అసలు ఈ రోజు జోగి రమేష్, కొంత మంది రౌడీలను వేసుకుని, ఏకంగా చంద్రబాబు ఇంటి వరకు ఎందుకు వచ్చాడు, అసలు ఇష్యూ ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. అసలు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు ? ఆయన చేసిన విమర్శలు ఏమిటి ? అసలు చంద్రబాబు ఇంటి మీదకు వచ్చీ ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది ? ఎప్పుడూ లేనిది ప్రతిపక్ష నేత, అలాగే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి ఇంటి పైకి వెళ్ళేంత ఏమి ఉంది ? ఇలా చాలా మందికి అసలు అయ్యన్న ఏమన్నారో తెలియదు. నిన్న కోడెల వర్ధంతి సందర్భంగా, జరిగిన కార్యక్రమంలో, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గుని, ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధ్వాన పాలన పై, స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, చెత్త మీద పన్ను వేసారని, ఇలాంటి వారిని చెత్త నా *** అని అనక ఏమంటారని అన్నారు. మరుగు దొడ్డి మీద పన్నులు వేసే వాడిని ఎక్కడైనా చూసామా ? అని అయ్యన్న ప్రశ్నించారు. 80 రూపాయల మందు బాటిల్ ని, 200 కి అమ్ముతున్నారు అని అన్నారు. ఈ మధ్య కాలంలో కరెంటు బిల్లు చూసారా, వీపు పేలిపోతుంది కదా అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెంచుకుంటూ పోతా, పెంచుకుంటూ పోతా అంటే, మీరు ఏదో అనుకున్నారు, చివరాకు పెంచింది ఇవి అని అన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్న వాడిని, ముఖ్యమంత్రిని చేసాం, అనుభవిస్తున్నాం అని అన్నారు.

jogicbni 1792021 2

ఇలా మాట్లాడుతున్నానని నన్ను ఏమి పీకుతారు, మహా అయితే జైల్లో పడేస్తారు, పడేయండి అంటూ ఛాలెంజ్ చేసారు. అలాగే మంత్రులు గురించి కూడా అయ్యన్న మాట్లాడారు. నెల్లూరు ఇరిగేషన్ మంత్రికి టిఎంసి అంటే ఏంటో తెలియదు, బెట్టింగ్ ఆడతాడు అని అన్నారు. అలాగే కొడాలి నాని గురించి మాట్లాడుతూ, సన్న బియ్యం అని కూసిన నాని బూతులు మంత్రి, గుడి దగ్గర కొబ్బరి చిప్ప అమ్ముకునే వాడు, దేవాదాయ మంత్రి అంటూ మాట్లాడారు. హోంమంత్రి దిశ చట్టం లేకపోయినా, శిక్షలు వేసేశాం అని చెప్తున్నారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి చట్టం లేకుండానే, పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేసారని అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని, ఈ అప్పులు తీర్చాల్సిందే మనమే అని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మాంసం అమ్మటం, సినిమా టికెట్లు అమ్మటం కాదని, బ్రాందీ షాపుల్లో చీకులు, సినిమా బ్లాక్ టికెట్లు, మల్లె పూలు అమ్ముకో అని ఘాటుగా విమర్శలు చేసారు. అంబటి రాంబాబుకి గంట కావాలి అంట, అవంతికి అరగంట చాలు అంట, వీళ్ళు మన నేతలు అని అయ్యన్న అన్నారు. ఈ వ్యాఖ్యలకే జోగి రమేష్, చంద్రబాబు ఇంటికి వెళ్లి, హడావిడి చేసారు.

చంద్రబాబు ఇంటి పై వైసీపీ నేతలు, కార్యకర్తలు మెరుపు దా-డి చేసారు. నిన్న అయ్యన్నపాత్రుడు, జగన్ మోహన్ రెడ్డికి పాలన చేతకాదు అంటూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల పై నిరసన అంటూ, వైసిపీ జోగి రమేష్, కొంత మంది వైసిపీ నేతలను వేసుకొచ్చి, చంద్రబాబు ఇంటి పైన కర్రలు, రాడ్డులు, రాళ్ళతో దా-డి చేసారు. దీంతో అక్కడ ఉన్న వారికి గాయాలు అయ్యాయి. బుద్దా వెంకన్న పడిపోయారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పటికీ పోలీసులు జోగి రమేష్ ని అక్కడ నుంచి తరలించ లేదు. ఇంకా దా-డు-లు చేస్తూనే ఉన్నారు. అయినా పోలీసులు ఇంకా జోగి ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళటం లేదు. ఇంకా ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది. దాదపుగా గంట అవుతున్నా, ఇంకా అక్కడే ఉన్నారు. ఇది కావలని చేపించనట్టు ఉంది. ఒక మాజీ సియం ఇంటికి, ఇలా రావటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పులు ఇప్పుడు టాక్ ఈఫ్ ది నేషన్ కూడా అయ్యాయి. చిత్ర విచిత్రంగా అప్పులు తెస్తూ, కార్పోరేషన్ల ద్వారా అప్పులు తెస్తూ, కొన్ని అప్పులను కనీసం బడ్జెట్ లో కూడా చూపించని వైనం అందరినీ షాక్ కు గురి చేసింది. పయ్యావుల కేశవ్ అడిగిన ప్రశ్నలకు, పెట్టిన ప్రెస్ మీట్ లకు ప్రభుత్వం షేక్ అయిపొయింది. ఇప్పటికీ కేంద్రం రంగంలోకి దిగగా, ఇప్పుడు కాగ్ కూడా రంగంలోకి దిగింది. ప్రభుత్వం ఆర్ధిక పరంగా చేస్తున్న అవకతవకలను గుర్తించిన కాగ్, వాటి పై సమాధానం ఇవ్వాలని కోరుతుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. రాష్ట్ర ఫైనాన్స్ ప్రినిసిపల్ సెక్రటరీ రావత్ కు లేఖ, కాగ్ నుంచి లేఖ వచ్చింది. దాదాపుగా రూ.18,241 కోట్లకు సంబంధించిన లెక్కలు గురించి అడుగుతూ లేఖ రాసారు. అలాగే మూడు వేరు వేరు బిల్లులు ద్వారా 10,895.67 కోట్ల వరకు పీడీ ఎకౌంటులను డ్రా చేసారని, అవి ఎందుకు చేసారని కాగ్ ప్రశ్నించింది. అలాగే మరో 6,223.41 కోట్ల వరకు 63 పీడీ ఎకౌంటుల నుంచి అమ్మ ఒడి స్కీంకు మళ్ళించారని, దాని పై కుడా ఇవ్వరన ఇవ్వలని కాగ్ కోరింది. ఈ ట్రాన్స్ఫర్ లు, ఏ కోడ్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసారో చెప్పాలి అంటూ, కాగ్, ప్రభుత్వాన్ని కోరుతూ, పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది.

