ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కనకరాజ్ కు భారీ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా ఇటీవల జస్టిస్ కనకరాజ్ ని నియమిస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ కనకరాజన్ ను నియమిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ, హైకోర్టు న్యాయవాది కిషోర్ పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ తరుపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. అందులో ప్రధానంగా రెండు విషయాలు తమ వాదనల్లో హైకోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా, సుప్రీం తీర్పునకు విరుద్దంగా ఈ నియామకం ఉందని వాదించారు. అదే విధంగా, పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ ను నియమించటానికి కొన్ని, నిబంధనలు పాటించాలని, ఆ నిబంధనలకు విరుద్దంగా అవి పాటించకుండా, ప్రభుత్వం జీవో జారీ చేసిందని అనేది పిటీషనర్ తరుపున వాదనలు విన్పిస్తూ తెలిపారు. అలాగే మరో అంశంగా, ఆయన వయోపరిమితి గురించి ప్రస్తావించారు. వయోపరిమితికి చాలా వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ నిబంధనలకు ప్రస్తుతం, ఆయన ఉన్న వయోపరిమితి, చాలా తేడా ఉందని కూడా ధర్మాసనం ముందు వాదించారు.

kanakraj 16092021 2

పిటీషనర్ తరుపున వాదనలు విన్న తరువాత, హైకోర్టు తమ తీర్పు ని ప్రకటించింది. జస్టిస్ కనకరాజ్ ని పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జస్టిస్ కనకరాజ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆయన కానీ, ప్రభుత్వం కానీ సుప్రీం కోర్టు కు అపీల్ కి వెళ్తుందేమో చూడాలి. ఈ తీర్పుతో జస్టిస్ కనకరాజ్ ను రెండో సారి షాక్ తగిలినట్టు అయ్యింది. మొదటిసారిగా, ఆయన్ను ఎన్నికల కమీషనర్ గా నియమించారు. లాక్ డౌన్ ఉన్నా సరే, ఆయన్ను చెన్నై నుంచి తీసుకుని వచ్చి మరీ, రాత్రికి రాత్రి ప్రమాణస్వీకారం చేయించారు. చివరకు ఆయనకు రెండు కోర్టుల్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది. అయితే అప్పట్లో ఆయనకు చెల్లించిన కొన్ని ఖర్చులు కూడా ఆయనే పెట్టుకోవాలని తీర్పు కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా మ్యానేజ్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ కూడా కనకరాజ్ కు ఎదురు దెబ్బ తగిలింది.

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకి, పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయటం పై, ఈ రోజు రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామి, మరో న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పై ఈ రోజు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, అలాగే స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఎండీ ఇరువురినీ కూడా ఈ రోజు హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు ఇరువురి అధికారులు కూడా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు హాజరు అయ్యారు. గతంలో గుంటూరు జిల్లా మాచర్ల, మరో చోట, చెత్త నుంచి సంపద తాయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేయటమే కాకుండా, అందులో ఉపయోగించే విద్యుత్ మోటార్లకు కూడా వైసీపీ రంగులు వేయటం పై, కృష్ణా జిల్లాలోని జై భీమ్ ఆక్సిస్ అధ్యక్ష్యుడు సురేష్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ రోజు అధికారులు హైకోర్ట్ విచారణకు హాజరైన సందర్భంగా, ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

dvivedi 16092021 2

గతంలో రంగులు వేయటం పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు, అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఈ రెండు తీర్పులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తుందని అని చెప్పి హైకోర్టు నిలదీసింది. కోరు ఆగ్రహంతో అధికారులు దిగి వచ్చారు. దీని పై మూడు వారాల్లో లోపుగానే రంగులు అన్నీ తొలగిస్తామని కోర్టుకు తెలిపారు. దీనికి హైకోర్టు అంగీకరిస్తూ, అక్టోబర్ 6వ తేదీ లోగా రంగులు అన్నీ తొలగించారని ఆదేశాలు ఇచ్చింది. రంగులు తొలగించిన తరువాత, తమకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికే కాదని, పిటీషనర్ కూడా రంగులు తొలగించారో లేదో, తమకు తెలపాలి అంటూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలోనే ఆదేశాలు ఉన్నా, మళ్ళీ కోర్టు తీర్పు ధిక్కరించి రంగులు వేయటం పై, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో, ప్రభుత్వం పై ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. కోర్టులు చెప్తున్నా, ప్రభుత్వం వినకపోవటం పదే పదే ఇలాంటి కేసులు రావటం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు షాక్ ఇచ్చింది. ఇద్దరు సీనియర్ అధికారులకు శిఖ విధిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ ఆదేశాలు అమలు చేయనందుకు, కోర్టు ధిక్కరణ కింద, చర్యలు తీసుకోవటమే కాదు, అరెస్ట్ చేయాలని, శిక్ష కూడా విదిస్తాం అంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారి పూనం మాల కొండయ్య, అదే విధంగా మరో ఐఎస్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎంత కాలం శిక్ష అనేది ఈ నెల 29వ తేదీన ఖరారు చేస్తామని హైకోర్టు చెప్పింది. ఈ కేసు వివరాలు చూస్తే, గత ఏడాది ఫిబ్రవరి 28న, సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయం పై, కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్ళారు. ఈ నేపధ్యంలోనే, గత ఏడాది ఫిబ్రవరి 28న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు అధికారులకు కోర్టు దిక్కరాణ కింద కోర్టు శిక్ష విధించింది. అయితే ఈ రోజు కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినా, కోర్టు ఆదేశాలు పాటించనందుకు, ఐఏఎస్ అధికారి పూనం మాల కొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

