రెండు రోజుల క్రితం జగన మోహన్ రెడ్డి, ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అంటూ, చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. రెండున్నరేళ్ళ ముందే జగన్ ఈ మాటలు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా, వచ్చే ఎన్నికల కోసమే అన్నట్టుగా ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని నిర్ణయాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత, తాను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం, రోశయ్యకు సియం పదవి ఇచ్చింది. అప్పట్లో రోశయ్య పై జగన్ వర్గం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తనకు రావాల్సిన పదవి రోశయ్య కొట్టేసారని, జగన్ వర్గం రోశయ్య పై ఎదురు దాడి చేసి,ఒక అసమర్దుడిగా చిత్రీకరించింది. అయితే తరువాత కాలంలో రాజకీయాలు మారిపోయాయి. గవర్నర్ గా కూడా చేసిన రోశయ్య, ప్రస్తుతం వయోభారంతో, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రోశయ్యకు ఆయన సామజికవర్గంలో మంచి పట్టు ఉంది. సరిగ్గా ఇదే ఇప్పుడు ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారా అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తే, అవును అనే సమాధానం వస్తుంది. రోశయ్యను మంచి చేసుకుంటే, రోశయ్య సామాజికవర్గానికి దగ్గర కావచ్చని వైసీపీలోని కొంత మంది ముఖ్యులు ప్లాన్ గా తెలుస్తుంది.

rosaiah 19092021 2

అందుకే ఇటీవల ప్రకటించిన టిటిడి బోర్డులో, పైడా కృష్ణ ప్రసాద్ అనే అతినికి కూడా చోటు కల్పించారు. ఈయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, అలాగే విశాఖలో విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈయన ఎవరో కాదు, స్వయానా రోశయ్య అల్లుడు. గతంలో రోశయ్యను టార్గెట్ చేసి, ఇప్పుడు మచ్చిక చేసుకుంటున్నారు. ఈ నియామకం వెనుక విజయసాయి రెడ్డి హస్తం ఉందనే ప్రచారం జరుగుతుంది. విశాఖలో చీమ చిటుక్కుమన్నా విజయసాయికి తెలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో విశాఖను ఎంపిగా పోటీ చేయాలని విజయసాయి భావిస్తున్న తరుణంలో, ఆయన సిఫారుసు మేరకే, ఈ నియామకం జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. విశాఖ అర్బన్ లో ఉన్న వైశ్య సామజికవర్గాన్ని మచ్చిక చేసుకోవటానికి, విజయసాయి రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్తున్నారు. పైడా కృష్ణ ప్రసాద్ అనేక విద్యాసంస్థలు కూడా ఉండటంతో, విశాఖకు రాజాధానిని తరలించిన తరువాత, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ బిల్డింగ్లలో ఉంటాయానే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి గతంలో ఎవరిని అయితే దించటానికి ప్రయత్నించారు, ఇప్పుడు ఆ రోశయ్యనే మచ్చిక చేసుకుంటున్నారు. ఇదే కదా రాజకీయం అంటే.

పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్ధానాలు గెలిచిందని వైసీపీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పరిషత్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీనే చేయలేదు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరింది. టీడీపీ ఎన్నికలు బహిష్కరిస్తే టీడీపీ కంటే ఎక్కువ సీట్లు గెలిచామని మంత్రులు ఏవిధంగా మాట్లాడుతారు? వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో దా-డు-లు, దౌర్జన్యాలు, అరచకాలకు పాల్పడి ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్చను, చివరకు ఓటు హక్కును కూడా హరించారు. టీడీపీ అదికారంలో జరిగిన ప్రతిఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 2017 లో 9 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ కేవలం 3 స్ధానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో అన్ని గెలిచాం. ‎కడప ఎమ్మెల్సీ, నంద్యాల ఉప ఎన్నిక, 2015 లో గుంటూరు, క్రిష్టా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిచాం. కాకినాడ కార్పేషన్ల ఎన్నికల్లో 49లో స్ధానాల్లో 39 గెలిచాం. ప్రజల్ని మెప్పించి ఈ ఎన్నికల్లో గెలిచాం. కానీ వైసీపీ మాత్రం దా-డు-లు, దౌర్జన్యాలతో ప్రజల్న భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలిచింది. మాచర్లలో బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దా-డి చేశారు, తెనాలిలో టీడీపీ అభ్యర్ధి ఇంట్లో మద్యం సీసాలు పెట్టి అక్రమ కేసులు పెట్టారు.

