఒక రత్నం రాలిపోయిందని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read