poonam 150925021 2

ఈ నెల 29న , ఇద్దరికీ శిక్షలు ఖరారు చేస్తామని కోర్టు చెప్పింది. అయితే ఇద్దరికీ ఎంత కాలం శిక్ష విధిస్తారు అనేది అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇద్దరు అధికారులు హైకోర్టులో అపీల్ చేస్తారా అనేది కూడా చూడాలి. గతంలో కూడా ఇలాగే కొంత మంది అధికారులకు శిక్ష పడగా, ఇన్నాళ్ళు తాము చేసిన సర్వీస్ చూసి, క్షమించాలి అని కోరటంతో, గతంలో హైకోర్టు మెత్తబడింది. మరి ఈ కేసు విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి. హైకోర్ట్ ఒప్పుకోక పొతే, సుప్రీం కోర్టుకు అపీల్ కు వెళ్ళే అవకాసం ఉంది. అయితే ఇంత పెద్ద సీనియర్ అధికారులు కూడా ఎందుకు ఇలా ప్రతి రోజు ఏదో ఒక కేసులో హైకోర్టు దగ్గర కోర్టు దిక్కరణకు పాల్పడి ఇబ్బందుల పాలు అవుతున్నారో అర్ధం కావటం లేదు. ఈ రోజు నరేగా బిల్లులు విషయంలో చీఫ్ సెక్రటరీని కూడా కోర్టు, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పిన విషయం తెలిసిందే. మొత్తంగా అనేక ఇబ్బందులు పాలు అవుతున్నారు ఐఏఎస్ అధికారులు. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు కానీ, అధికారులు బలి అయిపోతున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి, మొత్తం జగన్ మోహన్ రెడ్డి కేసులు చుట్టూ తిరుగుతున్నాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటీషన్ పై ఈ రోజు తీర్పు వచ్చింది. రఘురామరాజు పిటీషన్ కొట్టేస్తూ, జగన్ కు ఊరటను ఇచ్చే తీర్పుని సిబిఐ కోర్టు ప్రకటించింది. దీని పై రఘురామరాజు, తాను హైకోర్టులో అపీల్ కు వెళ్తాను అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇలా ఉంటే, ఇంత కంటే ముందు, ఉదయం కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా ఈ రోజు సిబిఐ ఇచ్చే తీర్పు పై తనకు నమ్మకం లేదు అంటూ, రఘురామకృష్ణం రాజు నిన్న తెలంగాణా హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ కోర్టు తీర్పు రాక ముందే సాక్షిలో వచ్చిందని, అలాగే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ఈ బెంచ్ అనుమతి ఇచ్చిందని, మొత్తంగా ఈ బెంచ్ ఇచ్చే తీర్పు పై నమ్మకం లేదని, వేరే బెంచ్ కు బదిలీ చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై నిన్న వాదనలు జరగగా, ఈ రోజు తీర్పు వచ్చింది. అయితే రఘురామరాజు పిటీషన్ కొట్టివేస్తూ తెలంగాణా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రోజు సిబిఐ కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక మరో అంశం కూడా ఈ రోజు చోటు చేసుకుంది.

sakshi 15092021 2

ఇదే పిటీషన్ విషయంలో, గత నెలలోనే సిబిఐ కోర్టు, జగన్ బెయిల్ పిటీషన్ రద్దు పై తీర్పు వస్తుందని అందరూ భావించారు. ఆ సమయంలో కోర్టు కంటే ముందే, సాక్షి మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ని సిబిఐ కోర్ట్ డిస్మిస్ చేసింది అంటూ, ట్వీట్ చేసింది. కోర్టు చెప్పక ముందే, ఏ మీడియా కూడా వేయక ముందే, సిబిఐ కోర్టు తీర్పుని సాక్షి టీవీ వేసేసింది. అయితే దాని పై ఇప్పటికే సాక్షి మీడియా పై, రఘురామకృష్ణం రాజు కోర్టు దిక్కరణ పిటీషన్ వేసారు. దీని పై వాదనలు జరిగాయి. అయితే ఈ రోజు సిబిఐ కోర్టు, తమకు కోర్టు ధిక్కరణ పిటీషన్ పై చర్యలు తీసుకునే అవకాసం లేదు అంటూ, ఈ కేసుని హైకోర్ట్ కు బదిలీ చేసింది. అయితే ఇందులో సాక్షి మీడియా కోర్టు ధిక్కరణ ఉందని భావించే, విచారణ జరపిన తరువాత, ఒక అంచనాకు వచ్చి సిబిఐ కోర్టు, హైకోర్టుకు బదిలీ చేసిందని రఘురామరాజు అంటున్నారు. దీంతో ఇప్పుడు హైకోర్టు ఈ విషయంలో, సాక్షి మీడియా పై కోర్ట్ ధిక్కరణ చర్యలు మొదలు పెడుతుందేమో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read