ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత పది రోజులుగా విమర్శలు ఎదుర్కున్న అంశాలు రెండు. ఒకటి సినిమా టికెట్ల వ్యపారం చేయటం. రెండు మటన్ మార్ట్ లు పెట్టి మటన్ అమ్మటం. అయితే మటన్ మార్ట్ లు పెడుతున్నాం అని, జగన్ మోహన్ రెడ్డి గారి సొంత సాక్షి పత్రికే చెప్పింది. మటన్ మార్ట్ లు వచ్చేస్తున్నాయి అంటూ గొప్పగా రాసారు. అయితే నిన్న స్పందించిన మంత్రి అప్పల రాజు, ప్రభుత్వం మటన్ అమ్మటం లేదని, అది ఎల్లో మీడియా సృష్టి అంటూ చెప్పుకొచ్చారు. మరి మంత్రిగారు, తమ ముఖ్యమంత్రి సొంత పేపర్ ని, ఎల్లో మీడియా అనే సాహసం చేసారు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ అంశం ఇలా ఉంటే, సినిమా టికెట్ల వ్యాపారం పై కూడా ప్రభుత్వం ఈ రోజు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వమే ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి, ఇక నుంచి సినిమా టికెట్లు అమ్ముతుంది అంటూ, ఒక జీవో ఒకటి పది రోజుల క్రితం విడుదల అయ్యింది. ఈ జీవో చూసిన చాలా మంది ఆశ్చర్య పోయారు. అసలు ప్రభుత్వం టికెట్లు అమ్మటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. పౌర సమాజం మొత్తం స్పందించినా, సినిమా ఇండస్ట్రీ నుంచి సినీ పెద్దలు కానీ, సినీ హీరోలు కానీ, ప్రొడ్యూసర్ లు కానీ, డిస్టిబ్యూటర్లు కానీ, ఎవరూ కూడా ఈ అంశం పై స్పందించ లేదు. బహుసా ప్రభుత్వం అంటే భయం వల్ల ఏమో అని అందరూ అనుకున్నారు.

perni 14092021 2

సినీమా వాళ్ళకి కేసీఆర్ అన్నా, జగన్ అన్నా భయం కాబట్టి, ఎవరూ స్పందించ లేదు అని అనుకున్నారు. అయితే ఈ రోజు అసలు విషయం చెప్పారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యాపారం చేస్తుంది అంటూ వస్తున్న వార్తల పై మంత్రి పేర్ని నాని స్పందించారు. తాము సినిమా టికెట్లు అమ్మే విషయం సొంతగా తీసుకున్న నిర్ణయం కాదని, ఒక పక్క సినీ పెద్దలు, సినీ హీరోలు, ప్రొడ్యూసర్లు, డిస్టిబ్యూటర్లు ఇలా అందరూ కూడా, ప్రభుత్వమే టికెట్ లు అమ్మాలని తమను కోరాయని, ప్రత్యేకంగా తనను ఎంతో మంది కలిసి ఈ విషయం చెప్పారని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సినిమా టికెట్లు అమ్మే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సమీక్ష చేస్తున్నామని, దీని పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అంతే కాదు, చిరంజీవి ఫోన్ చేసి జగన్ అపాయింట్మెంట్ అడిగారని, ఆగష్టు చివరి వారంలో ఉండాల్సి వచ్చిన, కుదరలేదని, త్వరలోనే వారు వచ్చి జగన్ ని కలుస్తారని పేర్ని నాని చెప్పారు. మొత్తానికి సినీ పెద్దలు కోరితేనే తాము సినిమా టికెట్లు అమ్మే విషయంలో నిర్ణయం తీసుకున్నామని పేర్ని నాని అన్నారు.