cag 1602021 2

అలాగే మరో 227.42 కోట్ల, రెండు బిల్లులు ద్వారా సెల్ఫ్ డ్రాల్ అంటూ తీసుకున్నారని, దీని పై కూడా వివరణ ఇవ్వాలని క్రాయింది. అలాగే కొన్ని బ్లాంక్ బిల్లులు ద్వారా 222 కోట్లు మళ్ళించారని, ఇలా ఎందుకు మళ్ళించారు, దేని కోసం మళ్ళించారో చెప్పాలి అంటూ, కాగ్ వివరణ అడిగింది. వివిధ బిల్లులకు సంబంధించి, సాంక్షన్ ఆర్డర్, ప్రొసీడింగ్స్, వర్క్ ఫ్లో వివరాలు ఇవ్వాలి అంటూ రాష్ట్రాన్ని కోరింది. మొత్తంగా వివిధ కార్పోరేషన్ల ద్వారా ఎన్ని రుణాలు, ఎలా తీసుకుని వచ్చారు, దేని కోసం ఖర్చు చేసారో చెప్పాలని కాగ్ కోరింది. అలాగే వాటికి ఎంత వడ్డీ చల్లిస్తున్నారు, ప్రభుత్వం ఏ రకమైన గ్యారంటీ ఇచ్చింది, లాంటి వివరాలు కూడా చెప్పాలని కాగ్ పేర్కొంది. అలాగే అప్పు తీర్చటానికి ఉన్న ఆదాయ వనరులు ఏమిటి అనే విషయం కూడా ప్రశ్నించింది. కొన్ని అప్పులు బడ్జెట్ లో చూపక పోవటం పై కూడా ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే కాగ్ ఈ లేఖ రాసినట్టు, తెలుస్తుంది. మరి వీటి మీద ప్రభుత్వం, ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాల్సి ఉంది.

జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రగతి పై నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. అంతే కాదు, రెండున్నరేళ్ళకే ఇలాంటి వ్యాఖ్యలు రావటం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైన సంకేతాలను జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం చివరిలో, ఆయన మంత్రులతో మాట్లాడారు. ఆ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు రెడీ అవ్వాలి అంటూ, మంత్రులకు చెప్పటంతో అందరూ షాక్ తిన్నారు. ఇంకా రెండున్నరేళ్ళు ఉండగా, ఇప్పుడే ఇదేమిటి అంటూ షాక్ తిన్నారు. వచ్చే ఏడాది మే నాటికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ అవ్వాలి అని జగన్ చెప్పటం పై అందరూ షాక్ తిన్నారు. దీంతో పాటుగా, మరో సంచలన ప్రకటన కూడా జగన్ మోహన్ రెడ్డి చేసారు. ప్రశాంత్ కిషోర్ టీం కూడా త్వరలోనే రంగంలోకి దిగుతుంది అంటూ, మంత్రులకు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని అంటేనే, ఎన్నికలకు వీరు రెడీ అవుతున్నారని, ఎన్నికలకు సన్నధం అవుతున్నారని స్పష్టం అవుతుంది.

cabinet 16092021 2

అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అనేది కూడా చర్చ జరుగుతుంది. లేకపోతే ఇంకా సగం టైం మిగలి ఉండగానే, ఎన్నికలకు రెడీ అవ్వమని చెప్పటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రశాంత్ కిషోర్ టీం వచ్చే లోపే, పార్టీ నేతలు అందరూ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు అన్నీ రూపొందించుకోవాలి అంటూ ఆయన స్పష్టం చేసారు. త్వరలోనే గడపగడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం ప్రారంభించాలని అన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ ప్రజలకు చెప్పాలని, ఇక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అనే విషయం స్పష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 80 శాతం మంది వరకు ఎన్నికల బాధ్యతులు ఇస్తామని చెప్పినట్టు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read