వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ అనుమానితుడిగా ఉన్న క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త్వ‌ర‌లో క‌డిగిన ముత్యంలా అన్న చెంత‌కి రావ‌డం ఖాయ‌మ‌ని ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. మూడుసార్లు విచారించిన సీబీఐ బాబాయ్ హ‌త్య‌కేసులో అబ్బాయ్ హ‌స్తంలో కీల‌క ఆధారాలు దొర‌క‌డంతో నేడో రేపో అరెస్టు చేస్తుంద‌నుకున్న ద‌శ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. వెంట‌నే ద‌ర్యాప్తు అధికారిని మార్చాల‌ని అవినాష్ రెడ్డి కోర‌డం, సుప్రీంకోర్టు జ‌డ్జి కూడా ద‌ర్యాప్తు అధికారినే మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టి మార్చేశారు. అరెస్టు కావాల్సిన అవినాష్ రెడ్డి హాయిగా న‌వ్వుతూ, తుళ్లుతూ కేంద్ర‌మంత్రుల‌తో భేటీ అవుతున్నారు. కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీని క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చి వ‌చ్చారు. ఇక సీబీఐ త‌న జోలికి రాద‌ని ఎవ‌రో గ‌ట్టిగా భ‌రోసా ఇచ్చిన‌ట్టున్నారు. టూర్లు మీద టూర్లు వేస్తున్నారు. త‌న అన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఇంటికి కూడా చుట్ట‌పు చూపుగా వ‌చ్చి వెళ్లారు. సీబీఐ అవినాష్ రెడ్డి తండ్రిని కూడా విచార‌ణ‌కి పిలిచింది. ఆయ‌న వెళ్ల‌లేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామ‌ని కోర్టులో అఫిడ‌విట్ వేసింది. అదీ చేయ‌లేదు. అంటే అన్న జ‌గ‌న్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైన‌ట్టేన‌ని, అవినాష్ రెడ్డి సేఫ్ అని వైసీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ర‌డుగ‌ట్టిన ఫ్యాక్ష‌నిస్టు మ‌న‌స్త‌త్వం అని ఆయ‌న‌కి ద‌గ్గ‌ర‌గా ఉండి, వేగ‌లేక దూర‌మైన వారు చెప్పే మాట‌. ఏదైనా క‌ష్ట‌ప‌డి సంపాదించాల‌ని అనికాకుండా కొట్టేయాల‌నే మెంటాలిటీ అని వారే చెబుతుంటారు. తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి సొమ్ముతో సాక్షి పెట్టి ఈనాడుని కొట్టేయాల‌నుకున్నారు. 