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై, భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు వేసిన ఈ పిటీషన్ పై, రేపు అంటే, సెప్టెంబర్ 15వ తేదీన తీర్పు ఇస్తాం అంటూ సిబిఐ కోర్టు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అయితే గత నెలలోనే జగన్ కేసు పై తీర్పు రావాల్సి ఉంది. అయితే అదే రోజు జగన్ మోహన్ మోహన్ రెడ్డి కేసుతో పాటు, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై కూడా కోర్టు తుది వాదనలు విని, జగన్ కేసుతో పాటుగా, విజయసాయి రెడ్డి కేసు పై కూడా సెప్టెంబర్ 15న తీర్పు ఇస్తాం అంటూ, సిబిఐ కోర్టు చెప్పటంతో, ఇరు పక్షాల న్యాయవాదులు ఒప్పుకున్నారు. అయితే అదే రోజు మరో ట్విస్ట్ కూడా రాష్ట్ర ప్రజలు చూసారు. ఒక పక్క వాదనలు జరుగుతూ ఉండగానే, సాక్షి ట్విట్టర్ లో, జగన్ బెయిల్ రద్దు కేసు కొట్టేసారు అంటూ, ట్వీట్ చేయటం సెన్సేషన్ అయ్యింది. ఇదే విషయం పై, రఘురామరాజు కోర్టులో కేసు కూడా వేసారు. ఇందులో కుట్ర ఉందని, అలాగే ఇది కోర్టు దిక్కరణ కిందకు కూడా వస్తుంది అంటూ కోర్టులో కేసు వేసారు. దీని పైన వాదనలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, రేపు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై, తీర్పు రానున్న నేపధ్యంలో, సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకుని, రఘురామకృష్ణం రాజు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి, అందరినీ ఆశ్చర్య పరిచారు.

cbi 14092021 2

రఘురామకృష్ణం రాజు ఈ రోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. రేపు జగన్ బెయిల్ రద్దు కేసు పై సిబిఐ కోర్టులో తీర్పు వస్తుందని, అయితే తనకు ఆ తీర్పు మీద నమ్మకం లేదు అంటూ, రఘురామకృష్ణం రాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంతో, తీర్పు ప్రభావితం అయ్యే అవకాసం ఉంది అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ, పిటీషన్ దాఖలు చేసారు రఘురామరాజు. నిష్పాక్షికమైన తీర్పు రావాలి అంటే, ఈ పిటీషన్ ను వేరే బెంచ్ కు మార్చాలి అంటూ, ఆయన తెలంగాణ హైకోర్టుని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ ని తెలంగాణా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీని పై మరి కొద్ది సేపట్లో విచారణ జరగనుంది. లాస్ట్ మినిట్ లో చోటు చేసుకున్న ఈ పరిణామం భారీ ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ మొత్తం పరిణామం పై జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదులు కూడా పరిశీలన చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా, జీఆర్‍ఎంబీ, కేఆర్‍ఎంబీ పరిధిలోని సాగు నీట ప్రాజెక్ట్ లను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి సంబందించిన గజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. వచ్చే నెల 15 నుంచి ఈ గజిట్ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందని, ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాజెక్ట్ లను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ సాఫీగా సాగేందుకు, కేంద్ర ప్రభుత్వం లింక్ ఆఫీసర్ ల పేరుతో నలుగురు ఉన్నతాధికారులను నియమించింది. కేంద్ర జల సంఘంలో పని చేస్తున్న, డాక్టర్ ఎంకే మిశ్రా, డాక్టర్ జీకే అగర్వాల్, వీరి ఇద్దరినీ కూడా గోదావరి నది యాజమాన్య బోర్డుకు, డీకే శివరాజన్, అనుపమ అనే చీఫ్ ఇంజనీర్లని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు నియమించింది. ఈ నలుగురు కూడా, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నదీ యాజమాన్య బోర్డులకు అనుసంధానంగా వివాహరిస్తారని కేంద్రం జల సంఘం పేర్కంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం గత రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఢిల్లీలో జీఆర్‍ఎంబీ, కేఆర్‍ఎంబీ చైర్మెన్లతో, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి సమావేశం ఉండటంతోనే, గత రాత్రే ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