tdp 19092021 2

పుంగనూరులో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుంటే..గిరిజనమహిళ బురాఖా వేసుకుని వెళ్లినా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని ఆమెపై, ఆమె భర్తపై దా-డి చేసి చంపుతామని బెదిరించారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72 శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. రాష్ట్రం మెత్తం ఈ విధంగా దా-డు-లు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవటం సిగ్గుచేటు. గతంలో జయలలిత కూడా స్ధానిక ఎన్నికలను బహిష్కరించారు. రాష్ర్టంలో రాక్షస పాలన సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అరాచాకాలపై ముఖ్యమంత్రి ఒక్క గంట దృష్టి పెట్టలేరా? అన్నపూర్ణగా పేరొందిన ఏపీని బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ లతో పోటీపడే పరిస్థితి తెచ్చారు. చివరకు రైతులకు పండించిన పంటల్ని కూడా దళారులతో దోచుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 25 సీట్లు కూడా రావు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు.

రాష్ర్టంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో నిన్న చంద్రబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటన అద్దంపడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కొండపల్లి అక్రమ మైనింగ్ వెలికితేసేందుకు వెళ్లినపుడు నా కారుపై దా-డి-కి పాల్పడ్డ వ్యక్తుల్నే నిన్న చంద్రబాబు ఇంటిపై దా-డి చేసేందుకు జోగి రమేష్ వెంట పెట్టుకుని వచ్చారు. 5 చెక్ పోస్టులు దాటుకుని జెడ్ క్యాటగిరి ఉన్న చంద్రబాబు ఇంటికి రౌ-డీ మూ-క-లు ఎలా వచ్చాయో హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. జోగి రమేష్ చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తున్నారని సోషల్ మీడియాలో ముందే వైరల్ అయ్యాయి. కానీ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ప్రతిపక్షంగా మేం ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే..హౌస్ అరెస్టులు చేసి అడ్డుకుంటున్నారు. లోకేష్ నరసరావు పేట వెళ్తుంటే వందల మంది పోలీసుల్ని పెట్టి ఆపారు. కానీ న్యాయమూర్తులు ప్రయాణించే దారిలో, జెడ్ కేటగిరి ఉన్న చంద్రబాబు ఇంటికి అరాచక శక్తుల్ని ఏవిధంగా వెళ్లనిచ్చారు? ముఖ్యమంత్రి కనుసన్నలల్లో, సజ్జల రామకృష్ణారెడ్డి డీజీపీ ఆదర్వంలోనే నిన్నటి ఘటన జరిగింది. జెండా కర్రలతో వైసీపీ కార్యకర్తలు దా-డు-ల-కు పాల్పడుతుంటే తాము నిస్సహాయులుగా ఉన్నామని పోలీసులే చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకంగా ప్రవర్తిసుంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారా? దీనిపై సమాధానం ప్రజలకు చెప్పరా? జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబును బంగాళఖాతంలో కలపాలి, చెప్పుతో కొట్టండి అంటూ మాట్లాడారు. ఇప్పుడు అదే బాష వ్యవహారశైలిని వైసీపీ నాయకులు అనుసరిస్తున్నారు. నిన్న ఘటనపై జోగి రమేష్ డ్రైవర్ ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతలపై 15 సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ పై బెయిలబ్ కేసులు పెట్టారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏ రాష్ర్టంలోనైనా ఇంత అరాచాక పాలన సాగుతోందా? గతంలో బీహార్ గురించి చెప్పుకునే వాళ్లు ఇప్పుడు ఏపీ గురించి చెప్పుకుంటున్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యబద్దంగా సమాధానం చెప్పకుండా దా-డు-లు చేస్తారా?