15 ఏళ్ల‌యినా అది సాధ్యంకాలేదు. జీవిత‌కాలంలో సాధ్యం కాదు. తాను చేసిన దొంగ‌ప‌నుల‌కు సీబీఐ-ఈడీలు ఏ1గా పేర్కొన్నాయి. అయితే తన అక్ర‌మాస్తుల కేసులో వార్త‌లు రాసేట‌ప్పుడు ఈనాడు మీడియాలో ఏ1గా రాసేవారు. అలాగే అవినీతి కేసుల‌న్నీ లోతుగా విశ్లేషిస్తూ ప్ర‌త్యేక క‌థ‌నాలు రాసింది ఈనాడు. దీంతో ఈనాడుపై క‌క్ష క‌ట్టిన జ‌గ‌న్ రెడ్డి ఇన్నాళ్ల‌కి త‌న చేతికి అధికారం రావ‌డం, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల అండ‌దండ‌లుండ‌డంతో రామోజీరావుని మార్గ‌ద‌ర్శి కేసులో అరెస్టు చేయించాల‌ని సీఐడీని వ‌దిలారు. 86 ఏళ్ల రామోజీరావు అనారోగ్యంతో మంచం ప‌ట్టి ఉంటే, ఆయ‌న‌ని సీఐడీ విచారిస్తున్న ఫోటోలు త‌న మీడియా ద్వారా బ‌య‌ట‌కి పంపి వికృతానందం పొందారు. ఇంత చేసిన జ‌గ‌న్ రెడ్ది క‌క్ష తీర‌లేదు. రామోజీరావు ఏ1, ఆయ‌న కోడ‌లిని ఏ2 చేసేశారు. అయితే వారిని ఎలాగైనా అరెస్టు చేయాల‌నే క‌సితో ఉన్నారు జ‌గ‌న్ రెడ్డి. అయితే మార్గ‌ద‌ర్శిలో చిట్స్ వేసిన వారి ప్ర‌యోజ‌నాల కోసం అంటూ ఎవ్వ‌రూ ఫిర్యాదు చేయ‌క‌పోయినా రాష్ట్ర‌మంతా మార్గ‌ద‌ర్శి బ్రాంచీల‌పై దాడులు చేసి, బ్రాంచీలు మూసేసి, బ్రాంచి మేనేజ‌ర్ల‌ను అరెస్టు చేయించారు జ‌గ‌న్ రెడ్డి. అయితే వేల మంది మార్గ‌ద‌ర్శి ఖాతాదారుల‌లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా త‌మ సొమ్ము తిరిగి ఇవ్వాల‌ని కానీ, త‌మ‌ని చిట్స్ పేరుతో మోస‌గించార‌ని ఈ రోజువ‌ర‌కూ ఫిర్యాదులూ ఇవ్వ‌లేదు. రోడ్డెక్కి ఆందోళ‌న చేయ‌లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, చిట్స్ ఎప్ప‌టి నుంచి వేస్తారో, వేస్తే త‌మ‌ని స‌భ్యులుగా చేర్చుకోవాలంటూ ఉద్యోగులు-వ్యాపారులు మార్గ‌ద‌ర్శి వారిని బ‌తిమాలుతున్నారు. రామోజీ పై ఎన్ని కుట్రలు చేసినా, ఒక్క ఖాతాదారు కూడా ముందుకు రాలేదు. సీఐడీ పేరుతో మార్గ‌ద‌ర్శిలో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తే, ఖాతాదారులు ఒకేసారి వచ్చి, రామోజీ మీద పడాలని జగన్ కుట్ర ప‌న్నితే, ఒక్క ఖాతాదారుడు బ‌య‌ట‌కి రాలేదు.  రామోజీరావు మంచంపై ఉన్న‌ ఫోటోని బ‌య‌ట‌కి విడుద‌ల చేసి, ఆయన ఆరోగ్యం పోయింద‌ని, మీ డబ్బులు రావు అనే విధంగా జ‌నంలోకి ప్ర‌చారం చేయాల‌ని చూస్తే, అది కాస్తా విక‌టించింది. ఖాతాదారుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌ని రామోజీరావు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు.