water 13092021 2

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ రైతాంగం, మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపధ్యంలో, గజిట్ నోటిఫికేషన్ అమలులోకి వస్తుందా లేదా అనే సందేహాలు ఉన్నప్పటికీ కూడా, ప్రస్తుతం అధికారుల నియామకం నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం ముందుకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నది అనేది స్పష్టం అవుతుంది. ఉమ్మడి ప్రాజెక్ట్ లు మినహా, మిగతా వేటినీ కేంద్రం తమ పరిథిలోకి తీసుకోకూడదు అనే అభ్యంతరాలు వస్తున్నా, ఆర్ధిక పరమైన అంశాల పై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందు సాగర్, శ్రీశైలం, పులిచింతల పరిధిలో తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పై, ఏమి చేయలేని జగన్ ప్రభుత్వం, కేసీఆర్ తో కూర్చుని మాట్లాడకుండా, కేంద్రానికి లేఖలు రాసి ఆ ప్రాజెక్ట్ లు కేంద్రం నోటిఫై చేసి, కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఉత్తరం రాయగా, ఇదే అదునుగా భావించిన కేంద్రం, ఏకంగా అన్ని ప్రాజెక్ట్ లను తమ ఆధీనంలోకి తీసుకుని, రెండు రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది.

పెగసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు ఎస్‍జీ తెలిపారు. పెగసస్‍పై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ పిటిషన్లు దాఖాలు అయ్యాయి. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదని కేంద్రం తమ అభిప్రాయంగా సుప్రీం కోర్టుకు తెలిపింది. పెగసస్ అంశం అత్యంత ముఖ్యమైనదేనన్న సోలిసిటర్ జనరల్, స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దేశభద్రత, శాంతిభద్రతల అంశాల్లోకి వెళ్లడం లేదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రామన్, డిపెన్స్ తదితర విషయాలు అడగట్లేదని మేము అడిగినవి చెప్తే చాలని అన్నారు. కేంద్రం పదేపదే అవే అంశాలను ప్రస్తావిస్తుందని చీఫ్ జస్టిస్ అన్నారు. పెగసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం గుర్తుంచుకోవలనింనారు. పౌరహక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని, కేంద్రాన్ని ఆదేశించారు. గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం అని, కారణం ఏమైనా.. ప్రకటన చేయడానికి కేంద్రం ఇష్టపడట్లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలో ఆలోచించి జారీ చేస్తామన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

nvramana 13092021 2

రెండు మూడు రోజుల్లోనే ఈ అంశం పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. అన్ని ఆరోపణలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్న కేంద్రం తరుపున సోలిసిటర్ జనరల్ తెలిపారు. అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు అని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న ఎస్‍జీ కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు కూడా తాము రెండు మూడు రోజుల్లోనే దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని అన్నారు. మరో పక్క పిటీషనర్ తరుపున న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, వాస్తవాలు చెప్పబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ప్రకటన చేయడం భద్రతకు సంబంధించిన విషయం కాదు అని అన్నారు. సాధారణ ప్రజలే లక్ష్యంగా చట్టవిరుద్దంగా పెగసెస్ వాడారని తెలిపారు. దేశ పౌరులపై పెగసెస్ స్పైవేర్‍ను ఉపయోగిస్తున్నారని, స్పైవేర్ ఉపయోగించడం పూర్తిగా చట్టవిరుద్దమైందని, మేం చేయాల్సింది చేస్తామన్న విధంగా కేంద్రం తీరు ఉందని అన్నారు. 120 మంది భారతీయుల ఫోన్లు పెగసస్ ప్రభావానికి గురైనట్లు నివేదికలు ఉన్నాయని, నివేదికలను పరిశీలించినట్లు స్వయంగా కేంద్రమంత్రే ప్రకటించారని సిబల్ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read