సిగ్గులేకుండా మళ్లీ ఇవాళ అయ్యన్న పాత్రుడి ఇంటిపైకి దాడికి వెళ్లారు. టీడీపీ నేతలపై దా-డు-లు చేస్తున్న గూం-డాల-పై కేసులు పెట్టకుండా దాన్ని ఎదుర్కొన్న టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడతారా? ఇదేనా పోలీసు వ్యవస్ధ పనిచేసే తీరు? నిన్న డీజీపీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను బయట నిలబెట్టి..మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు పోలీసులు రెడ్ కార్పెట్ పరిచి లోపలికితీసుకెళ్లారు. అధికారం శాశ్వతం కాదు, తప్పు చేసిన అధికారుల పేర్లన్నీ రాసుకుంటున్నాం. తప్పు చేసిన ఏ ఓక్కరూ తప్పించుకోలేరు. నరసరావు పేట నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుని తప్పుడు కేసులో పోలీసు స్గేషన్ కి తీసుకెళ్లి పోలీసులతో కొట్టడమే కాక, వైసీపీ కార్యకర్తలతో కొట్టించి వైసీపీ నేతలకు వీడియో చూపించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును సీఐడీ కార్యాలయంలో కొడుతూ వీడియో చూసి వైసీపీ పెద్దలు పైశాచిక ఆనందం పొందారు. యధారాజా తధా ప్రజా అన్నట్టుంది. చిలకలూరి పేటలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. నిన్నటి ఘటనపై అమరాతి దళిత జేఏసీ నాయకుడు పులి చిన్నా ఫిర్యాదు చేశాడని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు అతనిపై దా-డి-కి పాల్పడ్డారు. ఏంటి ఈ అరాచకం? టీడీపీ నేతలపై ఇన్ని సెక్షన్లు ఎందుకు పెట్టారు? బుద్దా వెంకన్న, పట్టాభి, గద్దె రామ్మెహన్, బ్రహ్నం , రఘరామ కృష్ణం రాజును అరెస్టు చేయడానికా? ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడరు. జగన్ పాలన వైఫల్యాలు తప్పులు బయపెడుతున్నారనే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నా కారుపై దా-డి చేసిన వారిని అరెస్టు చేసి ఉంటే ..నిన్న చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దా-డి చేసేవారా? నిన్న జరిగిన ఘటనలో అరగంట వరకు పోలీసులు రాలేదు. రాష్ర్టంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? ఒక్కసారి అయినా ప్రజల్లోకి వచ్చారా? కోవిడ్ ఆస్పత్రులకు వచ్చి ఒక్కరినైనా పరామర్శించారా? వైయస్ వర్ధంతులు, జయంతులు, వైసీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పెల్ళిళ్లికు తప్ప ఏనాడైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చారా?

రాష్ట్ర వ్యాప్తంగా సమాచార శాఖకు సంబందించిన అధికారులకు, ఉదయమే షాక్ తగిలేలా, అనుభవం ఎదురు అయ్యింది. సమాచార శాఖకే సమాచారం బంద్ అయ్యింది. అది కూడా ప్రభుత్వ నిర్వాకంతో, దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాచార శాఖ అధికారుల ఫోన్ లు అన్నీ బంద్ అయ్యాయి. దానికి కారణం ఏమిటి అంటే, సమాచార శాఖకు చెందిన అధికారులకు ఫోన్ బిల్లులు చెల్లించక పోవటంతో, ఆ సర్వీస్ ప్రొవైడర్ లు, ఫోన్ లన్నీ బంద్ చేయటం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలోనే, సెల్ ఫోన్స్ అన్నీ మూగబోవటంతో, సమాచార శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు ఎదురు అవుతున్నాయి. ఉన్నతాధికారులు కానీ, మీడియా కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, సమాచార శాఖ అధికారులు మాత్రం, ఫోన్ లో అందుబాటులో లేరు. మొత్తం 13 జిల్లాలకు చెందిన సమాచార శాఖ అధికారులు, ఫొన్లు అన్నీ పూర్తిగా మూగబోయాయి. దీంతో వాళ్ళు అంతా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారు ఏదైనా సమాచారం పంపించాలి అన్నా, సమాచారం రిసీవ్ చేసుకోవాలి అన్నా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ipr 19092212

ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న కొన్ని చోట్లకు, మీడియా కానీ, ఇతర అధికారులు కానీ వెళ్ళే అవకాసం ఉండదు. అక్కడ నుంచి సమాచారం రావాలి అన్నా, సమాచారం అందించాలి అన్నా, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచార శాఖ ముఖ్య అధికారుల దగ్గర నుంచి, కింద వరకు కూడా, అందరి ఫోన్లు ఆగిపోవటంతో, అధికారాలు అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే సమాచార శాఖ అధికారులను ప్రైవేటు ఫోన్ లు వాడుకునే, సమాచారం ఇవ్వాలని అనధికార ఆదేశాలు వెళ్ళాయి. అయితే ఇదే శాఖలో ఇలా జరగటం రెండో సారిగా చెప్తున్నారు. దీని పట్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు, చికాకు కూడా గురి అవుతున్నారు. సమాచార శాఖలోనే రెండో సారి ఇలా జరగటంతో, షాక్ అయ్యారు. ప్రభుత్వం వద్ద సొమ్ములు లేక ఇబ్బందులు పడుతున్నారా, లేక ఏదైనా సమస్య వల్ల ఫోన్ బిల్లులు కట్టలేదా అనే విషయం తెలియటం లేదు. ఈ రోజు ఆదివారం కావటంతో, ఈ సమస్య రేపు పరిష్కరించే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read