ఏపీని మ‌రో పంజాబ్‌లా చేశార‌ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశార‌ని టిడిపి ఎంపీ (రాజ్య‌స‌భ‌) క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ వెల్ల‌డించారు. కుటుంబంతో క‌లిసి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని ఎంపీ మీడియాకి చెప్పారు. పంజాబ్ లాగా ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన మోదీ, ఏపీలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని, అస‌లు ఏపీలో ఈ అరాచ‌కం ప్ర‌బ‌ల‌డానికి అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తూ వ‌స్తున్న‌ది బీజేపీ పెద్ద‌లేన‌న్న‌ది సుస్ప‌ష్టం. అన్ని రాష్ట్రాలకీ అప్పుల కోసం ఆంక్ష‌లు విధించిన కేంద్రం, ఏపీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పు తెచ్చుకోవ‌చ్చు..క‌లెక్ట‌రేట్లు, త‌హ‌సీల్దారు కార్యాల‌యాలే కాదు ఏకంగా తాగుబోతుల్ని కూడా తాక‌ట్టు పెట్టి అప్పు తెచ్చుకునే వెసులుబాటు క‌ల్పించింది మోదీ సారే క‌దా.. లిక్క‌ర్ స్కాం అంటూ క‌విత‌, శ‌ర‌త్ చంద్రారెడ్డి, మాగుంట రాఘ‌వ‌పై కేసులు పెట్టిన కేంద్ర స‌ర్కారు, దేశంలోనే అతి పెద్ద లిక్క‌ర్ స్కామ్‌లో ఏపీలో జ‌రుగుతుంటే క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టంలేదు. ఏపీలో అరాచ‌కాలు సాగ‌డానికి, పంజాబ్ లా జ‌గ‌న్ రెడ్డి మార్చేయ‌డానికి అస‌లు కార‌కులు ఎవ‌రో అంద‌రికీ తెలుసు. అప్పులు, అరాచ‌కాలు, అవినీతి ఏపీలో పెచ్చ‌రిల్లి బీహార్ ని మించిపోయేలా, పంజాబ్ కంటే ఘోరంగా త‌యారు చేసింది జ‌గ‌నే అయినా, ఆయ‌న వెనుకున్న‌ది ఎవ‌రో నెల‌లో రెండు అపాయింట్మెంట్లు ఇస్తున్న ఏలిక‌ల‌కి తెలియ‌దా?

నారా లోకేష్ గేమ్ ఛేంజ‌ర్. ఇప్పుడు ఇదే మాట తెలుగుదేశంలోనా, వైసీపీలోనా వినిపిస్తోంది. యువ‌గ‌ళం పాద‌యాత్ర ఆరంభంలో జ‌నం రావ‌డంలేద‌ని ట్రోల్ చేసే వైసీపీ నేత‌లు ఇప్పుడు ఏ నియోజ‌క‌వ‌ర్గంలో, ఏ వైసీపీ ఎమ్మెల్యే అవినీతి బండారం బ‌య‌ట‌పెడ‌తాడోన‌నే ఆందోళ‌న‌లో ఉంటున్నారు. పాద‌యాత్ర పూర్త‌య్యే నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే యువ‌గ‌ళం స‌భ‌లో అక్క‌డి అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా నేత అవినీతి చిట్టా ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టేస్తున్నారు. పాద‌యాత్ర‌లో వైసీపీ నేత‌ల దోపిడీని సెల్ఫీ  చాలెంజుల‌తో ఎండ‌గ‌డుతున్న లోకేష్‌, బ‌హిరంగ‌స‌భ‌లో అవినీతి ఆధారాలు బ‌య‌ట‌పెడుతున్నారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేల క‌రెప్ష‌న్ క‌థ‌ల‌న్నీ జ‌నం మ‌ధ్య పెట్టేస్తున్న లోకేష్ ఆట‌ని ఒక్క‌సారిగా మార్చేశారు. అనంత‌పురం జిల్లాలో పాద‌యాత్ర ప్ర‌వేశించాక పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధ‌ర్ రెడ్డిని దోపిడీకుంట శ్రీధ‌ర్ రెడ్డి అంటూనే ..ఎక్క‌డెక్క‌డ ఎంత వ‌సూలు చేశాడో వెల్ల‌డించారు లోకేష్‌, పెనుగొండ, రాప్తాడు, ధర్మవరం ఎమ్మెల్యేల బండార బ‌య‌ట‌పెట్ట‌డంలో లోకేష్ అధికార పార్టీనే సందిగ్దంలో ప‌డేశారు. ఇన్నాల్లూ యూట్యూబ్ షార్ట్స్‌, ఇన్ స్టా రీల్స్‌లో హ‌ల్ చ‌ల్ చేసే ధ‌ర్మ‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి నిజ‌స్వ‌రూపాన్ని అవినీతి అన‌కొండ రూపాన్ని ప్ర‌జ‌ల ముందుంచ‌డంలో లోకేష్ తెగువ‌ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read