సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పేరు చాలా పవర్ ఫుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన సలహదారుగా సజ్జల రామకృష్ణా రెడ్డిని, జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈయన అంతకు ముందు సాక్షిలో ఎడిటర్ గా పని చేసే వారు. జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర మనిషి. ఎన్నికల ముందు వరకు విజయసాయి రెడ్డి నెంబర్ 2 స్థానంలో ఉంటే, ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎన్నికల తరువాత తీసుకున్నారనే ప్రచారం ఉంది. విజయసాయి రెడ్డిని కేవలం మూడు జిల్లాలకు పరిమితం చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, జగన్ మోహన్ రెడ్డితో సరి సమానంగా పవర్స్ ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రతిపక్షాలు చేసే అనేక ఆరోపణల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. ముఖ్యంగా హోంశాఖ మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుందనే ప్రచారం ఉంది. అన్ని శాఖలు ఆయన కంట్రోల్ లో ఉంటాయని, ఆయన్ను సకల శాఖల మంత్రులుగా కూడా పిలుస్తారు. ఇక ప్రతిపక్షాలను టార్గెట్ చేయటంలో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డిదే కీలక పాత్ర. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, జగన్ మోహన్ రెడ్డి అలా చూస్తూ ఉంటారు, మొత్తం నడిపించేది సజ్జల. అలాంటి సజ్జల రామకృష్ణ రెడ్డిని, పవన్ కళ్యాణ్ కలిసారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పారు.
నిన్న రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయటానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే, సజ్జల గురించి మంచి మాటలు చెప్పారు. తాను గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసానని, సజ్జల గారితో చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని అన్నారు. తాను ఏంటో సజ్జల గారికి తెలుసని, మన ఇద్దరి సంభాషణలో ఏమి మాట్లాడుకున్నమో బాగా తెలుసు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అంతే కాదు పదే పదే సజ్జలని, సజ్జల పెద్ద మనిషి, సజ్జల చాలా విజ్ఞులు అంటూ పవన్ కళ్యాణ్ అనటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. వైసీపీ ప్రభుత్వం అరాచకంలో సజ్జలది ప్రముఖ పాత్ర అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే, పవన్ ఇలా చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే అసలు పవన్, సజ్జలను ఎప్పుడు కలిసారు, ఎందుకు కలిసారు ? చాలా విషయాలు మాట్లాడుకున్నాం అని పవన్ చెప్పటం వెనుక, అసలు ఈ భేటీ ఎందుకు జరిగింది, ఎందుకు ఇన్నాళ్ళు సీక్రెట్ గా ఉంచారు అనేది తెలియాల్సి ఉంది.